డైలీ సీరియల్

అనంతం-62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలి తరంగాలు సుళ్ళుతిరుగుతూ పొదల్లో ‘అశాంతి’కల్పిస్తుంటే, అవ్వి- దెయ్యపిల్లల్లా ఏడుస్తున్నట్టుంది!
ఇంకొంచెం ముందుకువెళ్ళాడు గోపీనాయక్..
దారిలో క్రిందపడి వున్న ఓ చేతి కడియం చూసి ఆగిపోయాడు!
సందేహం లేదు..
అది రాగ్యా చేతి కడియం!
మనసు కీడు శంకిస్తుంటే ఆలోచనల్ని అదిమి పట్టి, క్రిందికి వొంగి చేతి కడియం అందుకొన్నాడు... పరీక్షగా చూసాడు.
అవును.. అది రాగ్యా కడియమే!
చుట్టూ చూసాడు.
ఓ పెద్ద రాతి పలకమీద ఖాళీ విస్కీసీసాలూ, వెలగ పండ్ల పెంకులూ కనిపించాయి!
అవ్వి చీప్ లిక్కరు సీసాలుకావు..
దొరలు తాగే విదేశీ విస్కీ సీసాలు!
అక్కడ ఎందుకున్నాయి?
ఏదో ఘోరం జరిగిందనుకున్నాడు గోపీనాయక్!
హడావుడిగా నేలమీద అణువణువూ గాలించాడు.
కొంత దూరంలో మానవాకారంలో ఆరిపోయివున్న చితి బూడిద కనిపించింది!
గోపీనాయక్ గుండె ఝల్లుమన్నది!
ముందుకు వెళ్ళాడు..
కళ్ళు విప్పార్చి చూసాడు!
ప్రక్కనే రాగ్యా ధరించే పూసల దండ కనిపించింది..
రాగ్యాని చంపి, దహనం చేశారని తేలిపోయింది!
గోపీనాయక్ తల విదిల్చుకున్నాడు! బాధని దిగమింగుతూ, లోలోపలే అగ్నిపర్వతంలా ఉడికిపోతూ,
నివురుకప్పిన నిప్పులా ‘శాంతం’గా అడుగులువేస్తూ గొలుసుకొండల వైపుకు సాగిపోయాడు!
* * *
నల్లకొండ దగ్గరి గుడారాల్లో హడావుడిగా వుంది!
ఢిల్లీనుంచి, హైద్రాబాదునుంచి ‘అధికార ప్రతినిధులు’ వొచ్చారు.
‘కలివికోడి రక్షిత ప్రాంత నిర్మాణం’ వాళ్ళ తక్షణ సమస్య!
అత్యవసర సమావేశం జరుగుతున్నది.
అధికారులందరూ చర్చలు జరుపుతున్నారు!
నిపుణులు, మేధావులు సలహాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు!
యధాప్రకారం,
మళ్ళీ గుడారాల వెలుపల గాడి పొయ్యిల మీద ఆహార పదార్థాలు ఉడుకుతున్నాయి..
సువాసనలు పరిసరాల్లో వ్యాపిస్తున్నాయి.
‘‘ఉడికేది నెమలి మాంసం కదూ’’గట్టిగా వాసన పీల్చి అడిగాడు, ఢిల్లీ అధికార ప్రతినిధి.
‘‘అవును! జాతీయపక్షే!’’అన్నాడు, హైద్రాబాదు ప్రతినిధి.
‘‘మీరెలా ఊహించారూ’’
‘‘ఊహకాదు! వండమని చెప్పి నెమళ్ళని తెప్పించింది నేనే’’
‘‘మీ టేస్ట్ అద్భుతం’’
‘‘అంతా మీ గౌరవార్థం’’అన్నాడు, హై.అ.ప్రతినిధి.
‘‘నౌ- లెటజ్ కం టు ది పాయింట్..’’
ఆసక్తిగా అందరూ ఢీ.అ.ప్రతినిధి వైపు చూశారు.
‘‘ఇక్కడి అడవి భూముల విషయంలో బహుళ జాతి కంపెనీలవారి ఆసక్తి చూస్తుంటే నాకేదో అనుమానంగా వుంది! భూగర్భంలో నిక్షిప్తమై వుంది బాక్సయిట్ ఒక్కటేనా?’’ ఢి.అ.ప్ర అడిగాడు.
‘‘సమాధానం నేను మాత్రమే చెప్పగలను.’’
‘‘ఎవరు మీరు?’’
‘‘చరిత్ర పరిశోధకులు... మేధావి’’ అని హై.అ.ప్ర. అతన్ని ఢి.అ.ప్రకి పరిచయం చేశారు.
‘‘చెప్పండి’’
‘‘మణి మాణిక్యాలు, వజ్రవైఢూర్యాలూ, బంగారం కూడా ఉండాలి’’
‘‘ఎలా చెప్పగలరూ’’
‘‘చరిత్ర పరిశోధన అంటే అదే మరి! శత్రు రాజ్యాలకీ, దొంగలకీ భయపడి రాజులు తమ సంపదలను దాచుకున్నది అడవుల్లో, దేవాలయాల్లో!
దేవాలయాల్ని త్రవ్వుతున్నాం! ఇక త్రవ్వాల్సిందీ అడివి భూముల్నే.’’
‘‘మీ అంచనా ప్రకారం భారతభూభాగంలో నిక్షిప్తమై- మొత్తం ఎంత భూగర్భ సంపద ఉండొచ్చు?’’
‘‘బొటాబొటిగా సరిపోవచ్చు.’’
‘‘సంపద మొత్తం వెలికి తియ్యాలంటే ఎలా?’’
‘‘నేను మాత్రమే చెప్పగలను..’’
‘‘మీరెవ్వరూ?’’
‘‘మేధావి’’ అని, అతన్ని పరిచయం చేశాడు, హై.అ.ప్ర.
‘‘చెప్పండి’’ అన్నడు ఢి.అ.ప్ర.
‘‘ఆధునిక పరికరాలతో మొత్తం భూభాగాన్ని త్రవ్వి తిరగెయ్యాలి! పూర్వీకుల నల్లపూసల దండలతో సహా దొరుకుతాయి.’’
‘‘మీ ప్రతిపాదన కేంద్రానికి పంపిస్తాను’’ అన్నాడు ఢి.అ.ప్ర.

-ళనఆ
‘‘కలివికోడి రక్షిత ప్రాంతం వెంటనే నిర్మించండి! భూవిచుట్టూ కంచె వేసి ముంథుగా స్వాధీనంలోకి తెచ్చుకుందాం! తర్వాత మనిష్టం,’’ అన్నాడు ఢి.అ.ప్ర.
హై.అ.పు. ఏదో చెప్పబోయాడు.
అంతలో గుడారాల బైట వాహనాలు ఆగిన చప్పుడు వినిపించింది!
‘‘మావాళ్ళేనా?’’ బంట్రోతును హై.అ.ప్ర. అడిగాడు.
‘‘పోలీసు వాహనాలు’’అని బంట్రోతు చెప్పాడు.
‘‘సారీ ఫర్ ది డిస్టర్బెన్స్’’అంటూ ఎవ్వరో లోపలికొచ్చారు.
‘‘ఏం కావాలి?’’ క్రిందిస్థాయి పోలీసు ఉద్యోగిన్ని చూసి అధికారి అడిగాడు..
‘‘శవాల్ని తెచ్చాం.’’
‘‘కాల్చాలా- పూడ్చాలాసార్.’’
పోలీసు అధికారికి కోపం వచ్చింది!
‘‘కాల్చేసెయ్యండి! గెట్‌లాస్ట్!’’అని అరిచాడు పెద్దగా.
క్రిందిస్థాయి అధికారి వినయంగా సెల్యూట్ చేశాడు... బైటికి వెళ్ళాడు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు