డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -127

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశం నుండి నిర్మల జలం కురిసినట్లు పవిత్ర భావంతో చేసిన యజ్ఞం వలన సత్పుత్రులు పుడుతారు. కర్తవ్యాన్ని కర్తవ్యంగా స్వీకరిస్తూ దానిని పాటించలేకపోతే భయపడుతూ, లోకంలో సమస్తాన్ని బ్రహ్మగానే భావిస్తూ, అహంకారాన్ని వీడి ప్రవర్తించినవాడే నిజమైన బ్రాహ్మణుడు. కర్మ నిర్వహణలో ఏదైనా లోపం జరిగినా నిష్కామ భావంతో చేస్తే అది మంచి ఫలితానే్న ఇస్తుంది.
పూర్వ బ్రాహ్మణులు సత్య యజ్ఞాన్ని పాటించి మోక్షం మీదనే ఆసక్తి కలిగి ఉండేవారు. అటువంటి బ్రహ్మ వేత్తలైన బ్రాహ్మణులను సంతోషపెడితే దేవతలను సంతోష పెట్టినట్లే. చాలామందికి ధర్మమే ఆధారం. కాని అందరి కన్నా గొప్పవాడు పరమాత్మ. సర్వవ్యాపకుడై అంతటా ఉంటాడని అయనను జ్ఞానులు మాత్రమే దర్శించగలరు.
ఆశలు లేనివాడు, సకామ కర్మలు చేయనివాడు, నమస్కారాలకు, స్తుతులకు దూరంగా ఉండేవాడు. ధర్మ క్షయం లేని వాడు, కర్మ బంధాలు తొలగిన వాడు, బ్రాహ్మణుడని దేవతలు భావిస్తారు.’’
అప్పుడు జాజలి మరల ఇలా అడిగాడు. ‘‘వణిజా! నీవు చెప్తున్న ఆత్మయజ్ఞం గురించి నేను ఎన్నడూ వినలేదు. దాని గురించి వివరించు’’. తులాధరుడు ఇలా వివరించాడు - ‘‘దేవతల నర్చించటానికి శ్రద్ధను పత్నిగా చేసికొని యజ్ఞానే్న దేవతలుగా ఆరాధించి, ఉన్న రూపంతోనే యజ్ఞ పురుషుడైన విష్ణువును పొందవచ్చును.
యజ్ఞ విధిలో ఉన్న సర్వ పశువు ల పాలతో చేసిన పురోడాశమే పవిత్రమైనది. నదులన్నీ సరస్వతీ స్వరూపాలే. పర్వతాలన్నీ పవిత్రాలే!
ఆత్మీయ తీర్థం అహింసా ధర్మాన్ని పాటిస్తూ విశేష కారణాలతో ధర్మాన్ని అనుసంధానం చేస్తూ పుణ్యలోకాలను పొందవచ్చు’’ అతను మరల ఇలా అన్నాడు
‘‘నేను చెప్పిన ఈ మార్గాన్ని మంచివారు అనుసరిస్తున్నారా, చెడువారు అనుసరిస్తున్నారా - ఈ విషయం బాగా గమనించి తెలుసుకో. అలాగే ఆకాశంలో ఎన్నో పక్షులు ఎగురుతున్నాయ. అందులో నీ తలమీద గ్రుడ్లుపెట్టిన పక్షులు కూడా ఉన్నాయ. వాటికి నీవు తండ్రి వంటి వాడివి కనుక నీవు పిలిస్తే అవి తప్పక వస్తాయ. వాటిని పిలువు’ అన్నాడు.
అప్పుడు జాజలి పిలువగా ఆ పక్షులు ఎగురుకుంటూ అతని దగ్గరకు వచ్చాయ. అవి ఆ మునితో ఇలా అన్నాడు. ‘‘బ్రాహ్మణోత్తమా! అహింసతో చేసిన కర్మయే ఇహపర లోకంలో సత్ఫలితాన్ని ఇస్తుంది. హింసా భావం వలన శ్రద్ధ నశించిపోతుంది. ఏ యజ్ఞం అయనా శ్రద్ధతో చేస్తే అది నిష్ఫలం కాదు. శ్రద్ధ సూర్యుని పుత్రి. అందుకే ఆమెను వైవస్వతి, సావిత్రి, ప్రసవిత్రి అని కూడా అంటారు.
మనస్సు కూడా శ్రద్ధ తర్వాతే. పాప విమోచన శ్రద్ధ కలవాడు ఎప్పుడూ పవిత్రుడే. అతనికి మరే తపస్సు అవసరం లేదు. ఆత్మ విచారణ అక్కర్లేదు. సాత్త్విక, రాజసిక, తామసాలలో దేనిపై శ్రద్ధ ఉంటే అదే పొందుతాడు. కనుక మునిశ్రేష్ఠా! జాజలీ! ఇదే ధర్మ స్వరూపం. దీనిపై మనస్సు పెట్టు. దీనిని అనుసరించి, ఆచరించి పరమగతిని పొందవచ్చు. శ్రద్ధా పూర్వకంగా ధర్మంపై నిలిచినవాడు సాక్షాత్తు ధర్మ స్వరూపుడే. అతనే అందరికన్న శ్రేష్ఠుడు.’’
ఆ తర్వాత కొంత కాలానికి జాజలి, తులాధరులు ఆ పరమ ధామాన్ని చేరి సుఖంగా ఉన్నారు. తులాధరుడు, పక్షులు, చక్కగా ధర్మాన్ని ప్రతిపాదించారు. జాజలి ఆ విషయాలను శ్రద్ధతో గ్రహించి, ఆచరించి, సత్ఫలితాన్ని పొందాడు.
- సంపూర్ణం -

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి