డైలీ సీరియల్

పరమాత్ముని క్రీడా వినోదమే సృష్టి ( కుచేలోపాఖ్యానం - 5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతలో పట్టుపీతాంబరాలు ధరించి మెల్లగా ఇద్దరూ అంగనామణులు వచ్చి కుచేలుని లోపలికి ఆహ్వానించారు. ఈ భవనం ఎవరిదో కదా ఇందులో నుంచి వచ్చిన వారు నన్ను పిలుస్తున్నారేమిటి అనుకొంటూనే వారి వెంట కుచేలుడు వెళ్లాడు.
అట్లా ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే కుచేలుని భార్య మందస్మితయై తలవంచుకుని చేతిలో బంగారు కలశంతో నీరు తీసుకొని వచ్చి తన భర్త పాదాలను కడిగింది. కనులెత్తి కుచేలుని చూసింది. ఆమె మెడలో సువర్ణ్భారణాలు మిలమిలా మెరిసిపోతున్నాయి. ఆమెధరించి దుస్తులు, ఆమె కురుల్లో సువాసనలీనుతున్న విరులు మైమరిపిస్తున్నాయి. ఆశ్చర్యంతో ఆనందంతో ఇది మన ఇల్లా అని కళ్లతోనే కుచేలుడు ఆమెనడిగాడు. ఆమె కూడా కళ్లతోనే సమాధానం ఇచ్చింది. మనసులో కుచేలుని కౌగిలించుకుంది. వాస్తవంగా పాదాలను స్పృశించి నమస్కారం చేసింది. ఆ తరువాత మెల్లగా రండీ అని ఆహ్వానిస్తూ దేవుని గది దగ్గరకు తీసుకొని వెళ్లింది. ఇంట్లో అడుగుపెడుతుంటే ఇల్లంతా మంచి మంచి పండ్లతోను, పూవులతో నిండి ఉన్న సువాసనాభరితమైన వాసనలు వస్తున్నాయ. . దేవుని గది లో దేదీప్యమానంగా వెలుగుతున్న జ్యోతుల మధ్య పరంజ్యోతి స్వరూపుడైన శ్రీకృష్ణుని విగ్రహం చిరునవ్వుతో చూసినట్లు అనిపించింది కుచేలునికి కళ్లు నులుపుముకుని మరలా చూశాడు. ఆ విగ్రహం కళ్ళెగరేసి కుచేలా సంతోషమేనా? నీవు నన్ను అడగక్కర్లేదు. నాకు అంతా తెలుసు అని చిరునవ్వు నవ్వినట్లు అనిపించింది. అక్కడే కుచేలుని పిల్లలంతా తమ స్నేహితులతో కూర్చుని కృష్ణుని చర్యలను కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. కృష్ణుడు చిన్నపుడు తన సంగడీలతో గోవులను మేపడానికి వెళ్లేవాడట. అక్కడ గోపబాలురతో కలసి చద్ది కుడిచేవాడట. వారంతా కృష్ణుడికి తాము తెచ్చుకున్న వూర గాయముక్కలను, చల్దిని కూడా నోటికి అందించే వారట. కృష్ణుడు కూడా వారికి తాను తెచ్చుకుంది పెట్టేవాడట. ఈ చల్దిని కుడిచే సందర్భాన్ని చూడడానికి బ్రహ్మదేవతలు కూడా వచ్చేవారట. చిన్నప్పుడు కృష్ణుడు అందరిఇండ్లల్లో వెన్నను దొంగలించి తన స్నేహితులకు పెట్టేవాడట. ఆయనకు స్నేహితులంటే చాలా ప్రేమ. మా నాన్నగారు కూడా ఆయన స్నేహితులే కనుక మాకు ఇంత ఐశ్వర్యం ఇచ్చారు. అందుకే మేమంతా కృష్ణ్భజన చేస్తున్నాం. అంటూ వారు వారి స్నేహితులతో మాట్లాడడం చూసి కుచేలుడు పరమానందభరితుడయ్యాడు. దాన్ని చూసి కుచేలుడుధారాపాతంగా కన్నీళ్లు కారసాగాయ. అఖిలలోక నాయకుడవు, సర్వాంతర్యామివి, నిత్యానందుడివి, ఆపార కరుణాసముద్రుడవు అంటూ రెండూ చేతులెత్తి నమస్కరించి తన భార్యను చూసి ఆనందిస్తూ తన పిల్లల చెంత కూర్చుని ఆ కృష్ణుడు చేసిన ఘనకార్యాలను తాను చెప్పడం ఆరంభించాడు.
నిజమే కదా. కృష్ణుడిపై అచంచలమైన ప్రేమను, భక్తిని పెంపొందించుకుంటే చాలు ఆ పరమాత్మ మనలను ఏ క్షణమైన ఏమరక కాపాడుతాడు కదా.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి