డైలీ సీరియల్

విలువల లోగిలి-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా ఆ జంట దంపతులయిన సందర్భంలో కంపెనీ స్ట్ఫా అందరూ వేడుక చేసుకోవాలని, తప్పదని అనటంతో చంద్రని చిన్నబుచ్చుకోనివ్వకూడదని అంగీకరించింది. మొదటిసారి తల్లిని వదిలి దూరంగా వెళ్లింది. సుగుణని రమ్మని ఎంత బ్రతిమాలినా నిరాకరించటంతో వెళ్లక తప్పలేదు. జాగ్రత్తగా చూసుకోమని భువన పెద్దమ్మకి అప్పజెప్పి వెళ్లింది. ‘అమ్మ నా దగ్గిరే ఉంటుంది’ అని ఆవిడ హామీ ఇచ్చాకే విశ్వ ప్రయాణానికి సిద్ధమైంది. అలా ఆ ట్రిప్ అవగొట్టుకుని వచ్చింది.
కొత్త బ్రాంచి పెట్టడానికి విషయ సేకరణలో చంద్ర బిజీ అవటంతో ఆ సమయాన్ని తను శాంతి కాపురం చక్కదిదటానికి ఉపయోగించుకోవాలనుకుంది. వాళ్ళలో మార్పు ఎలా తీసుకురావాలో అన్న విషయంపైన సుగుణతోనూ, భువన పెద్దమ్మతో కూడా చర్చించింది. ఎంతైనా అనుభవజ్ఞులు కదా! అందరూకలిసి ఒక ప్లాను తయారుచేసుకున్నాక శాంతికి ఫోను చేసి వస్తున్నానని చెప్పింది.
విశ్వ ప్రయత్నం ఫలిస్తుందని నమ్మకం లేకపోయినా చిన్ననాటి స్నేహితురాలితో నాలుగు రోజులు గడిపే అవకాశం కలిగినందుకు చాలా సంతోషించింది. ఇంట్లో వాళ్లకి కూడా కాదనటానికి కారణం దొరకలేదు. అందులో విశ్వ ఇపుడు మామూలు అమ్మాయి కాదు కోటీశ్వరుల కోడలు. తను ఉన్నన్ని రోజులు కోడలిని అపురూపంగా చూసుకుంటున్నట్లు నటించాలని వారి పథకాలు వారూ వేసుకుంటున్నారు. న్యాయ, అన్యాయాల పోరాటం అనాదిగా వస్తున్నదే. ఆలస్యమైనా విజయం ఎప్పుడూ న్యాయానిదే. అన్యాయాన్ని అనుసరిస్తున్నవాళ్లకు అది ఆలస్యంగా అర్థమవుతుంది. అంతే!
‘‘అమ్మా! సరదాగా నువ్వూ రామ్మా’’ అడిగింది విశ్వ గారంగా.
‘‘వద్దు విశ్వా. ఈసారికి నువ్వెళ్ళు. నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నువ్వో మార్పు తీసుకురావటానికి వెళుతున్నావు. దాని మీద ధ్యాస పెట్టు. మనం కలిసి వెళ్ళేవి ముందు ముందు చాలానే వుంటాయి’’ అనిసర్ది చెప్పింది.
‘నువ్వెప్పుడూ ఇంతే. అందరూ నా మాట వింటారు. నువ్వు మాత్రం నీ మాటే నేను వినాలని అంటావు’’ అంది బుంగమూతి పెట్టి విశ్వ.
‘‘మా విశే్వనా! ఇలా గారాలు పోతోంది. అమ్మను గదా. అందుకే నువ్వు నా మాట వింటావు. ఓ బుజ్జి పాపనో, బుల్లి బాబునో నాకిచ్చేసేయ్. అపుడు వాళ్ళను చూసుకుంటూ నువ్వేం చెబితే అది వింటాను. నీ మాట కసలు అడ్డురాను. ఏమంటావ్?’’
‘‘దీనే్న వేలికి వేస్తే కాలికి, కాలికేస్తే వేలికి అంటారు’’.
‘‘ఇంతకీ నా కోరిక తీరుస్తావా లేదా అది చెప్పు’’
‘‘ఇప్పుడే కదమ్మా మనవడు, మనవరాలు గురించి అప్లికేషన్ పెట్టుకున్నావ్. ఇంకా ముందు పరిశీలించవల్సినవి చాలా ఉన్నాయి. వరుస క్రమంలో మీ వంతు వచ్చేవరకూ ఆగాల్సిందే’’.
‘‘చిత్తం అమ్మగారూ’’ అంది సలామ్ చేస్తూ.
‘‘పోమ్మా! నువ్వు మరీనూ!’’ అంటూ ఆమె ఒళ్ళో చేరిపోయింది. తన కళ్ళముందు చిట్టి చిట్టి అడుగులు వేస్తూ పెరిగిన పిల్ల అప్పుడే ఎదిగిపోయి ఓ చిన్నారిని తనచేతుల్లో పెట్టగలిగేంత పెద్దదయింది. ఇన్నాళ్ళూ నత్తనడకలా కదిలిన కాలం ఇపుడు శరవేగంతో కదులుతున్నట్లుగా అనిపిస్తోంది.
జీవితం ఎంత విచిత్రం? దీనినే ఓడలు బండ్లు అవటం, బండ్లు ఓడలు అవటం అంటారేమో!
ఏది ఏమైనా విశ్వ ఎలా ఉంటుందో, ఏం చేస్తోందో అని హైరానా పడవలసిన అవసరం లేకుండా చేసాడా భగవంతుడు. ఆ సహాయానికి ఈ జన్మంతా రుణపడాలి అనుకుంది మనసులో.
ఆమె విన్నపాన్ని విన్నట్లుగా వెంకటేశ్వరస్వామి పటానికి పెట్టిన పువ్వు ఆవిడ చేతిలో వచ్చి పడింది. చుట్టూ గాలి స్తంభించిన సమయంలో ఆ పువ్వురాలటం వింతగా వున్నా చాలా సంతోషాన్ని అందించింది. నీ మాటలు అన్నీ విన్నానని ఆ దేముడే స్వయంగా వచ్చి చెప్పినట్లనిపించింది. లేకపోతే ఆ పువ్వు ఎలా పడుతుంది? ఇలాంటివి చూసినపుడే భగవంతుడున్నాడని అనిపిస్తుంది.
‘పువ్వు పడకపోతే దేవుడు లేనట్లా?’ ఆమె అంతరంగం అడగనే అడిగింది.
‘అలా అని నేనెందుకంటాను? ఎవరో అదృశ్యశక్తి లేకుండా ఇంత సృష్టి జరుగుతుందంటే ఎవరు నమ్ముతారు? ఇలాంటివి జరిగినపుడు దాన్ని మరింత బలంగా నమ్ముతాం, అంతే’ అంటూ తిరిగి సమాధానమిచ్చింది.
ఆ పువ్వును తీసి విశ్వ జడలో పెట్టింది.
‘మా విశ్వకు అంతా మంచే జరగాలి’ అని మనసారా ఆశీర్వదిస్తూ.
‘‘ఏమిటమ్మా! నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావ్?’’ అన్న విశ్వ ప్రశ్నకు ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది.
***
‘అనకాపల్లి’ బస్‌స్టేషన్‌లో బస్సు దిగి గోలివీధి, దేవుని గుమ్మంకి ఆటో మాట్లాడుకుని ఎక్కింది. తన బ్యాగు చాలా బరువుగానే వుంది. మరి అందులో తను సంధించాల్సిన అస్త్రాలు అన్నీ దాగి వున్నాయి. శాంత చెప్పిన గుర్తులు ప్రకారం ఇంటిని సులభంగానే గుర్తుపట్టింది విశ్వ. ఆటో అతనికి డబ్బులిచ్చేసి ఇంటిముందున్న కాలింగ్ బెల్ కొట్టింది.
రెండు మూడు నిముషాల తర్వాత కానీ తలుపులు తెరచుకోలేదు. దానికి కారణం లోపలికి వెళ్లగానే అర్థమైంది ఆమెకు, టీవీ పెద్ద సౌండ్‌లో వినిపిస్తోంది.
తన ఎదురుగా వున్నది శాంత ఆడబడుచు సుందరి. తనను చూడగానే మీరూ మా వదిన విశ్వ స్నేహితురాలు కదా అంది తడబడుతూ.
విశ్వ సూటి చూపులు ఆమెను తడబడేట్లుచేస్తాయి. ఫర్వాలేదు సుందరి బాగానే ఉంది. ఆమె బుద్ధే బాగా లేదు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206