డైలీ సీరియల్

కర్మఫలితాన్ని అనుభవించాల్సిందే (పరీక్షిత్తు - 6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను చేసిన పనికి పశ్చాత్తాపం చెందుతూ రాజ్యభారాన్ని పూర్తిగా జనమేజయునికి ఒప్పచెప్పాడు. దర్భాసనం పరిచి ఉత్తరాభిముఖుడై దేవదేవుని ప్రార్థిస్తూ కూర్చున్నాడు.
పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు హరిచరణ సంస్మరణానద కందళిత హృదయారవిందుడై గంగానది దగ్గర కూర్చుని ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసింది. అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వసిష్ఠుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, పర్వతుడు, నారదుడు మొదలైన బ్రహ్మర్షులూ దేవర్షులూ రాజర్షులూ అరుణుడు మొదలైన కాండర్షులూ, ఇంకా వివిధ గోత్ర సంభవులైన మహర్షులు శిష్యులతోనో ప్రశిష్యులతోను కలసి పరీక్షిత్తు వచ్చారు. పరీక్షిన్నరేంద్రుడు వచ్చిన వారిని చూసి ఎంతో సంతోషించి వారికి ఎదురువచ్చి ఆర్ఘ్యపాద్యాలిచ్చి అర్చించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు.
వచ్చిన వారిని నేను సహనం కోల్పోయి కోపాన్ని జయించలేకు చచ్చిన సర్పాన్ని తెచ్చి మునీంద్రుని మీద వేసిన పాపాత్ముడిని, ప్రమత్తుణ్ణి, క్రూరస్వభావుడిని నన్ను క్షమించి నా పాపాన్ని పరిహరించే మార్గం తెలపండి. జన్మజన్మలకూ ఆ దేవదేవుడైన పరమాత్మపై నా మనసు నిలిచే మార్గం చూపించండి అని పరి పరివిధాల వేడుకున్నాడు.
వారంతా పరీక్షిత్తును చూచి విధి ఆడే వింతనాటకం అంటే ఇదే కదా అని మనసున అనుకున్నారు. పరీక్షిత్తు మరలా ఈ ఏడురోజుల్లో నేను ఏవిధంగా ముక్తిని పొందవచ్చు అని అడిగాడు. నేను అహంకారంతోమదోన్మత్తుడిని అయి చేయరాని పనిని చేశాను. కనుక ఆ తక్షకుని విషాగ్ని జ్వాలలకు నా శరీరాన్ని నేను సమర్పిస్తాను. కాని మరలా నేను ఏ జన్మనెత్తినా సరే నాకు ఆ శ్రీమన్నారాయణునిపై అచంచల విశ్వాసమూ, సమదృష్టి ఉండేవిధంగా ఆశీర్వదించండి అని వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వారంతా పరీక్షిత్తు మాటలు విని కన్నీరు కార్చి ‘మహారాజా! మీ వంశంలో ఎందరో ఉన్నతోన్నతులు జన్మించారు. వారికేవిధంగా నీవు తీసిపోవు. నీ చరిత్రము మహోన్నతమైంది. నీ చరిత్రను ఆచంద్రార్కమూ జనులు చెబుకుంటారు. నీతో పాటు మేము ఇక్కడే కూర్చుని ఉంటాము అని వచ్చిన వారంతా అక్కడే కూర్చున్నారు.
‘మునిసత్తములారా! బ్రహ్మజ్ఞానులారా! విజ్ఞుల్లారా! తత్త్వజ్ఞులు మీరు,. మీకు తెలియనిది అంటూ ఏదీలేదు. మీరంతా దయార్ద్ర హృదయులు. మీరు కనికరించి నాపై దయచూపండి. నాకీ ఏడు రోజుల్లో ఏవిధంగా నారాయణుని సేవ చేయగలను, ఏవిధంగా ఈసంసార బంధాల నుంచి తప్పించుకోగలనో వివరించండి’ అని పలువిధాలుగా పరీక్షిత్తు వేడుకున్నాడు. ఆ సమయంలోనే అక్కడ శుకయోగీంద్రులు వచ్చారు. వారికి జూచి మునిగణమంతా లేచి నిల్చున్నారు. పరీక్షిత్తు ఉప్పొంగిన హృదయంతో లేచి ఆ శుకముని ఆహ్వనించి ఆసనమిచ్చి ఆర్ఘ్యపాద్యాదులిచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి