డైలీ సీరియల్

నిశ్చలస్థితే నిర్మలానందానికి దారి (పరీక్షిత్తు - 7)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవధూతలల్లో అగ్రగణ్యుడవు. అవ్యక్తమైన గమనం కలవాడవు. నీ సందర్శనం వ్యర్థకాదు. నేను వారంరోజుల్లో ఈ దేహాన్ని వదిలివేయాలి. అట్టి నాకు మీ దర్శనం లభించింది అంటే తప్పకుండా నాకు శుభం కలుగుతుంది. నాకోరిక నెరవేరుతుంది అన్న భావం నాకు కలుగుతోంది. మహానుభావా! ఈ ఏడు రోజుల్లో నారాయణుని పాదపద్మాలను చేరుకొనే ఉపాయాన్ని చెప్పండి. మదోన్మత్తతతో చేయకూడని కార్యాన్ని చేశాడు. బాలుడైన శృంగి చేత శపించబడ్డాను. ఇందులో శృంగి చేసిన తప్పేమీ లేదు. నేను ఇంత పెద్దవాణ్ణి అయ్యి ఉండి కూడా తప్పుచేశాను. కనుక నాకే జన్మలభించినా శ్రీమన్నారాయణుని పాదపద్మాల భజన సదాచేసుకునే భాగ్యాన్ని నిరంతరమూ స్వామి నామస్మరణ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగేలా ఉపాయాన్ని చెప్పండి అని మరలా శుకమహర్షిని అడిగాడు.
‘స్వామి మీరుగ ఆవును పాలుపిదికినంత సేపటి కంటే ఎక్కువ సేపు ఎక్కడా ఉండరుకదా. నాకీ నాకోసం ఇక్కడకు వచ్చారు.మీరు దయచేసి మోక్షమార్గాన్ని నాకు చూపించండి. నన్ను తరింపచేయండి. ’ అని దీనుడై పరీక్షిన్నరేంద్రుడు తిరిగి తిరిగి శుక మహర్షిని వేడుకున్నాడు. ‘నరవరా! నీవెందుకు ఇంతగా పరితపిస్తున్నావు. ఖట్వాంగునికి కేవలం ఒక మూహూర్తకాలం మాత్రమే జీవిస్తానని తెలిసిన క్షణమే అతడు గోవిందనామస్మరణ చేస్తూ ముక్తిని పొందాడు. అంటే రెండు ఘడియల్లోనే ముక్తిని పొందాడు. మరి నీకు ఏడు రోజులున్నాయి కదా నీవెందుకు ముక్తిని పొందలేవు.విచారాన్ని వదిలిపెట్టుము.
మా తండ్రి వ్యాసభగవానుడు ద్వాపర యుగంలో వేదతుల్యమైన భాగవతాన్ని నాచేత చదివించాడు. నేను పరబ్రహ్మమందు లగ్నచిత్తుడినై భగవంతుని అవతార లీలల చేత ఆకర్షించబడి భాగవతాన్ని అంతా చదివాను. నీకు ఆ భాగవతతత్త్వం వివరిస్తాను. ఈ భాగవత శ్రవణం వల్ల బుద్ధి విశాలమవుతుంది. మోక్షం కావాలనుకొన్నవారికి మోక్షం లభిస్తుంది. సంసార భయాలు పటాపంచలవుతాయి. వాసుదేవుని నామసంకీర్తనమే ఉత్తమ వ్రతాలు. కనుక నీవు సావధానుడివై భావగత తత్త్వాన్ని వినుఅంటూ శుకయోగీంద్రులు భాగవతతత్వాన్ని పరీక్షిత్తుకు వినిపించారు. మహారాజా! ముసలితనానికీ మృతికీ ఆశ్రమం ఈ శరీరం.
నీటితో నిండిన కుండలో ఆకాశ ప్రతిబింబం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కాని కుండ పగిలినపుడు అందులోని ఆకాశ ప్రతిబింబం కనిపించకుండా తిరిగి అదే ఆకాశంలో కలసిపోయినట్లుగానే ఈ శరీరంలో ఉండే జీవుడు మృత్యువు కారణంతో తిరిగి పరమాత్మలో కలసిపోతాడు. కనుక నీవు నిశ్చలంగా, నిర్మలంగా భగవంతుడైన పరమాత్మను నారాయణుని స్మరిస్తూ ఉండు అని శుకుడు పరీక్షిత్తుకు దివ్యోపదేశం చేశాడు.
శుకయోగీంద్రుల వల్ల జ్ఞానం పొందిన పరీక్షిత్తు అన్ని వ్యామోహాలను విడిచి దర్భాసనం పై కూర్చుని హరిని ధ్యానిస్తూ ఉన్నాడు. శుక మహర్షి తన సంచారానికి వెళ్లిపోయాడు.
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి