డైలీ సీరియల్

విలువల లోగిలి 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తృప్తి ముందు ఏ బహుమతి అయినా గొప్పది కాదు’’.
‘‘బహుమతి నా సరదా కోసం. మీరంతా నేను చెప్పానని నాకోసం చదివారుగా. అందుకు ఇస్తున్నాననుకోండి. అయినా నేనివ్వటమేమిటి? సమాధానాలు సరిగ్గా రాస్తే మీరే సాధించుకున్నట్లు’’, ఏమంటారు?
‘‘బహుమతి అందుకున్నాక చెబుతాను’’
‘‘సరే! వస్తానండీ!’’’ అని చెప్పి లోపలికి వచ్చేసింది.
మూడు రోజులు మూడు నిమిషాలలా గడిచిపోయింది. శాంతి సంతోషానికి అవధులు లేవు. కానీ రేపు విశ్వ వెళ్లిపోతుందని తలుచుకుంటే దుఃఖం తన్నుకువస్తోంది. దానిని ఎలా ఆపాలో తెలియటంలేదు. తను చూస్తే బాధ పడుతుందని చాటుగా కన్నీళ్ళు తుడుచుకుంటోంది. దీనికీ విశ్వ ఒప్పుకోదు. విడిపోతున్నామన్న బాధతో వున్న సమయాన్ని వృధా చేసుకోవటం ఏమిటన్నది తన ప్రశ్న. అదీ నిజమే. కానీ తను అలా ఉండలేకపోతోంది. స్వభావాలు మార్చలేరు కదా! లేకపోతే అందరూ విశ్వలా అయిపోరూ! తన ఆలోచన తనకే నవ్వు తెప్పిస్తోంది. ఎవరైనా వింటే నవ్వక ఏం చేస్తారు? ప్రక్కనే వున్న విశ్వ చేతిని గట్టిగా పట్టుకొని మరీ నిద్రకు ఉపక్రమించింది శాంతి.
***
ఆరోజు ఆదివారం అవటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇల్లంతా మహా సందడిగా ఉంది. దానికి కారణం విశ్వ అందరితో బాగా కలిసిపోవటమే. విశ్వరాక తమకు ఎంతో మేలు చేసిందని ఆ ఇంట్లో అందరికీ తెలుసు. దాన్ని రకరకాలుగా వ్యక్తం చేస్తూ అందరూ ఆమె చుట్టూనే తిరుగుతున్నారు. లీలావతి విశ్వకి ఇష్టమైన వంటలు చేసే పనిలో పడింది. శాంతిని అసలు వంటింటి వైపుకే రానివ్వలేదు. నువ్వు నీ స్నేహితురాలితో ఈరోజు గడుపు అని చెప్పేసింది. సుందరి అమ్మకు సాయం చేస్తూనే విశ్వకి తన గుర్తుగా ఏం బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నది. విశ్వ మాత్రం ఆ ఇంట్లో బంధం గొప్పతనాన్ని తెలియజేసి అనుబంధాన్ని గట్టిపడేట్లు చేయగలిగినందుకు చాలా సంతోషించింది. దానికి గుర్తుగా పగలు అందరూ కలిసి భోజనం చేయకపోయినా రాత్రి అందరూ కలిసి భోంచెయ్యాలని ప్రతిపాదన చేసింది. దానికి అందరూ అంగీకరించారు. అపుడు ఆ రోజు ఏం చేసారో చెప్పుకోవటం, సరదాగా మాట్లాడుకోవడం వలన ఒకరిమీద ఒకరికి ఇష్టం మరింత పెరుగుతుంది. ముందు కుటుంబంలో ఆప్యాయతలు చోటుచేసుకుంటాయి. దానితో ప్రేమ భావాలు పెరుగుతాయి. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందమూ ఉంటుంది. ఇలా ప్రతి కుటుంబమూ తయారయితే ఎంత బాగుంటుంది?
‘‘విశ్వక్కా! నీకోసం ఏం తెచ్చానో చూడు’’ అన్న ఫణి మాటలకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది.
తన ఫొటోని అందమైన ఫ్రేమ్‌లో బిగించటమే కాకుండా ‘ప్రేమతో.. తంబి’ అన్న కార్నర్‌లో రాసి ఉంది.
ఫణి అభిమానానికి ముచ్చట వేసింది.
‘‘్ఫణీ! నీ గిఫ్ట్ బాగుంది కానీ నేను కోరుకొనే బహుమతి వేరొకటి ఉంది, ఇస్తావా?’’
‘‘చెప్పక్కా! తప్పకుండా ఇస్తాను’’
‘‘్ఫటోగ్రఫీలో పోటీలు పెడుతూ ఉంటారు. దానిలో నీకు మొదటి బహుమతి రావాలి. అదే నువ్వు నాకిచ్చే బహుమతి’’
‘‘నువ్వు కోరిన బహుమతినే నీకు బహుమతిగా తొందర్లోనే అందిస్తాను. ఇది నా ప్రామిస్’’ అంటున్న ఫణి తలను నిమిరింది ఆప్యాయంగా.
ఇంతలో బాలామణిగారి కబురు, అందరూ ఇక్కడే చేరిపోయామని. పదమ్మా, వెళదాం అంటూ లీలావతిగారు అనటంతో తన పెట్టెలో నుంచీ ఒక సంచి కాగితాలు, పెన్నులు తీసుకుని బయలుదేరింది విశ్వ. వాళ్ళంతా పరీక్షరాయటానికి వచ్చిన విద్యార్థులులా కనిపించింరామెకు. నిజం చెప్పాలంటే వాళ్ళందరి పరిస్థితి అలాగే ఉంది.
‘‘మీరంతా సిద్ధంగా ఉన్నారా?’’ అని అడిగింది విశ్వ.
అందరూ తలలు ఊపటంతో తన దగ్గర వున్న ప్రశ్నపత్రాలను వాళ్ళకు ఇచ్చింది.
‘‘అరగంట సమయంలో మీరు జవాబులు వ్రాసి నాకిచ్చెయ్యాలి’’ అంది.
వారంతా అరగంటకుముందే సమాధానాలు వ్రాసి ఇచ్చెయ్యటం ఇక్కడ చెప్పుకోవలసిన విషయం.
వాళ్ళందరూ రిజల్ట్స్ ఎప్పుడు చెబుతారు అన్నట్లు చూస్తున్నారు.
వాటిని పరిశీలించింది విశ్వ. వారంతా మనసు పెట్టి ఆ పుస్తకాన్ని చదివారని గ్రహించింది.
వాళ్ళంతా ఆత్రంగా ఆమె వంకే చూస్తున్నారు. బహుమతి ఎవరెవరికి వస్తుందో అనే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది.
అప్పుడు విశ్వ మాట్లాడటం ప్రారంభించింది.
‘‘పుస్కం చదవటం ఒక మంచి అలవాటు. దానివలన జ్ఞానం పెరుగుతుంది. సమయమూ సద్వినియోగం అవుతుంది. రచన బాగుంటే అందులో మంచి లక్షణాలను మనమూ అలవరచుకోవాలని అనిపిస్తుంది. అంతేకాదు తప్పకుండా పాటించటానికి ప్రయత్నిస్తాం కూడా.
ఈ కారణంగానే మీ అందరితో ఈ పుస్తకాన్ని చదివించాను. మీరూ శ్రద్ధగా చదివారు. మీరంతా ఇందులో సారాంశాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారని మీరు రాసిన సమాధానాలు బట్టి నాకు తెలిసింది. అందుకే బహుమతిని అందరికీ ఇస్తున్నాను అన్నమాట’’ అంటూ వారందరికీ బొట్టుపెట్టి వెండి కుంకుమ భరిణెలు అందించింది.
ఇక వారి ఆనందానికి అవధులు లేవు.
అందరి దగ్గిర సెలవు తీసుకొని శాంతిని చేరింది సంతృప్తిగా.
‘‘ఏమ్మా! అన్ని పనులూ అయిపోయినట్లేనా?’’ అంది ప్రక్కనే కూర్చుంటూ శాంతి.
‘‘ఆ! ఇక ప్రయాణానికి సిద్ధం కావటమే. అప్పుడే చందూ వచ్చేసి నా కోసం ఎదురుచూస్తున్నారు’’.
‘‘నీకెలా ఉందోగానీ నాకయితే చచ్చేంత దిగులుగా ఉంది విశ్వా, నువ్వెళ్లిపోతుంటే?’’
‘‘పిచ్చి శాంతీ! నీకేనా బాధ, నాకు ఉండదా?

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ