డైలీ సీరియల్

అహం.. అవరోధమే ( ధ్రువుడు -1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులకు దుఃఖాలు రావడం అతి సహజం. పుట్టినప్పటి నుంచి దుఃఖిస్తూనే ఉంటాడు. తెలిసో తెలియకో బాల్యంలో దుఃఖిస్తాడు. ఆ తరువాత కోరికల వలలో మెల్లమెల్లగా చిక్కుకుని ఆ కోరికలు తీరలేదని బాధపడుతుంటారు. విజ్ఞానవంతులు కోరికలకు దూరంగా ఉండండి దుఃఖం మీదరికి రాదు అని చెబుతుంటారు.
కాని ఉత్తాన పాదుడనే రాజుభార్య సునీతి మాత్రం దుఃఖాలకు కారణం క్రితం జన్మలో మనం చేసుకొన్న పాపపు భారమే కాని మరేమీకాదు. ఈజన్మలో కనిపించేకారణాలను చూసి ఆ కారణాన్ని నిందించవద్దు. కేవలం పూర్వజన్మ పాపఫలితంగా ఈ జన్మలో దుఃఖం కలుగుతుంది అని చెబుతుంది. ఆ సునీతికి ఇంత కచ్చితమైన అభిప్రాయం ఎలా కలిగిందో చూద్దాం ... శతరూపా స్వాయంభువ మనువుకు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అన్న కుమారులుండేవారు. ఆ ఉత్తానపాదునకు సునీతి, సురుచి అన్న ఇద్దరు భార్యలు ఉన్నారు.
ఉత్తాన పాదునికి సునీతి కన్నా సురుచి పైన అభిమానం ఎక్కుగా ఉండేది. దానితో సురుచికి నోటి దురుసుతనానికి అడ్డులేకుండా పోయింది. పైగారాజుగారి అభిమానాన్ని పొందుతున్నానన్న అహంకారం పెరిగిపోయింది. అహంకారం ఒక్కటి ఉంటేనే శాశ్వతం కాని వన్నీ శాశ్వతం అనుకొనే పొరపాటు చేస్తుంటారు. అట్లాంటపుడు వారికి గర్వం కూడా ప్రాప్తిస్తే వారికి చిన్న పెద్దాతేడాల్లేకుండా పోతాయి. అంతేకాదు సర్వం మన ఆధీనంలోనే ఉన్నదన్న మాయ కమ్ముకొంటుంది. కనుక వారు అన్నింటినీ తామే అధికులమని భ్రమిస్తుంటారు. వారు భ్రమల్లో తేలడం కాక చుట్టు ఉన్నవారిని హీనంగా చూస్తుంటారు. అట్లాంటి కోవలోని మనిషిగా సురుచి తయారు అయింది.
సునీతి రాజు గారి భార్య అయినా రాజు అనుగ్రహం పొందలేక అభాగ్యశాలిగా ఉంది. అన్నీ ఉన్నా తనకేమీ లేనట్టుగా ఉంది. కలిమి ఉన్నప్పుడు దైవం కనిపించకపోయినా లేమిలో భగవంతుడుపక్కనే ఉన్నట్టుగా అనిపించడం కూడా సహజమే కదా. సునీతికి చిన్న నాటి నుంచి దైవ భక్తి మెండుగానే ఉండేది. దానికి తోడు విధి రాత వల్ల మరింత భగవంతునిపై భక్తి పెరిగింది. సర్వానికి కారణాకారుణుడు దైవం తప్ప మరెవరూ కారన్న నిజాన్ని ఆమె ఎరుక కలిగిన ఇల్లాలుగా తన పనులు తాను చేసుకొంటూ తన కొడుకును తాను అల్లారుముద్దుగా చూసుకొనేది.
అట్లాంటి ఓ సమయంలో ఉత్తాన పాదుడు ఓరోజు సురుచికి పుట్టిన ఉత్తముడిని ఎంతో అప్యాయంగా దగ్గరకు తీసుకొని తన తొడలపై కూర్చోబెట్టుకొన్నాడు. ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంతో మురిపెంగా చూస్తూ ఎంతో ఆనందాన్నిఅనుభవిస్తున్నాడు.
దాన్ని చూసిన సునీతి కొడుకు ధ్రువుడు తాను కూడా తండ్రి అభిమానాన్ని పొందాలనుకొన్నాడు. తండ్రి ప్రేమతో మైమరిచి ఆనందిస్తున్న తన తమ్ముడి లాగాతానుతండ్రి ప్రేమను పొందాలనుకొన్నాడు.
వెంటనే తండ్రి దగ్గరకు పరుగెత్తి వెళ్లాడు. ఉత్తానపాదుడు కూడా ఆ సునీతి కొడుకు ను అప్యాయంగా తీసుకోబోయాడు. కానీ అక్కడే ఉన్న సురుచికి ఇది నచ్చలేదు. తన కొడుకుతో సమానంగా తన సవితి కొడుకు కూడా తండ్రి ప్రేమను పొందడం చూడలేకపోయింది. ఆమెలో అహంకారపు పొర కనులు కమ్మివేసింది.
సురుచి హుంకరించింది. చిన్నవాడైన ధ్రువునికి అది కనిపించలేదు. ఉత్తాన పాదుడు చూశాడు. అతనికి అర్థమైంది. తన ప్రియమైన భార్య ధ్రువుణ్ణి దగ్గరకు తీసుకోవడం భరించలేకపోతోంది. అందుకే చేతులను వెనక్కు తీసేసుకున్నాడు.

- డా. రాయసం లక్ష్మి. 9703344804