డైలీ సీరియల్

కర్మల వల్లే కష్టాలు! (ధ్రువుడు -3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నారద మహామునీ నీకు నమస్కారం’ అంటూ పాదాభివందనం చేశాడు. ధ్రువుని లోని సంస్కారాన్ని నారదుడు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. వేదన అనుభవించేవారికి ఎదుటివారిని గౌరవించాలన్న ధ్యాస కూడా ఒక్కోసారి పెద్దలకే ఉండదు. వారి వేదనాభారంలోనే కృంగి పోతుంటారు. ఇంత చిన్నవాడు అయినా తాను కనిపించగానే నమస్కరించాడు అనుకొని నారాయణానుగ్రహ ప్రాప్తిరస్తు అని దీవించాడు. ఆతరువాత
‘నాయనా! ధ్రువా రాజభవనంలో ఎండ కనె్నరుగ ఉండాల్సిన నీవు ఇలా వీధుల వెంబడి ఒక్కనివే ఎండలో ఎక్కడికి వెళ్లుతున్నావు? నీమనసు ఎందుకో అతలాకుతలం అవుతున్నది. నిన్ను ఎవరో మాటలతో అవమానించినట్టు ఉన్నారు. దానివలనే నీవు ఇల్లు వదిలి వెళ్లుతున్నావని అనుకొంటున్నాను’ అన్నాడు.
ధ్రువుడు తన మనస్సులో ఉండే ఆవేదనంతా నారదుని చెప్పాడు. మహర్షీ నాకు ఇట్లాంటి జీవితాన్ని ఇచ్చిన ఆ పరమేశ్వరుని మెప్పించి నాతండ్రి అంకపీఠం పై కూర్చునే భాగ్యాన్ని నేను పొందాలని వెళ్లుతున్నాను అన్నాడు. నారదుడు ఆ చిన్ని ధ్రువుని కోరిక విని అయ్యో దానికోసం నీవు శ్రీమన్నారాయణుని అనే్వషించడానికి వెళ్లుతున్నావా? పదా నేను నీ తండ్రితో మాట్లాడుతాను. నిన్ను ఆయన అంకపీఠం పై కూర్చోబెట్టుకోమని చెబుతాను అన్నాడు.
నారద మునివర్యా ! ఇది మంచి పని కాదు. మా అమ్మ అసలు మా తండ్రిగారికి నాపై అభిమానం లేకుండడానికి, మా పినతల్లి నాపై కోపగించడానికి కారణం కేవలం నా పూర్వజన్మ కర్మవిశేషమే అని చెప్పింది. దానిని పోగొట్టుకోవడానికి విష్ణుదేవుడు మార్గం అని కూడా చెప్పింది. మధ్యలో మీరు చెబితే ఒక్కరోజు లేదా మీరున్నంత సేపు మా నాన్న గారు నన్ను ఆయన ఒడిలో కూర్చోనిస్తారే కాని మనస్ఫూర్తిగా కాదుకదా. అందుకే ఆయనలో నాపై ప్రేమ కలుగాలని నా కోరిక. నా కోరిక కేవలం శ్రీమన్నారాయణుడే తీర్చగలడు కదా. అందుకే ఈ దారిని నేను ఎంచుకున్నాను అని చెప్పాడు. అపుడు నారదుడు ధ్రువుని చిన్ని చిన్ని ముద్దు పలుకులకు మురిసిపోయి. ‘‘అయ్యో తండ్రీ నీవు ఎంచుకున్న మార్గము అతి క్లిష్టమైంది. మీ అమ్మ నిజమే చెప్పింది. కానీ నీవు ఎంచుకున్నమార్గం లో ఎంతో మంది సాధువులు నిస్సంగులై తపస్సులు ఆచరిస్తూ ఆ దేవదేవుని తత్త్వాన్ని ఎరుకపర్చుకోలేకపోతున్నారు. ఒకవేళ నీకు మోక్షం కావాలని ఉంటే మాత్రం ఇపుడు హాయిగా జీవితంలో మీతండ్రి ఇచ్చే భూభాగాన్ని తీసుకొని చక్కని గుణవంతురాలిని పెళ్లి చేసుకొని పిల్లలు కని , వారిని పెంచి రాజ్యభాగాన్ని నీ పెద్దతనంలో వారికి అప్పజెప్పి అపుడు నీవు వానప్రస్థానికి వెళ్లి అపుడు ఆ నారాయణుని అనే్వషణ సాగించు . ఆ మహాదేవుడు కరుణిస్తే మోక్షాన్ని పొందు. అంతేకాని ముక్కుపచ్చలారని వయస్సులో తపస్సులకు వెళ్లకు. అడవుల్లో పెద్ద పులులవంటి క్రూర జంతువులు తిరగాడుతుంటాయి. వాటిని ఎదుర్కోవడం కష్టం. పైగా క్షణక్షణానికి మారిపోయే వాతావరణంలో ఎండ వేడిమికి, కుండపోత జడివానలకు, గజ గజ వణికించే చలికి నీవు తట్టుకోలేవు. నా మాట విను. ఇంటికి వెనుతిరుగు. నీవు పెద్దవాడివి అయిన తరువాత పరమాత్మ కోసం అనే్వషణ సాగిద్దువుకానీ ’అన్నాడు. అంతా విని ధ్రువుడు మెల్లగా చిరునవ్వు నవ్వి ‘మహర్షీ మీ వంటి పెద్దల వలనే నేను ఈ జీవితం క్షణభంగురం అని విన్నాను. ఇపుడు కాక మరెప్పుడో వృద్ధుడి నయ్యాక దేవుని గూర్చి విచారిద్దాం అనుకొంటే అంతలోపే ఈ శరీరం రాలిపోతే నాకోరిక ఏమవుతుంది? అంతేకాక నాకు తండ్రి ఒడిలో కూర్చునే కోరికనే తీరలేదు.
- ఇంకాఉంది