డైలీ సీరియల్

సాధనమున పనులు...( ధ్రువుడు -5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు నారదుడు ‘రాజా! ఆగు. స్థిమితపడు. నీకుమారుడు నాదగ్గర లేడు. ఆ నారాయణుని మెప్పించే తపస్సమాధిలో ఉన్నాడు. అఖండ కీర్తిమంతుడు అవుతాడు. లోకాలన్నింటిని చేత మెప్పుపొందుతాడు. ఆ శ్రీహరి కరుణ వానిపై అపారంగా వర్షిస్తున్నది. మరేంఫర్వాలేదు. నీకుమారుడిని నీవు అతి త్వరలో చూస్తావు. నీ కుమారుని వల్లే నీవంశ ఖ్యాతి ఆచంద్రార్కము నిలిచి ఉంటుంది. నీ కొడుకు కోసం నీవు విచారించవలసిన పనిలేదు. నీ కొడుకుకు నేను వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాను. ఇపుడు మధువనంలో నిశ్చల ధ్యాన స్థితిలో కూర్చుని ఆ వైకుంఠనాథుని నామాన్ని జపిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు. అతి త్వరలో ఆ వైకుంఠధాముని కరుణ పొందుతాడు. నీవు నిశ్చింతగా ఉండు’ అని చెప్పాడు.
నారదుని మాటలతో ఉత్తాన పాదునికి స్వస్థత చేకూరింది. స్థిమిత పడిన మనస్సుతో ఆ వైకుంఠనాథుని తన కొడుకును రక్షించమని వేయివిధాలుగా వేడుకున్నాడు. ఎపుడెప్పుడు ఆ పరంధాముడు తన కొడుకు తన దగ్గరకు పంపుతాడో అని ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాడు.
***
మధువనానికి బయలుదేరిన ధ్రువుడు యమునా నదిలో స్నానం చేశాడు. మనసును స్థిరపరుచుకున్నాడు. గురుదేవునికి నమస్కరించాడు. ఏకాగ్ర చిత్తంతో నియమ నిష్టలతో అడవిలో దొరికే పండ్లు కాయలు తింటూ కొన్నాళ్లు మరికొన్నాళ్లు అసలేమీ తినకుండా ఒంటికాలిపై నిలబడి తపస్సును కొనసాగించాడు. ధ్రువుని తపస్సుకు సాధువులు, మహర్షులు, దేవతలు అచ్చెరువొందారు. సకల జనులు శుభం జరగాలని ధ్రువునికి ఆశీస్సులు పలికారు.
కొన్నాళ్లకు ప్రాణాయామ అభ్యాసంలో పండిన ధ్రువుడు ప్రాణవాయువును నిరోధించాడు. తదేక ధ్యానంతో పరమేశ్వరునే తలుస్తున్నాడు. అపుడు దేవతలందరూ ఉపద్రవాలు ముంచుకొస్తాయేమో ఈ బాలకుడు ఈవిధంగా తపస్సు చేస్తున్నాడు. వైకుంఠ వాసుడు చిరునవ్వు చిందిస్తూ చూస్తున్నాడు అనుకొని అందరూ దేవతలు వైకుంఠానికి బయలుదేరి వెళ్లి ఆయనతో ధ్రువుని గురించి చెప్పారు. వైకుంఠుడు కూడా చిరునవ్వుతో అన్నీ విని ఆ ధ్రువుని కరుణించే సమయం ఆసన్నమైంది. వెళ్లుతున్నాను అని దేవతలకు చెప్పి ఆ మరుక్షణమే ధ్రువుని చెంత నిలిచి ‘నాయనా! ధువా! ’ అని పిలిచాడు. నిశ్చల మనస్సుతో తన హృదయంలో కనిపించే వాసుదేవుడు కనుల ముందు నిల్చి తన్ను పిలిచేసరికి అపుడే నిద్ర నుంచి మేల్కొన్నట్టుగా కనులు తెరిచి తన ఎదురుగా నిల్చున్న ఆ పరంధాముని చూశాడు. ఒక్క నిముషం మ్రాన్ప డి పోయాడు. కాళ్లుచేతులు ఆడలేదు. కళ్లప్పగించి చూస్తుండిపోయాడు. మాటలు రాని మూగవానిగా అయిపోయిన ధ్రువుని మెల్లగా స్పృశిస్తూ ధ్రువా అని మరలా కరుణాంతరంగుడు పిలిచాడు. అంతే చేతనావస్థను పొంది ధ్రువుడు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. దేవా అఖిల శక్తి సంపన్నా, అంతర్యామి, నీవు ఒక్కడివే అయినా నీ మాయ చేత పలురూపాలను పొందావు. నాలో స్తంభించిపోయిన వాక్కులను, ప్రాణాలను తిరిగి చైతన్యం పొందేటట్టు చేశావా.. దేవదేవా! ఈశ్వరా! మాధవా, ముకుందా అంటూ ఎన్నో విధాలుగా ఆ శ్రీహరిని స్తుతించాడు. నీకేమీ వరం కావాలో కోరుకోమని అడిగితే తండ్రీ నీవు కన్పించకముందు నా మనసులో ఏదైనా కోరిక ఉండేదేమో అవన్నీ ఇపుడు నీ దర్శనం తరువాత నశించిపోయాయి. నీ దర్శన భాగ్యం కలిగాక మ రలా నాకోర్కె ఇంకా ఉంటుంది. నాకు ఈ దర్శనం చాలు అని మళ్లీ సాష్టాంగ దండప్రణామం చేశాడు. స్వామీ నాకు కలిగిన ఈ నీ దర్శన భాగ్యం కోరుకున్నవారికందరికీ కలిగించు స్వామీ అని అడిగాడు.
చిన్నవాడు నిష్కల్మషుడు అయిన ధ్రువుని అంతరంగం తెలుసుకొన్న మహావిష్ణువు చిరునవ్వు నవ్వి నీ తండ్రి అంకపీఠం కావాలని కదా నీవు ఇంత తపస్సు చేశావు. నీ తండ్రి ప్రేమను పొందాలని కదా నీవు ఇంత కఠోర నియమాలను పాటించావు అని ధ్రువుని ఆశీర్వదించి నీవు కోరిన అన్నీ కోరికలు నెరవేరుతాయి.
- ఇంకావుంది...

డా. రాయసం లక్ష్మి