డైలీ సీరియల్

విచిత్రమైనదే ధర్మసూక్షం ( అజామీళుడు -1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్లతామర వంటి విశాల నేత్రాలు, చెక్కిళులపై నాట్యమాడే కుండలాలు ధరించినవారు, కిరీటాలతోప్రకాశించేవారు,సుకుమారులుగా కనిపించే మీరు ఎందుకింత ప్రయాస పడి మమ్ములను లాగి అవతల పారేసి మా పాశాలలో చిక్కుకున్న ఈ అధముడిని రక్షించడానికి పూనుకొంటున్నారు.
బహుశా మేమవరిమో మీకు తెలియదేమో? మా గురించివిని మేము చేస్తున్న పనిని పరిశీలించి ఆ తర్వాత మీరు మా నుండి ఈ చండాలుడిని రక్షించండి. అంతేకాని మమ్ము నిర్దయగా తోసివేయకండి. ఆ తరువాత మేమవరిమో తెలుసుకొని బాధపడాల్సి వస్తుంది ... అని మహారోషంతో పలుకుతున్న భయకరరూపులను చూసి చిరునవ్వుతో ముందు వీనిని మీ పాశం నుండి విడవడనివ్వండి. మేము మీ గురించి వినడమే కాదు మా గురించి కూడా మీకు చెబుతాము... అన్నారు.
ఇలా ఇరుపక్షాల వారుహోరాహోరీగా తనకోసం పోరాడుతున్న వారిని విస్మయంతో చూశాడా జీవి. తానెవరో అని ఒక్కసారి తన్ను తాను పరిశీలించుకున్నాడు. తన జీర్ణమైన దేహం కనులు కనిపించడంలేదు. చేతులు కాళ్లు అన్నీ చచ్చుబడి ఉన్నట్టు ఉన్నాయి. నేనెవరిని అని మరోసారి దీర్ఘంగా ఆ జీవి ఆలోచనలో పడ్డాడు.
***
కన్యాకుబ్జమనే పట్టణంలో ఉండేవాడని కదా నేను అనుకొన్నాడు. అంతే అప్పటివరకు జరిగిపోయిన సంగతులన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకువస్తున్నాయి. అవన్నీ తలుచుకుని అమితంగా కుమిలిపోయాడు ఆ జీవి. అయ్యో నేనెంత దరిద్రుణ్ణి, అజ్ఞానిని, ఎంతటి దురాచారానికి ఒడిగట్టాను. ఎంత పాపాన్ని ఆచరించాను. అయ్యో మలినమైన మనస్సు నాకెలా అబ్బింది. ఈ మలినమైన ఆలోచనలతోనే కదా పక్కదోవ పట్టాను. ఒక్కరోజా రెండు రోజులా అయ్యో భగవంతుడు ఇచ్చిన ఆయుష్షునంతా వృథా చేసుకొన్నానే ఇక ఏముంది. నా జవసత్వాలు ఉడిగిపోయాయి. అయ్యో నేనెంతటి మూర్ఖుడిని. నాకు దేవుడు మంచి జన్మను ఇచ్చాడు. నా తల్లిదండ్రులు ఎంతటి ధర్మపరాయణులో కదా. వారు నిత్యాగ్నిహోత్రులు. వారికి నేను ప్రతిరోజు సమిధలు, పూలు తెచ్చి ఇచ్చేవాడిని కదా. అయ్యో నేను అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్య ఉంది కదా. ఆమె ఇనే్నళ్లు ఎంత దుఃఖాన్ని అనుభవించిందో కదా. నావల్ల దుఃఖార్తితోనే జీవితమంతా గడిపింది. నా తల్లిదండ్రులు ఆమెను చూసి, నన్ను తలుచుకుని వారి వృద్ధాప్యాన్నంతా బాధతోనే గడిపారేమో. అయ్యో నేను వారి చెంత లేను కదా. వారి ఎన్ని అవస్థల పాలైనారో అని అనిపించింది ఆజీవికి.
దీనినంతా అవలోకిస్తున్న పట్టు పీతాంబరాలు ధరించిన వారు చూడుము ఆ జీవి మనోవేదన చూడుము. ఎంతగా చేసిన పనులకు ఎంతగా పశ్తాత్పాపం చెందుతున్నాడో చూడండి. ఇంతకీ మీరేవరో మేము గుర్తించలేదని అన్నారుకదా మరి మీరెవరో ఎక్కడి వారో సెలవివ్వండి అన్నారు.
‘అయ్యా! మేము ప్రాణులందరికీ వారి వారి కర్మలనుసారంగా శిక్షలు విధించే యమధర్మరాజు భటులం మేము. ఆ ధర్మరాజు చెప్పినవిధంగా ఈ ప్రాణులను మేము మా రాజు చెంతకు తీసుకొని వెళ్తాం. ఇతనికి వేయబోయే శిక్ష ఎలాంటిదో మాకు తెలుసును కనుక మేము ఇతనిపై నిర్దయగా వ్యవహరిస్తున్నాం ’అన్నారు.
‘ఓహో! మీరు అందరికీ శిక్షలు విధించేవారి భటులా! మీకీవిధమైనవే నేర్పించితిరా? ఎవరికి ఎటువంటి శిక్షలు వేయాలో మీకు తెలియచెప్పలేదా? లేక మాకు అంతా తెలుసునని మీకు మీరే నిర్ణయించుకుని పాపులని శిక్షించుదామని బయలుదేరి పొయ్యారా?’ అని శుభరూపులు అడగడం విని ‘చూస్తుంటే మీరు ఎవరో గొప్పవారులాగా కనిపిస్తున్నారు. మీ వాలక చూస్తే ఆ పరంధాముని భటుల వలె ఉన్నారు. మీరు వస్తథ్రారణ మీరు మాట్లాడేమాటలు దేవదేవుని శుభ పలుకుల వలె ఉన్నాయి. కానీ మీరు ఇక్కడ పొరపడుతున్నారు. మేము ఏనాడు కూడా హరిభజన చేసేవారిని, హరినామంతో పులకించి పోయేవారి జోలికి వెళ్లనే వెళ్లము.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804