డైలీ సీరియల్

గుణాలను బట్టి కర్మలు...( అజామీళుడు -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిభక్తులకు ఆమడ దూరంలోనే నిల్చుని మేము వారికి నమస్కరించి వెళ్తాము. కానీ ఈ జీవి పాపాత్ముడు కనుక మేమీ జీవిని కొని పోవడానికి వచ్చాం’ మీరు ఎక్కడో పొరబడినట్టు ఉన్నారు అన్నారు యమభటులు.
దానికి చిరునవ్వు నవ్వి ‘యమభటులారా! మేము కాస్తంతైనా పొరబడలేదు. మీరు తప్పు చేస్తున్నారు. అసలు మీకు ఎవరికి ఏ శిక్ష వేస్తారో తెలుసునా’ అని అడిగారు శుభరూపులు ‘‘అయ్యో అంతమాటన్నారే ? మేము ఎవరని మీరు భావిస్తున్నారోమాకు తెలియడం లేదు. ముందు మేమెవరి మో తెలుసుకొనండి. నారాయణుని మాయ వల్ల ఏ జీవియైనా కర్మ చేయకుండా క్షణమైనా నిలువలేడు కదా. అట్టి కర్మలకు శిక్షలు వేసే యమధర్మరాజు భటులం మేము. ప్రాణులన్నింటినీ ఇసుమంత భేదం లేకుండా సమదృష్టితో చూసే యమధర్మరాజు భటులం మేము. ’’ అన్నారు యమకింకరులు.
వారిని వారు చెబుతున్న దానిని చూసి, విని చిన్నగా నవ్వి... అయ్యా ! మీరు యమధర్మరాజు భటులని మేము తెలుసుకొన్నాము కానీ మీరు ఎవరికి ఏ శిక్షలు వేయాలో మీరు బాగా తెలుసుకొనలేదా లేక మీ యమధర్మరాజుగారే పొరబడుతున్నారో మాకైతే తెలియదు కానీ మీరు ఎవరెవరికి ఎటువంటి శిక్షలు వేస్తారో మాకు చెబుతారా అన్నారు ఆ శుభరూపులు.
‘అయ్యలారా! మిమ్ము చూస్తూంటే మాకు విష్ణుదూతలుగా అర్థమవుతున్నారు. మీరే ఏదో పొరపాటుగా మా పనికి అడ్డుతగులుతున్నారు. మీరు రావలసిన చోటు ఇది కాదు. ఇక్కడ నారాయణుని భక్తులు లేరు. పరమనికృష్టులైనవారు దయలేని వారు కర్మబద్ధులైన వారున్నచోటు ఇదే. కనుక మేము ఇక్కడికి వచ్చాము. ఇంకా మీకేవిధమైన అనుమానం ఉంటే మాకు తెలిసిన వివరణనుచెబుతాము వినండి.’ అంటూ ఇలా చెప్పడానికి పూనుకొన్నారు వారు.
ఈ లోకంలో ఉన్న ప్రాణులన్నీ మూడు గుణాలను కలిగి ఉంటాయి. సత్వగుణం కలిగిన వారు శాంత స్వభావులుగాను, రజోగుణం కలిగిన వారు ఘోర స్వభావులుగాను, తమోగుణం కలిగిన వారు మూఢ స్వభావులుగా ఉంటారు. ఈలోకంలో ఉన్న ప్రాణులన్నింటికీ ఏదో ఒక గుణం కలిగి ఉంటారు. వారి పూర్వజన్మ సంస్కారాలను బట్టి కూడా ఈ గుణాలు ఏర్పడుతుంటాయి. శాంత స్వభావులు ధర్మమార్గంలో నడుస్తుంటారు. ఘోర స్వభావులు కూడని మార్గాలల్లో నడుస్తూ నానా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. మూఢ స్వభావులు కొంత మంచి కొంత చెడుగా ప్రవర్తిస్తూ సుఖ దుఃఖాలను కొని తెచ్చుకుంటారు. ఇలాంటి ప్రవర్తకులు వారి కర్మలకు తగిన జన్మలు వారికి వస్తూ ఉంటాయి.
ఎవని వలన సత్త్వరజస్తమో గుణమయులైన జీవులు ఏర్పడుతున్నారో ఎవరి వన ఈ జీవులు తమకు అనుగుణమైన గుణాలను, నామాలను ప్రవర్తనలనూ, ఆకారాలను పొందుతున్నారో ఎవని వల్ల ఈ సృష్టి యావత్తు పుడుతుందో లయిస్తుందో, లేక నడుస్తుందో అతడే నారాయణుడు అతడు సర్వప్రాణులందు నిండి ఉంటాడు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, చంద్రుడు, సంధ్యలు, పగళ్లు, రాత్రులు , కాలం, భూమి, ఇవన్నీ దేహధారులైన జీవుల సర్వ కర్మలకూ సాక్షులుగా ఉంటారు. ఈ సాక్ష్యాన్ని అనుసరించే ధర్మాధర్మాల నిర్ణయం చేస్తారు. అధర్మపరులను దండించడం, ధర్మపరులను రక్షించడం అనేవి మా ధర్మరాజు చేస్తుంటారు.
యమధర్మరాజు విశేషరూపంలో సమస్తజీవులోఅంతర్యామిగా ఉంటాడు. దేహమే తానని భావించేవాడు పూర్వజన్మ స్మృతి కోల్పోతాడు. జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించకుండా వాటిని కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాలను మాత్రమే గ్రహిస్తుంటారు.
ప్రస్తుత జన్మలో తాను ఎంత సుకృతం చేస్తాడో, ఎంత దుష్కృతం చేస్తాడో ఆ పుణ్యపాపాల పరిమాణాన్ని అనుసరించి భవిష్యత్తుల ఫలాలు ప్రాప్తిస్తాయి. ఆ జన్మలో వాటి ఫలాలు తప్పక పొందాల్సి ఉంటుంది.
- ఇంకాఉంది