డైలీ సీరియల్

గుణపాఠాలు కర్మానుబంధాలే (అజామీళుడు -3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రాణులు కామ క్రోధ, లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరిషడ్వర్గాన్ని జయించలేక సంసార బద్ధులై ఉంటారు. సాలెపురుగు తన నోటి నుంచి వచ్చిన ద్రవంతోనే దారాలను అల్లి అందులోనే తిరిగి తాను బంధీ అయినట్లుగా ప్రాణులన్నీ పూర్వ జన్మ సంస్కారం కొద్దీ గుణాలను ఆశ్రయించి ఉంటూ ఆ గుణాల ప్రేరణ వల్ల తిరిగి సంసారంలోనే చిక్కుకుని పోతుంటాడు.
కర్మలు చేయాల్సే ఉన్నా మానవునిగా పుట్టిన జీవులు ఏది మంచో ఏది చెడునో తెలుసుకుంటూ ప్రయత్నపూర్వకంగా వాసుదేవుడిని స్మరిస్తూ ఉంటే కొన్నాళ్లకు వారికి కర్మబంధాలు నశించుతాయి. కానీ సామాన్యులందరూ వద్దు వద్దు అనుకొంటారే కానీ తిరిగి విషయ లాలసలో పడిపోతుంటారు. దానివల్లనే వారు పాపులుగా ఉండిపోతున్నారు. అటువంటివారికి మా నాయకుడు శిక్షలు విధిస్తాడు.
అంతేకాదు ఈ జీవి బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. మంచి నియమ నిష్టలు కలిగి సదాచారాన్ని పాటిస్తూ నలుగురికీ ఆదర్శంగా జీవించాల్సింది పోయి ఒక వేశ్య అందాలకు మోహంతో బంధీ అయిపోయాడు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొన్న పడతిని గాలికి వదిలివేసి ఈ వేశ్యామోహంలోనే సంసారాన్ని ఇప్పటివరకూ చేస్తునే ఉన్నాడు. ఇప్పడు కూడా ఈ వ్యామోహం నుంచి బయటపడలేదు. తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యతను విస్మరించి వారికి అబద్ధాలు చెప్పి వారిని నిర్దయగా వదిలివేసి తన సుఖం కోసం వచ్చేసాడు.
తన కులాచారాలను గాని, తన స్వధర్మాన్ని కాని చేపట్టలేదు. దినమూ రాత్రి అనే తేడాల్లేకుండా కేవలం శారీరిక సుఖాలకోసమే వెంపర్లాడాడు. చూడండి. ఇపుడు మేము కనిపించినా కూడా ఆయన కన్న పిల్లవాడిపై వ్యామోహం, ఆశ విడిచి పెట్టక నారాయణా నారాయణా అని ఎలుగెత్తి అరుస్తున్నాడు. ఆ నారాయణుడనే ఆ పిల్లవాడు వచ్చి మమ్ములను గెంటేసి వీనిని రక్షిస్తాడన్న అపోహను పెంచుకొంటున్నాడు. కనుకనే మేము ఇతడినితీసుకొని వెళ్లడానికి ఇక్కడికి వచ్చాము. ఏ జీవి అయినా స్వధర్మాన్ని మరిచినా, కర్తవ్యాన్ని ఏమరుపాటుతో చేయకున్నా, ప్రయత్నపూర్వకంగా శ్రీహరిని స్తుతించకపోయినా మేము దండించుతాము. వేదాలను చదివే అర్హత కలిగి ఉండి కూడా లౌకిక వాంఛలతో మానవ జన్మను వ్యర్థం చేసుకొన్న ఇతడు దండార్హుడు అవుతాడుకదా అని యమభటులు విష్ణుదూతలకు చెప్పారు.
విష్ణుదూతలు చిరునవ్వు నవ్వి మీరు చెప్పినదంతా నిజమే. కానీ మీకు తెలిసి కూడా గుర్తించనిది ఇక్కడ ఒకటి ఉండిపోయింది. అందుకే మీరు ఈ అజామీళుడనే బ్రాహ్మణుని దగ్గరకు వచ్చారు అన్నారు ఆ శుభరూపులైన విష్ణుదూతలు.
‘ఏమిటీ! మేము ఒక విషయాన్ని గుర్తించలేకపోయామా? ఏమిటా విషయం?’ అన్నారు.
ఈ అజామీళుడు మీరు యమపాశంతో తన ప్రాణాలను లాగుతున్నపుడు ‘నారాయణా, నారాయణా’అని కేకలు వేశాడుకదా. దీన్ని మీరు విన్నారా’ అని విష్ణుదూతలు అడిగారు.
‘అయ్యో ఇదా విషయం దీన్ని మేము విన్నాము. కానీ మీరు ఇక్కడ పొరపడుతున్నారు. ఇతడు పిలిచింది ఆయన కొడుకును అంతేకానీ ఆ శ్రీమన్నారాయణుడిని కాదు. ఓహో మీ పొరపాటును మా పొరపాటు అంటున్నారా.. దయచేయండి. ఇతడు చేయని పాపం లేదు. ఇతడిని తప్పక దండించాల్సిన అవసరం ఉంది’అన్నారు యమకింకరులు.
అపుడు విష్ణుదూతలు ఇలా మాట్లాడారు.
మీరు ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. మృత్యువు ఆసన్నమైనపుడు ఆ జీవి దేనిగురించి ఆలోచించానా అతని నోటి నుంచి భగవన్నామాన్ని వెలువడినట్టయితే తప్పక అతడు చేసిన పాపాలన్నీ దూది రాశిలో పడిన నిప్పురవ్వ ఎలా దూదిరాశిని క్షణకాలంలో దహించివేసుంది అట్లానే ఆ పాపాలన్నీ క్షణంలోభస్మీపటలం అయిపోతాయి.
అసలు అట్లా మృత్యు సమయంలో భగవంతుని నామాన్ని జపించడానికి కూడా పూర్వజన్మ పుణ్యమేదైనా ఉండి తీరవలసిందే.
ఈ అజామీళుని విషయమే చూడండి.