డైలీ సీరియల్

గృహస్థాశ్రమమే ఉత్తమం ( అజగరుడు -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపదలున్నపుడు భగవంతుని సేవ చేద్దామనుకుని,ముందు సంపాదించడం మొదలుపెడితే సేవ మొదలుపెట్టేంతలోనే జీవితం అయిపోతుంది. అంతేకాదు సంపాదించిన ధనం వల్ల దుఃఖమే కాని సుఖమనేది ఉండదు. నేను ఒక తేనెటీగను చూశాను. దానినే నేను గురువుగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే రోజంతా శ్రమించి పూవు పూవు తిరిగి తేనె కూడబెడుతుంది. తాను తినక తాను కష్టపడి సేకరించిందల్లా గదులు నిర్మించి మరీ దాస్తుంది. కాని ఒకనాటికి మానవులు పొగపెట్టి తేనెటీగను తరిమేసి, లేదా చంపేసి మరీ ఆ తేనెను లాక్కుని వెళ్తారు. అందుకే నేను సంపాదించడానికై పరుగులు తీసి నా జీవితాన్ని వ్యర్థం చేసుకోను అని నిర్ణయంచుకున్నాను. అట్లానే ఒక కొండచిలువను కూడా చూశాను. అది అంత పెద్ద శరీరాన్నికలిగి ఉన్నా ప్రయాస పడి తిండి కోసం శ్రమించదు. ప్రాప్తించిన దానితో శాంతిస్తుంది. తన ధ్యానంలో తానుంటుంది. ఎదురుగా ఏమీ జరిగినా పట్టించుకోదు. కేవలం ఆకలి ఐనప్పుడు మాత్రమే తనకు చేతికిదొరికిన ఆహారాన్ని తింటుంది.
కనుక నేను ఈ కొండ చిలువనుకూడా గురువుగానే భావించాను.
నేను కూడా అజగరమై ఉంటాను. లభించినది భుజిస్తాను. నేను భుజించడానికై ఎవరినీ ఆశ్రయించను. అడగను. నాకు ఎవరిపైన ద్వేషం లేదు. అలాగే ప్రేమ కూడా లేదు. నన్ను పొగడిని, తిట్టినా కూడా ఒక్కలాగే ఉంటాను. కేవలం కర్మఫలాన్ని నిశే్శషం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను. ’’ ఇట్లా చెప్పిన అజగర ముని వౌనం దాల్చా డు.
ప్రహ్లాదుడు అజగరమహాముని చెప్పినదంతా విని ఆహ్లాదం పొంది ఆ మునికి నమస్కరించి తన రాజసౌధానికి మరలివెళ్లాడు.
ఈ సంగతిని అంతా నారదుడు ఓసారి ధర్మజునకు చెప్పాడు. అపుడు ధర్మజునకు ఒక సందేహం కలిగింది. ఆ అజగరముని కనుక ఏ పని చేయకుండా జీవితాన్ని గడిపి చివరకు ముక్తినిపొందాడు. కాని సామాన్య గృహస్థు ఏవిధంగా శ్రీహరి మెప్పును సాధించగలడో చెప్పమని అడిగాడు. అపుడు నారదుడు గృహస్థు చేయవలసిన విధి, గృహసుగా ఉంటూనే శ్రీహరి పాదపద్మాలను చేరుకొనే ఉపాయాన్ని చెప్పాడు. అదెలా అంటే గృహస్థు చేసే కర్మలన్నింటినీ ఈశ్వరార్పణం చేయాలి. వాసుదేవుని దయవలన నేనీ జన్మను పొందానన్న జ్ఞానాన్ని కలిగి ఉండాలి. నిరంతరం వాసుదేవ నామస్మరణ చేస్తూ ఉండాలి. తన కర్తవ్యాన్ని ఏమాత్రం ఏమరక నిర్వర్తించాలి. కళత్ర పుత్ర బంధువులందరికీ ఆనందం చేకూర్చే పనులు లాభం చూసుకోకుండా తనకు దీనివల్ల ఏమొస్తుందనే ఆలోచన లేకుండా చేయాలి. చిన్నవారి పట్ల దయను కలిగి ఉండాలి. పెద్దవారి పట్ల వినమ్రత ను కలిగి ఉండాలి. గృహాల్లో , పొలాల్లో తిండికోసం దొంగతనం లాంటివి చేసేవారిని దండించకుండా వారికి ఏదైనా పనిని కల్పించి వారి తిండికి కష్టం కలుగకుండా చేయాలి.
అంతేకాదు
మృగాలను, సర్పాలను, మూషికాలను,. మర్కటాలను, మక్షికాలను, గార్ద్భాలను, ఒంటెలను హింసించకూడదు. ఏ మూగప్రాణిని కూడా హింసించరాదు. ప్రాణులన్నింటిలోను భగవంతుడు ఉంటాడు కనుక భగవత్‌స్వరూపం కానిది ఏదీ ఉండదు కనుక ప్రతిప్రాణిని ప్రేమభావంతో చూడడానికి అలవాటుచేసుకోవాలి. దేశకాల దైవాలకు అనుగుణంగా ధర్మార్థకామ పురుషార్థాలతో ప్రవర్తించాలి. ఎవరి కుల వృత్తిని వారు ఆచరించాలి. కులవృత్తి చేయడం వల్ల ధనాన్ని దేవతలకు, ఋషులకు , పితృదేవతలకు, మానవులకు జీవ జంతువులకూ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇలా వీటికి పెట్టడమే పంచమహాయజ్ఞాలని కూడా అంటారు. భగవంతుడు ఎపుడు తనకు నైవేద్యాలను సమర్పించాలనుకోడు కానీ తన భక్తులు ఇతరప్రాణుల పట్ల దయకలిగి ఉండాలని వారికి తోడునీడగా ఉండడమే కాకుండా వారి ఆకలిని తీర్చడానికి వారు కృషి సల్పాలని అంటారు. ఇది వీలయ్యేది గృహస్థాశ్రమం కనుక ఈ ఆశ్రమం ఎంతో పవిత్రమైనది. ప్రతి గృహస్థు కూడా శ్రాద్ద కర్మలూ, జపహోమాదులు, పుణ్యకర్మలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ చరాచర విశ్వమంతావిష్ణుమయం కనుక సర్వప్రాణిలోను సర్వేశ్వరుడిని చూడాలి. ఇట్లా చేసేవారందరూ శ్రీహరికి ప్రీతిపాత్రులు అవుతారు అని నారదుడు ధర్మజునికి విశదీకరించాడు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804