డైలీ సీరియల్

అమృతత్త్వం అంటే..(. ప్రహ్లాదుడు -1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెడిపోయేరాత రాసిన వారిని మంచిదారిలో పెట్టడమూ, మంచిరాత రాసిన వారికి చెడు చేయబోవడమూ ఎంత మూర్ఖత్వమో ప్రతివారికి ఏదో ఒక సందర్భంలో అనుభవైకవేద్యమే అవుతుంది. వాడి రాత అంతే రాసి పెట్టి ఉంది - అన్న మాట మాట్లాడని వారు చాలా తక్కువగా ఉంటారు. ఏదైనా దక్కుతుందనుకొని అది దక్కక పోయిననాడు నాకు వ్రాసి లేదు అని అనుకొనేవారు ఉండనే ఉంటారు.
అట్లాంటి సత్యాన్ని నిరూపించడానికి క్రూర రాక్షస స్వభావుడైన హిరణ్యకశపునకు అతి సుతిమెత్తని స్వభావంతోను, నిర్మలమైన మనస్సుతోను, సదా హరినామం జపించడంలో ఉన్న ఆనందాన్ని చవి చూడడంలో మునిగిపోయే కుమారుడు ప్రహ్లాదునిగా జన్మించాడు. ఆ ప్రహ్లాదుడు అతి చిన్నప్పటి నుంచి భక్త్భివంతో ప్రవర్తిల్లేవాడు. హిరణ్యకశపుని భార్య లీలావతి తన కుమారునిలో ఉదయించిన భక్తిని చూసి తన భర్త కూడా ఒకనాటికి మారుతాడు సాధు స్వభావుడు అవుతాడు లే అనుకొనేది.
హిరణ్య కశపుని సోదరుడైన హిరణ్యాక్షుడు పోయిన తరువాత తన తల్లి రోదించడం చూసి హిరణ్యకశపుడు తన తల్లితో ధర్మయుక్తమైన మాటలు చెప్పాడు. ఆమె దుఃఖాన్ని దూరం చేశాడు. పుట్టిన వారు గిట్టక తప్పదమ్మా నీవు ఈ సోదరుని మరణానికి ఇంత దుఃఖించకూడదు అని చెప్పి ఆమె దుఃఖానికి అడ్డుకట్టవేసాడు.
ఆ తరువాత తాను ఇలా చనిపోకూడదనుకొన్నాడు. దీనికి మార్గమేమిటి అనుకొన్నాడు. బాగా ఆలోచించి అన్ని పనులు సానుకూలం కావడానికి మార్గం తపస్సే అని గట్టిగా నమ్మాడు. వెంటనే తపోవనాలకు బయలుదేరాడు. తీవ్రమైన తపస్సును ఆచరించాడు. హిరణ్య కశపుని తపస్సుకు బ్రహ్మాండమంతా అతలాకుతలం అయింది. దేవతలు, సజ్జనులు, సాధువులు, గంధర్వులు, కింపురుషులు, దిక్పాలకులు వంటివారంతా భయంతో వణికిపోయారు.వారంతా హిరణ్యకశపుని తపోగ్నికి భయపడ్డారు. అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మీరు వాని తపోగ్నిని తగ్గించండి అని చెప్పారు.
బ్రహ్మదేవుడు హిరణ్యకశపుని కఠోరమైన తపస్సుకు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. హిరణ్యకశపుని దగ్గరకు వెళ్లి నీకు కావాల్సిందేమిటో చెప్పు అని అడిగాడు. తపస్సమాధిలో ఉండిపోయిన హిరణ్యకశపుడు బ్రహ్మ తన చెంతకు వచ్చేసరికి అమితానందంతో పొంగిపోయాడు. చేతులెత్తి విధాతకు నమస్కరించాడు. మీరు తీరుస్తాను అంటేనే నేను కోరుకుంటాను అని చెప్పాడు. భవిష్యత్తు తెలిసిన బ్రహ్మ చిరునవ్వుతో జ్ఞానివై మసలుకొనే వరాలనుకోరుకునుము అని చెప్పాడు.
మూర్ఖుడైన హిరణ్యకశపుడు మాత్రం నీటి చేత, గాలి చేత, ధూళి చేత, నిప్పు చేత నాకు మరణం రాకూడదు. అంతేకాక రాత్రి కాని, పగలుకాని, ఏ దిక్కు లోగాని, నేలపై కాని, నింగిపై కాని నాకు చావు రాకూడదు. రాక్షసుల చేతకానీ, దేవతల చేతకాని, మృగాల చేతకాని, నరుల చేత కాని, నాగేంద్రాల చేత కానీ నాకు మృత్యువు రాకూడదు. ఎటువంటి యుద్ధంలోనైనా ఏ అస్త్రం, శస్త్రం చేత కూడా నేను సంహరించబడకూడదు అటువంటి మరణం లేని జీవితం నాకు ప్రసాదించు తండ్రీ అని కోరుకున్నాడు. అంతేకాదు ముల్లోకాలను జయించే ధైర్యం శక్తి నాకు రావాలి. ఎదురులేని పరాక్రమవంతుణ్ణి కావాలి అని కోరుకున్నాడు.
సరస్వతీ పతీ ఆ దానవేంద్రుని కోరికల చిట్టా ను చూసి ఈ వరాలు ఎవరూ పొందలేనివి. ఇంతవరకు ఎవరూ ఇటువంటి వరాలను కోరుకోలేదు కూడా. కానీ నీ పైప్రేమతో ఇవన్నీ ఇస్తున్నాను. నీవు సుబుద్ధివై సుగుణవంతునివై మెలుగు నీ తండ్రికి కీర్తిని ఆర్జించి పెట్టుము అని వెళ్లిపోయాడు.
బ్రహ్మ వెళ్లిన మరుక్షణమే హిరణ్యకశపుడు పొందిన వరాల వల్ల గొప్ప గర్వాన్ని పొందాడు. ఇంటికి వెళ్లాడు. తన తపస్సుకు మెచ్చినఇచ్చిన వరాలను తనవారికి చెప్పాడు. వారందరూ అభినందించారు. వెంటనే ఇంకాస్త గర్వోన్నతిని పొందాడు.
వెంటనే అమరావతిపై దండెత్తాడు. సాధుసజ్జనులను హింసించడం ఆరంభించాడు. దేవతలను ముప్పతిప్పలు పెట్టాడు. ప్రతివారిని బెదరించి తనకు నమస్కారం చేసేటట్లు చేసుకొన్నాడు.

- ఇంకాఉంది