డైలీ సీరియల్

తండ్రి తలంపులే తనయులకా? (ప్రహ్లాదుడు -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యజ్ఞ్ధాకారాన్ని లాక్కున్నాడు. దేవతలకు అందవలసిన హవిస్సులను లాక్కుని భుజించసాగాడు.
లీలావతి హిరణ్యకశపులకు ప్రహ్లాదుడు జన్మించాడు. చిన్ననాటి నుంచి మాధవునిపై ప్రేమను పెంచుకున్నాడు. అందరి బాలకులవలె కాక నిరంతరమూ ఆ దేవదేవుని పై మమకారాన్ని పెంచుకుంటూ ప్రవర్ధమానమవసాగాడు ప్రహ్లాదుడు.
కాసేపు ఆ నారాయణుడు తన దగ్గర కూర్చుని మాట్లాడినట్లు అనుకొంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉండిపోయేవాడు. మరికొంత సేపు నారాయణునితో ఆట్లాడుకుంటున్నట్లు తను ఒక్కడే ఆడుకునేవాడు. నారాయణునితో ముచ్చట్లాడుతున్నట్లుగా ప్రహ్లాదుడు ఒక్కడే ఆనంద తన్మయత్వంతో ఉండిపోయేవాడు. ఒక్కోసారి తనను విడిచి నారాయణుడు దూరంగా వెళ్లినట్లు అనుకొంటూ దుఃఖంలో మునిగిపోయేవాడు. జడునివలె సంచరించేవాడు. ఏమీ తెలియని అమాయకపు బాలకునివలె ప్రవర్తించేవాడు. ఎప్పుడు ఆనందమైనా, విచారమైన తానొక్కడే అనుభవించడమేమో హిరణ్యకశపునకు అర్థం కాలేదు. తాను ఎంత పిలిచినా, నవ్వించినా నవ్వని ప్రహ్లాదుడు ఒక్కడే కూర్చుని నవ్వుకుంటూ ఉండడం చూసి వీనికేదో బాగలేనట్టు ఉంది అనుకొన్నాడు. వైద్యులను పిలిపించి ప్రహ్లాదుని ఆరోగ్యాన్ని సరి చేయమని చెప్పాడు. వైద్యులను ప్రహ్లాదుని పరీక్షించి మంచి ఆరోగ్యవంతునిగా ఉన్నాడని చెప్పి వెళ్లిపోయారు.
కాని ప్రహ్లాదునిలో ఎలాంటిమార్పు రాలేదు.
బాగా ఆలోచించి హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిని చండామార్కుల వారికి అప్పగించారు. మూర్ఖుడైనా విద్యాప్రభావం చేత విజ్ఖుడవుతాడు, అంతేకాక జడునిగా ఉన్న నా కుమారుడిని విజ్ఞాన వంతుడిని చేయండి. నా పరాక్రమము, నా ధైర్యసాహసాలు వానిలో మచ్చుకుకూడా కానరావడం లేదు కనుక మీరు అవన్నీ వానిలో ఉద్భవించేట్లు చేయండి అని చెప్పి గురుకులానికి రాక్షసేంద్రుడు ప్రహ్లాదుడిని పంపాడు.
గురువులు ప్రహ్లాదుడిని తీసుకొని వెళ్లి శాస్త్ర విజ్ఞానాన్ని నేర్పించారు. యుద్ధ విద్యలను నేర్పించారు. నీతి శాస్త్రాన్ని కూడా నేర్పించారు. వారి వంశావళిని ఆయనకు వివరించారు. అన్నింటిలోను విజ్ఞత కనబరుస్తున్న ప్రహ్లాదుడిని తీసుకొని దానవ రాజు దగ్గరకు తీసుకొని వచ్చారు. ‘మహారాజా! మేము మీరు కోరినట్లుగా కుమారులకు అన్నీ విద్యలను నేర్పించాము. అన్నింటిలోను అగ్రగామిగానే ఉన్నాడు’ అని చెప్పారు. దానవేంద్రుడు చాలా సంతోషించి తన కొడుకు ను దగ్గర తీసుకొని తన అంకపీఠంపై కూర్చోబెట్టుకుని ‘నాయనా! నిన్ను విడిచి చాలా కాలం ఉన్నాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తోంది. నీవు గురువుల మాట విన్నావు కదా. అన్నీ శాస్త్రాలు తెలుసుకొన్నావు కదా’ అని అడిగాడు.
ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వి ‘తండ్రీ అన్నీ శాస్త్రార్థాలను పరిశీలించాను. అన్ని విద్యలను పరికించి పరీక్షించి చూశాను. కానీ నాకు మాత్రము నిత్యమైనదీ సత్యమైనదీ శాశ్వతమైనదీ ఒక్క వైకుంఠ ధామమే అనిపిస్తోంది. ఈ విద్యలన్నీ కూడా లిప్తమాత్రమే పనికి వచ్చేవి.. ఆ వైకుంఠ నాథుని కోసం చేసే భజనలు మాత్రమే శాశ్వత కీర్తినిచ్చేవి అని అనిపించాయి.
ఆ మహావిష్ణువును ఆరాధించని రోజు నాకు మహానరకంలో ఉన్నట్టుగా ఉంటోంది. ఆ దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయణుని స్తుతి ని వినని చెవులు ఎందుకు పనికి వస్తాయి ’అని అంటుండగానే ఎక్కడ లేని కోపం తెచ్చుకని దానిని దిగమింగుతూ ‘తండ్రీ నీకు ఎవరు నేర్పారీ బుద్ధులు. మన శత్రువును నీవు కీర్తించడమేమిటి? ఈ అసురులకు భయపడి దాక్కునే సురలను ఎవరైనా స్తుతిస్తారా? అసలు ఇంత చిన్న వాడినైన నీ హృదయంలో ములుకుల వంటి మాటలను ఎవరు నాటారు? దీనికికారణమైన వారెవరూ?’ అంటూ గురువుల వేపు క్రూరంగా కోపంగా హిరణ్యకశపుడు చూశాడు.
దానవేంద్రుని ఆగ్రహాన్ని తట్టుకోలేమని భావించిన రాజ గురువులు ‘మహారాజా! మమ్ము క్షమించండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టు ఉంది. మాకు తెలియకుండా దేనినైనా పఠిస్తున్నాడేమో మేమే పరిశీలించి మీకు నివేదిస్తాము. ఇపుడు ఈ బాలకుడిని మాకు అప్పజెప్పండి.

- డా. రాయసం లక్ష్మి.