రాష్ట్రీయం

దద్దరిల్లుతున్న దండకారణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మిషన్ 2060 పేరిట జాయింట్ ఆపరేషన్
* ప్రతిదాడులకు పాల్పడుతున్న మావోయిస్టులు
చింతూరు, మార్చి 11: చత్తీష్‌గడ్, తెలంగాణా, ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసులు-మావోయిస్టుల మధ్య జరుగుతున్న వరుస ఎదురుకాల్పులు, మందు పాతరల పేలుళ్లతో దండ కారణ్యం దద్దరిల్లుతోంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఎదురు దాడులకు దిగుతున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య నువ్వా-నేనా అన్న చందంగా పోరు సాగుతోంది. ఒక పక్క పోలీసు బలగాలు మిషన్ 2060 పేరిట జాయింట్ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా నిఘా వర్గాలతో నిరంతరం సంప్రదింపులు, సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం జరుపుతూ మావోయిస్టులపై దాడులకు పాల్పడుతూ వారిని మట్టుపెట్టే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మరోవైపు మావోయిస్టులు పోలీసుల వ్యూహాలను తెలుసుకుంటూ ప్రతి వ్యూహాలు పన్ని పోలీసు బలగాలను చావుదెబ్బతీస్తున్నారు. దండ కారణ్యంలో గత నెల ఫిబ్రవరి 29న బీజాపూర్ జిల్లా పామేరు పోలీసు స్టేషన్ పరిధిలోని బొచ్చెలంక అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు మావోయిస్టులపై దాడిచేసి ఎనిమిది మంది మావోయిస్టులను హతమార్చారు. మార్చి 2న నారాయణపూర్ జిల్లాలో ఇన్‌ఫార్మర్లనే నెపంతో 16మంది గిరిజనులను మావోయిస్టులు ఊచకోత చేశారు. మార్చి 4న సుకుమా జిల్లా కిష్టారం పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలపై కాల్పులు జరిపి ముగ్గురు జవాన్లను మట్టుపెట్టి 13మంది జవాన్లను గాయపర్చారు. ఇదిలా ఉండగా..శుక్రవారం సుకుమా జిల్లా మురళీగూడా బేస్ క్యాంపునుండి కూంబింగ్‌కు వెళుతున్న పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు మోపడంతో మందుపాతర పేలి ఒక జవాను మృతిచెందాడు. అలాగే ఇద్దరు డిప్యూటీ కమాండెంట్లు గాయాలపాలయ్యారు. ఈ విధంగా పోలీసులు, మావోయిస్టులు దండ కారణ్యంపై పట్టుసాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు దండ కారణ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది.