ఆంధ్రప్రదేశ్
ధర్మానకు థర్మల్ సెగ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 6 December 2015
సోంపేట, డిసెంబర్ 5: వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు శనివారం థర్మల్ సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే సోంపేట బీల ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారంటూ మత్స్యకారులు నిలదీశారు. గతంలో జరిగిన పరిణామాలకు క్షమాపణ చెప్పిన తరువాతనే ధర్మాన పర్యటించాలని ఎక్కువూరు గ్రామంలో మత్స్యకార ఐక్యవేదిక నాయకులు తీవ్రంగా పట్టుబట్టారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ మత్స్యకారులతో మాట్లాడి శాంతింపచేసి, ధర్మానతో మత్స్యకారులకు క్షమాపణలు చెప్పించారు.