హైదరాబాద్

దాసరికి యువకళావాహిని ఆత్మీయ సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: తెలుగు సినీ పరిశ్రమలో తాత-మనవుడు చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావుకు యువకళావాహిని ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఆత్మీయ సత్కారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శాలువా కప్పి కిరీటధారణతో దాసరిని ఘనంగా సత్కరించారు. 40 సంవత్సరాల దీక్షతో యువకళావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సంస్థను అభినందిస్తూ సంగీతంపై ఉన్న అభిమానంతో రమేష్‌నాయుడు సినీ సంగీత విభావరి నిర్వహించినందుకు సంస్థను అభినందించారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ రమేష్‌నాయుడు సంగీతం గురించి తెలుగుగాని, ఆయన గొప్పతనాన్ని కొంతమందికే తెలుసునని, హిందీ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు లక్ష్మీకాంత్-ప్యారీలాల్ రమేష్‌నాయుడు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన విషయం చాలా తక్కువమందికే తెలిసి ఉంటుందని ఆయన అన్నారు. సినీ సంగీత దర్శకులలో రమేష్‌నాయుడు మించినవారు లేరు ఈ ప్రపంచంలో, రమేష్‌నాయుడు ఇచ్చిన హిట్స్ మరే సంగీత దర్శకుడు ఇవ్వలేదని దాసరి కొనియాడారు. రమేష్‌నాయుడు ఎంత నిరాడంబరుడో ఆయన పేరు ఎక్కడా వినిపించకపోవడమే. ఆ మహనీయుని గుర్తుచేస్తూ కార్యక్రమం నిర్వహించినందుకు యువకళావాహినిని ప్రత్యేకంగా అభినందించారు. శారదా ఆకునూరి, సినీనటి జమున, అశ్వనీ సుబ్బారావు, బండారు సుబ్బారావు, సినీనటి గీతాంజలి, డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, రవి కొండబోలులకు అతిధి సత్కారం జరిగింది. తొలుత సంస్థ అధ్యక్షుడు వై.కె.నాగేశ్వరరావు స్వాగతం పలుకగా పలువురు గాయినీ గాయకులు రమేష్‌నాయుడు స్వరపరిచిన గీతాలను ఆలపించి కార్యక్రమాన్ని రక్తికట్టించారు.

క్రికెట్ టోర్నీ చాంప్ మెట్రో ఇండియా
చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 25: మాసాబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ మైదానంలో నిర్వహించిన టిఎన్ పిళ్లై స్మారక ఇంటర్ మీడియా క్రికెట్ టోర్నమెంట్‌లో మెట్రో ఇండియా జట్టు విజేతగా నలిచింది. ఫేనల్లో మెట్రో ఇండియా జట్టు పది పరుగుల తేడాతో ప్రత్యర్థి నెంబర్ వన్ టివి జట్టుపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మెట్రో జట్టు నిర్ణీత ఓవర్లలో 73 పరుగులు చేసింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన నెంబర్ వన్ టివి జట్టు 63 పరుగులు చేసి ఓటమి పాలైంది.
అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ పోలీసు జాయింట్ కమిషనర్ టి.మురళికృష్ణ విచ్చేసి గెలుపొందిన జట్లకు ట్రోఫిలను అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ రింజీ క్రికెటర్, స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి కె.సాయిబాబా, బి.మోహన్ పాల్గొన్నారు.