జాతీయ వార్తలు

మా ప్రభుత్వం కార్మిక పక్షపాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ ఆరోపణల్లో పస లేదు
త్వరలో పార్లమెంట్‌లో బోనస్ చట్టం
కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 6:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తీవ్రంగా ఖండించారు. దత్తాత్రేయ ఆదివారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే చట్టాలను తమ ప్రభుత్వం ఎంతమాత్రం తీసుకురావటం లేదని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బోనస్ చట్టాన్ని త్వరలోనే పార్లమెంటులో ప్రతిపాదిస్తామని బండారు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల కోసం ఏమీ చేయలేదు, తాము అధికారంలోకి రాగానే కార్మిక సంఘాలతో త్రైపాక్షిక సమావేశాలు ఏర్పాటు చేసి సంస్కరణల గురించి చర్చించి తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కార్మికులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందనీ, ఇందులో భాగంగానే ఎన్‌డిఏ ప్రభుత్వం కార్మిక విధానాలపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని దత్తాత్రేయ తెలిపారు. కార్మికులకు సంబంధించిన ప్రతి అంశం గురించి వారితో చర్చించిన తరువాతనే ఒక నిర్ణయానికి వస్తున్నామనేది మరిచిపోరాదని ఆయన సూచించారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్‌కు చెందిన ఇతర నాయకులు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా కార్మికులు విశ్వసించరని బండారు చెప్పారు.