జాతీయ వార్తలు

ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2012నాటికి దేశంలో 4.5కోట్ల మంది నిరుద్యోగులు
లోక్‌సభలో వివరించిన కార్మిక మంత్రి దత్తాత్రేయ

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దేశంలో 2012 డిసెంబర్ నెలాఖరుకు జాతీయ ఉపాధి కల్పనా కేంద్రాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 4 కోట్ల 48 లక్షల మంది అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. దత్తాత్రేయ సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో యోగి ఆధిత్యనాథ్, పికె శ్రీమతి టీచర్ అడిగిన మూల ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉపాధి కల్పనా కేంద్రాల్లో నమోదు చేసుకున్న వారంతా నిరుద్యోగులని చెప్పేందుకు వీలులేదని అన్నారు. 4 కోట్ల 48 లక్షల మంది నిరుద్యోగుల్లో రెండు కోట్ల 86 లక్షల మంది 15-29 సంవత్సరాల వయస్సులో ఉన్న వారని ఆయన వివరించారు. 2012 డిసెంబర్ ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధి కల్పనా కేంద్రాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 19 లక్షల 18 వేలని బండారు చెప్పారు. అందులో యువకుల సంఖ్య 12 లక్షల 39 వేలని ఆయన వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని దత్తాత్రేయ పేర్కొన్నారు. యువకుల్లో నైపుణ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. దీంతోపాటు అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. కార్మికులకు వారు పని చేసే చోటే పదిహేను రోజుల పాటు శిక్షణ ఇవ్వటంతోపాటు రోజుకు 35 రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్టు దత్తాత్రేయ వెల్లడించారు.
కార్మిక హక్కులను కాపాడుతాం
కార్మిక చట్టాలను హేతుబద్ధీకరించాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మికుల హక్కులను కాపాడుతామని పార్లమెంట్‌లో ఉద్ఘాటించింది. ఇందుకు సంబంధించిన ఎటువంటి చట్ట సవరణలనైనా భాగస్వాములందరితో సంప్రదించిన తర్వాతే చేస్తామని ప్రకటించింది. సోమవారం లోక్‌సభలో కొంతమంది సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ, పై విషయాన్ని స్పష్టం చేశారు. ‘శ్రమజీవుల హక్కులను హరించే ప్రసక్తే లేదు’ అని ఆయన అన్నారు. దేశంలో కార్మిక చట్టాలను సవరించే ప్రక్రియ కొనసాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత భాగస్వాములందరినీ గమనంలోకి తీసుకుని త్రైపాక్షిక సంప్రదింపుల ద్వారా ఈ సవరణలు చేస్తామని దత్తాత్రేయ తెలిపారు. జాతీయ గ్రామీణ కార్మిక కమిషన్ సిఫారసు మేరకు ఒకే విధమైన వేతన వ్యవస్థను తీసుకువచ్చి జాతీయ స్థాయి కనిష్ఠ కనీస వేతనం ఉండాలన్న భావనను 1996లో తెరమీదికి తీసుకువచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తర్వాత వినిమయ ధరల సూచీ పెరుగుదలను గమనంలోకి తీసుకుని ఎప్పటికప్పుడు దీనిని సవరిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి కనిష్ఠ కనీస వేతనాన్ని రోజుకు 160 రూపాయలుగా నిర్ధేశించిందన్నారు.