జాతీయ వార్తలు

దత్తత స్వీకారంపై నిబంధనలు రూపొందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, మార్చి 14: దేశం లోపల, దేశాల మధ్య పిల్లల దత్తతకు సంబంధించి ఇందుకోసం రూపొందించిన కొత్త చట్టం కింద నియమ నిబంధనలను రూపొందించాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని దత్తత స్వీకారాల వ్యవహారంపైనా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) దర్యాప్తుకు ఆదేశించడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ ఒకవేళ నిర్దిష్ట సంఘటనకు సంబంధించి నిర్దిష్టమైన ఆరోపణలతో ముందుకు వస్తే దర్యాప్తు జరిపే విషయాన్ని పరిశీలించాలని సిబిఐకి సూచించింది. జువనైల్ జస్టిస్ చట్టం 2002లోని సెక్షన్ 2(ఎఎ)లో దత్తత స్వీకారానికి సంబంధించి స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. మామూలు తల్లిదండులు, పిల్లల మధ్య ఉండే అన్ని హక్కులు, ప్రత్యేక హక్కులు, బాధ్యతలు దత్తత తీసుకునే తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య ఉంటాయని ఆ సెక్షన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక దత్తత స్వీకారానికి సంబంధించి నియమ నిబంధనలను రూపొందిస్తే ఆ తర్వాత దత్తత తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు తమ మతంతో సంబంధం లేకుండా సెక్యులర్ చట్టమైన ఈ జువనైల్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎవరినైనా దత్తత తీసుకునేందుకు వీలు కలుగుతుంది.