జాతీయ వార్తలు

నా భర్త తలతీసే వరకూ మాయావతి నిద్రపోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ‘నా భర్తపై పోలీసులు కేసు పెట్టారు.. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పారు.. బిజెపి నుంచి ఆయనను బహిష్కరించారు.. అయినా బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఇంకా శాంతించడం లేదు.. నా భర్త తలతీసే వరకూ ఆమె నిద్రపోరు..’- అంటూ దయాశంకర్ భార్య స్వాతి సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాయావతిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన యుపి బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. బిఎస్‌పి కార్యకర్తలు తనను, తన 12 ఏళ్ల కుమార్తెను వేధిస్తున్నారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్వాతి సింగ్ మీడియాకు తెలిపారు. తనను, తన కుమార్తెను బిఎస్‌పి కార్యకర్తలు అవమానాలకు గురిచేస్తుంటే మాయావతి స్పందించరా? అని ఆమె ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా మాయావతి ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. మహిళను అవమానించడం తన భర్త విషయంలో తప్పయితే అది బిఎస్‌పి కార్యకర్తలకు వర్తించదా? అని ఆమె ఆవేదన చెందారు.