రాష్ట్రీయం

‘బీఫ్’పై ఓయూ ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో 2కెరన్ అడ్డుకున్న పోలీసులు
గోరక్ష అవగాహన సదస్సుకు అనుమతించండి: రాజాసింగ్
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నందుకే బీఫ్ ఫెస్టివల్ : విమలక్క
వారం రోజులపాటు నగరంలో నిషేధాజ్ఞలు: డిసిపి
హైదరాబాద్, డిసెంబర్ 7: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతుగా పలు విద్యార్థి సంఘాలు 2కెరన్ నిర్వహించారు. 2కెరన్ ప్రారంభంతోనే 20మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది గ్రూపులుగా విడిపోయి 2కెరన్‌కు సిద్ధమవుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఓయూలో కాస్సేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాగా బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతుగా శనివారం సిపిఐ మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషా, సిపిఎం రాష్ట్ర నాయకురాలు మల్లు స్వరాజ్యం, పిడబ్ల్యుఓ రాష్ట్ర కార్యదర్శి సంధ్యతోపాటు బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు స్టాలిన్ తదితరులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే. అదేవిధంగా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు పాతబస్తీ నుంచి బయలుదేరిన మజ్లిస్-బచావో-తహరిక్ (ఎంబిటి) రాష్ట్ర నేత అమ్జదుల్లాఖాన్‌ను సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈనెల 10వ తేదీన వామపక్ష దళిత మైనార్టీ విద్యార్థి సంఘాలు నిర్వహించతలపెట్టిన బీఫ్, పోర్క్ ఫెస్టివల్‌కు ఏలాంటి అనుమతిలేదని నగర పోలీసులు స్పష్టం చేశారు. ఓయూ పరిసర ప్రాంతాల్లో 144సెక్షన్ వారం రోజులపాటు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈనెల 12వ తేదీ వరకు ఎలాంటి ఉత్సవాలకు అనుమతించడంలేదని ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సహకరించాలని ఆయన కోరారు. శాంతి,్భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డిసిపి హెచ్చరించారు.
10న ఇందిరాపార్కు వద్ద నిర్వహించతలపెట్టిన గోరక్షణపై అవగాహన సదస్సుకు అనుమతివ్వాలని కోరుతూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం నగర కమిషనర్ మహేందర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గోవులను రక్షిస్తే దేశం సకల సంపదతో తులతూగుతుందన్నారు. గోవుల పరిరక్షణపై ప్రజలకు తెలియాలనే అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నందుకే బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యురాలు విమలక్క అన్నారు. ఈ నెల 10న ప్రజాస్వామిక సాంస్కృతిక ఫోరం నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌కు ఆమె మద్దతు తెలిపారు. సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశమని, అయితే ఎన్డీయే సర్కార్ కొన్ని మతాలపై దాడులకు తెగబడుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో తినే తిండిపై ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు. గతంలో దేశాన్ని నాలుగు వందల సంవత్సరాలు ముస్లింలు పాలించారని వారు ఏనాడు కూడా తిండి ఎలాంటి ఆంక్షలు విధించలేదని గుర్తు చేశారు.