జాతీయ వార్తలు

దిల్లీలో నీటి సంక్షోభంపై స్పందించిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: హర్యానాలో జాట్ కులస్థుల ఆందోళనల ఫలితంగా దిల్లీ నగరానికి నీటి సరఫరా నిలిచిపోవడంపై సుప్రీం కోర్టు స్పందించింది. నీటి సరఫరా పునరుద్ధరణకు తగు ఆదేశాలివ్వాలంటూ దిల్లీ సిఎం కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించడంతో కేంద్రంతోపాటు హర్యానా సర్కారుకు న్యాయస్థానం నోటీసులిచ్చింది. ఈ విషయమై రెండురోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రతి విషయానికీ కోర్టును ఆశ్రయించడం సరికాదని, ఇలాంటి సమస్యలను ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, హర్యానాలోని మునాక్ కాల్వ వద్ద అడ్డంకులను తొలగించి సైన్యం పహారా కాస్తుండడంతో దిల్లీకి నీటి సరఫరా మళ్లీ ప్రారంభమైంది.