జాతీయ వార్తలు

రాజ్యసభను కుదిపేసిన డిడిసిఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలు సోమవారం రాజ్యసభను కుదిపేశాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సభ రసాభాసగా మారిం ది. బిజెపికే చెందిన ఎంపీ కీర్తి ఆజాద్ ఆదివారం చేసిన ఆరోపణలను దృ ష్ట్యా ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ ఆజాద్ సభ ప్రారంభం కాగానే డిడిసిఏ వ్యవహారాలపై దేశం అంతా ఉత్కంఠతతోఎదురు చూస్తోందని చెప్పారు. ఈమొత్తం వ్యవహారంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేరు వివాదాంగా మారినందున ఈ అంశంపై చర్చకు అనుమతించాలని డిప్యూటీ చైర్మన్ కురియన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆజాద్ చేసిన ఈ ప్రతిపాదనపై జైట్లీ స్పందిస్తూ తనను ఇరుకునపెట్టటానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌పై పై తీవ్ర స్థాయిలోఎదురు దాడికి దిగారు. కచ్చితమైన సాక్ష్యాధారాలతో ఆరోపణలపై వెంటనే చర్చ ప్రారంభించవలసిందిగా సవాల్ చేశారు. ‘సాక్ష్యాధారాలతో చర్చను ప్రారంభించండి. మీరు చేసే ప్రతి ఒక్క ఆరోపణకు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను’ అని జైట్లీ అన్నారు. అయితే మంత్రి సవాల్‌ను స్వీకరించి చర్చించటానికి కాంగ్రెస్ సాహసించలేదు. ఈ అంశా న్ని ప్రస్తావించిన ఆజాద్ కూడా వౌనం పాటించారు. బిజెపి సభ్యులు జైట్లీకి మద్దతుగా నిలిచి కాంగ్రెస్ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీజర్ భార్య అనుమానాలకు అతీతంగా ఉండాలన్న పోస్టర్లను పట్టుకుని కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. వెల్‌లోకి పోస్టర్లతో రావద్దని డిప్యూటీ చైర్మన్ కురియన్ కాంగ్రెస్ సభ్యులను హెచ్చరించినా లాభం లేక పొయింది. పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోప వాదాలు జరిగాయి. ఈ దశలో డిప్యూ టీ చైర్మన్ కురియన్ జోక్యం చేసుకుని చర్చకు ప్రభుత్వం తన సంసిద్ధత తెలియచేసినందున చర్చను ప్రారంభించండని కాంగ్రెస్‌కు సూచించారు. ఒక దశలో మీ సభ్యులను మీరు అదుపు చేసి వెనక్కి పంపితేనే మీకు మాట్లాడే అవకాశం ఇస్తానని ఆయన కాంగ్రెస్ ఉప నాయకుడు ఆనంద్‌శర్మతో అన్నా రు. కాంగ్రెస్ సభ్యులు మాత్రం నినాదాలు ఆపలేదు. పాలక, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు తార స్థా యికి చేరుకోవటంతో సభ నడపటం సాధ్యపడదని గ్రహించిన కురియన్ సభను 12 గంటల వరకూ వాయిదావేశారు. 12 గంటలకు చైర్మన్ అన్సారీ సభకు వచ్చి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన రెండు సార్లు సభను వాయిదా వేశారు. (చిత్రం) సోమవారం రాజ్యసభలో చోటుచేసుకున్న గందరగోళం