జాతీయ వార్తలు

చెబితే విన్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే ‘అనుభవిస్తున్నారు’ డిడిసిఎ వ్యవహారంపై శివసేన

ముంబయి, డిసెంబర్ 26: కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి అవినీతి వ్యతిరేక ఉద్యమం సాగించినప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని, కేజ్రీవాల్‌కు మద్దతు తెలపవద్దని అప్పట్లో తాము చేసిన సూచనను కమలనాథులు విని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదని బిజెపి మిత్రపక్షమైన శివసేన ఎద్దేవా చేసింది. ‘గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే, కేజ్రీవాల్ ప్రభృతులు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నానాయాగీ సృష్టించిన విషయం మాకు ఇంకా గుర్తుంది. అప్పట్లో కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రశంసలు అందుకుంటున్న కేజ్రీవాల్ దుందుడుకు చర్యలను సమర్థించేందుకు వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ పోటీలో అన్ని పార్టీల కంటే బిజెపి ముందు నిలిచింది. ఆ సమయంలో కేజ్రీవాల్‌కు మద్దతు తెలపాలని జైట్లీ తదితరులు చేసిన విజ్ఞప్తిని మేము పట్టించుకోలేదు. కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపితే అది ఏదో ఒకనాడు బెడిసి కొడుతుందని బిజెపికి స్పష్టం చేశాం. ఇప్పుడు అదే జరుగుతోంది. అప్పట్లో కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపినందుకు అరుణ్ జైట్లీ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు’ అని పార్టీ పత్రిక ‘సామ్నా’లో ప్రచురితమైన సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యానించింది. తమకు గొప్ప తెలివితేటలు లేకపోవచ్చని, కానీ ఇటువంటి వ్యవహారాలకు సంబంధించి గతంలో కొన్ని పాఠాలు నేర్చుకున్నందునే కేజ్రీవాల్‌ను సమర్థించవద్దని అప్పట్లో బిజెపికి సూచించామని శివసేన పేర్కొంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేజ్రీవాల్‌ను గౌరవించాల్సిందేనని, అయితే ప్రధాన మంత్రితోపాటు అరుణ్ జైట్లీ పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ వీధిరౌడీని మరిపించేలా మాట్లాడుతున్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిని దిగజార్చడం సముచితం కాదని శివసేన పేర్కొంది. డిడిసిఎ (్ఢల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్)కి గతంలో 13 ఏళ్లపాటు అధ్యక్షుడిగా వ్యవహరించిన అరుణ్ జైట్లీ అనేక అక్రమాలకు పాల్పడినట్లు కేజ్రీవాల్‌తోపాటు వివిధ వర్గాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది.
** డిడిసిఎ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ గుర్‌గావ్‌లో శనివారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు **