జాతీయ వార్తలు

కేజ్రీవాల్‌పై జైట్లీ పరువునష్టం దావా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: డిడిసిఏ వ్యవహారం ముదురుతోంది. తనపై అవినీతి ఆరోపణలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఐదుగురు ఆప్ నాయకులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు. స్టేడియం నిర్మాణంలో తాను అవినీతికి పాల్పడినట్టు కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని జైట్లీ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు.
జైట్లీ పరువునష్టం దావాను ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సంజయ్ ఖనగ్‌వాల్ విచారణకు స్వీకరించి కేసును జనవరి 5కు వాయిదా వేశారు. ఆర్థిక మత్రి అరుణ్ జైట్లీ తరఫున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లూథ్ర పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నేతల ఆరోపణలు అవాస్తవమని, ఆర్థిక మంత్రి పరువుప్రతిష్టకు భంగం కలిగించాని కోర్టుకు విన్నవించారు.‘డిడిసిఏ నుం చి జైట్లీ ఒక్కపైసా అవినీతికి పాల్పడలేదు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణల్ల పరువునష్టం కలిగింది’అని లూధ్ర స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టులో 35 నిముషాల పాటు విచారణ సాగింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో పాటు బిజెపి సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, జెపి నడ్డా, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, పియూష్ గోయల్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కోర్టు వద్దకు వచ్చారు. జైట్లీ తన పిటిషన్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ బాజ్‌పాయి పేర్లను పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లలోనే కాకుండా ట్విట్టర్లలోనూ ఆరోపణలు చేశారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఐపిసిలోని 499,500,501,502, 34, 35 సెక్షన్ల కింద ఆప్ నేతలపై కేసు పెట్టారు. (చిత్రం) పిటిషన్ దాఖలుకు పాటియాలా హౌస్ కోర్టుకు వచ్చిన జైట్లీ..కేంద్రమంత్రి ఇరానీ