జాతీయ వార్తలు

బిజెపి ఎమ్మెల్యే శర్మకు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీకి చెందిన బిజెపి ఎమ్మెల్యే ఓపి శర్మకు స్థానిక పోలీసులు గురువారం సమన్లు జారీ చేశారు. ఇక్కడి పటియాలా హౌస్ కోర్టు వద్ద ఇటీవల విద్యార్థులకు, లాయర్లకు మధ్య ఘర్షణ జరిగినపుడు ఓ సిపిఐ కార్యకర్తను కొట్టినట్లు శర్మపై కేసు దాఖలైంది. సమన్లు తీసుకున్న తర్వాత శర్మ మీడియాతో మాట్లాడుతూ, తాను కోర్టుకు సహకరిస్తానని చెప్పారు. జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్‌ను కోర్టుకు హాజరుపరిచినపుడు విద్యార్థులకు, లాయర్లకు ఘర్షణ జరిగినపుడు శర్మ కూడా సంఘటన ప్రాంతంలో ఉన్నట్లు, తనపై దాడి చేసినట్లు ఓ సిపిఐ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.