ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పార్లమెంటుపై గౌరవం ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న ‘పెద్దనోట్ల రద్దు’ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో అధికారికంగా ఒక ప్రకటన చేస్తే బాగుండేదన్న వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలకు, బడా పారిశ్రామికవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘నోట్ల రద్దు’ నిర్ణయంపై ప్రధాని తనకు తానుగా ఉభయ సభల్లో వివరణ ఇచ్చి ఉంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పటిష్టమయ్యేది. మోదీ స్వయంగా చొరవ చూపి ఈ విషయమై సజావుగా చర్చ జరిగేందుకు కృషి చేసి ఉంటే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రభస జరిగి ఉండేదికాదు. పెద్దనోట్లను రాత్రికి రాత్రి అకస్మాత్తుగా రద్దు చేయడం వల్ల అవినీతిపరులకు, నల్లకుబేరులకు ఊహించని దెబ్బ తగిలింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బిఎస్‌పి తదితర పార్టీలతోపాటు హవాలా వ్యాపారులు, ఉగ్రవాదులు,బడా పారిశ్రామిక వేత్తలకు పెద్దఎత్తున నష్టం సంభవించి ఉండవచ్చు. అయితే, సగటు జీవులకు కలుగుతున్న నష్టం, వారు పడుతున్న బాధలు వర్ణణాతీతం. అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్టు చెబుతున్న మోదీ అదే అంశాన్ని మొదటిరోజే పార్లమెంటుకు వివరించి ఉంటే ఆయన స్థాయి మరింత పెరిగేది. పార్లమెంటు- ‘ప్రజాస్వామ్య దేవాలయమం’టూ సెంట్రల్ హాల్ మెట్లపై తలపెట్టి తన గౌరవాన్ని ప్రకటించుకున్న మోదీ ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై చర్చ ప్రారంభమైంది. ఈ అంశంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించటం, ప్రతిపక్షం బాధ్యతతో వ్యవహరిస్తూ చర్చను కొనసాగించటం ప్రశంసనీయం. అయితే, ఆ మరుసటి రోజునుండి ‘రాజకీయం సా వర్థం’ రాజ్యసభలో చర్చను దెబ్బ తీసింది. చర్చ ప్రశాంతంగా జరిగితే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అనుమానించిన ప్రతిపక్షం రెండోరోజు నుండే రకరకాల కారణాలు చూపుతూ రభస చేయడం ప్రారంభించింది. మోదీ సభకు వచ్చి కూర్చుంటే తప్ప చర్చను ముం దుకు సాగనివ్వమని చెప్పటం ద్వారా రాజ్యసభలో విపక్షం తమ బాధ్యతను విస్మరించింది. రాజ్యసభలో వాయిదా తీర్మానం ద్వారా పెద్దనోట్లపై చర్చ జరిపేందుకు అంగీకరించిన ప్రభుత్వం లోక్‌సభలో కూడా వాయిదా తీర్మానంపై చర్చకు అంగీకరించి ఉండాల్సింది. అధికారంలో ఉన్న పార్టీని జనం సమస్యలపై నిలదీసి ఇబ్బందులకు గురి చేయటం ప్రతిపక్షం హక్కు. అందుకే వారం రోజుల నుండి విపక్షం అదే పని చేస్తోంది. దీన్ని విపక్షం బాధ్యతారాహిత్యమని విమర్శించినట్లే, అందరినీ ఒప్పించి చర్చను ముందుకు తీసుకుపోవలసిన అధికార పక్షం మొండిగా వ్యవహరించడం కూడా అంతే బాధ్యతారాహిత్యం అనాలి.
రాజ్యసభలో వాయిదా తీర్మానం ద్వారా చర్చకు అంగీకరించిన ప్రభుత్వం లోక్‌సభలోనూ అదే పద్ధతిలో చర్చకు సిద్ధపడి ఉంటే బాగుండేది. లోక్‌సభ సభ్యులకూ అలాంటి అవకాశం ఇస్తే రభస జరిగి ఉండేది కాదు. చర్చ ఇప్పటికే పూర్తయిపోయి ఉండేది. ప్ర భుత్వం తన వైఖరిని సడలించక పోవడంతో పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రాజ్యసభలో వాయిదా తీర్మానంపై చర్చ ప్రారంభమైన అనంతరం ప్రతిపక్షం మెలికలు పెట్టటం కూడా బాధ్యతారాహిత్యమే. ప్రధాని మోదీ సభకు వస్తే తప్ప చర్చను ముందుకు సాగనివ్వమంటూ ప్రతిపక్షం మొండిపట్టు వీడకపోవడం సమర్థనీయం కాదు. గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి ప్రధాని హాజరైనందున చర్చను ముందుకు తీసుకుపోవాలంటూ సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలను ముగ్గులోకి దించటంలో విజయం సాధించారు. మోదీ ఉన్న గంట సేపూ రాజ్యసభలో చర్చ సజావుగానే జరిగింది. భోజన విరామం తర్వాత రాజ్యసభకు ప్రధాని గైర్హాజరు కావటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అరుణ్ జైట్లీ చర్చకు సమాధానం ఇచ్చే సమయంలో ప్రధాని సభలోనే ఉండాలని డిమాండ్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ, చర్చ జరుగుతున్నంత సేపూ ప్రధాని సభలో ఉండాలనటం అర్థరహితం. ‘సర్దుకునే అవకాశం’ ఇవ్వనందుకే ప్రతిపక్షాలు తనపై దాడి చేస్తున్నాయంటూ మోదీ చేసిన విమర్శ సమంజసం కాదు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని 72 గంటల ముందు ప్రతిపక్షాలకు రహస్యంగా చెప్పి ఉంటే వారు తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని సర్దుకునే వారని మోదీ పరోక్షంగా ఆరోపణ చేయటం రెచ్చగొట్టటం కాదా? ప్రతిపక్షాలను ఆయన ఇలా రెచ్చగొట్టటం ద్వారా ఉభయ సభల్లో నెలకొన్న ప్రతిష్టంభనను మరింత జటిలం చేశారని చెప్పకతప్పదు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంటు సమావేశాల్లో మోదీ విస్పష్టమైన ప్రకటన చేసి ఉంటే- ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని జనం శంకించి ఉండేవారు కాదు.
*