ఉత్తరాయణం

‘మత్తు వైద్యం’పై అవగాహన ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మత్తు’ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది మద్యం మత్తు.. మాదక ద్రవ్యాల మత్తు.. అధికారపు మత్తు.. అలసత్వపు మత్తు... అంతేకదూ! కానీ, జనం అవగాహన పొందాల్సిన వేరే మత్తు ఉంది.. అదే వైద్యంలో ‘మత్తు’ పాత్ర లేదా మత్తు వైద్యుని (ఎనస్థీషియన్) పాత్ర. చిన్న ముల్లు గుచ్చుకొన్నా, వేలు తెగినా నొప్పితో ఎలా విలవిల్లాడతామో. అదే శరీరాన్ని పైనుండి క్రిందదాకా కోత పెట్టి వైద్యం చెయ్యాలంటే కుదిరే పనేనా? ఆ ఊహతోనే ప్రాణాలు పోవూ! గంటల తరబడి నొప్పిలేని శస్తచ్రికిత్స, మరిన్ని అధునాతన క్లిష్ట చికిత్సలు సాధ్యవౌతున్నాయంటే అది ‘మత్తు వైద్యం’ వల్లనే. ప్రపంచ గతిని మార్చి మానవ వికాసానికి తోడ్పడిన ఐదు అద్భుత ఆవిష్కరణల్ని గుర్తిస్తే అందులో ఒకటి మత్తువైద్యం కనిపెట్టడం. అది లేకపోతే నేడు శస్తచ్రికిత్సల్లో నూతన ఆవిష్కరణలు అసాధ్యం. చదువుకున్న వారిలో కూడా మత్తు వైద్యుడి పాత్ర పట్ల పెద్దగా అవగాహన లేదు. ‘ఏదో సర్జరీ అన్నారు, మత్తు వైద్యుడి ఫీజు ఇంతని హాస్పిటల్‌లో బిల్లువేశారు’ అంతవరకే.. మహాఅయితే- ‘ఏదో మత్తు ఇంజక్షన్ ఇచ్చి వెళ్తారు, సర్జన్ పని చేసుకుంటారు’ అని భావిస్తారు. అది సరైన అభిప్రాయంకాదు. శస్తచ్రికిత్స మొదలవ్వకముందే.. చాలా ముందుగానే మత్తు వైద్యుడి పాత్ర మొదలౌతుంది. రోగి వ్యాధిని, ఇతరత్రా శారీరక పరిస్థితిని, వాడుతున్న మందుల్ని, పడని మందుల్ని, చికిత్సకు తట్టుకొనే శక్తి ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చికిత్సా విధానంపై రోగికి అవగాహన కలిగించి అనవసరపు ఆందోళన తొలగిస్తారు. అవసరమనుకొంటే చికిత్సకు శరీరం తట్టుకొనేలా వైద్యం అందిస్తారు. లేదా నిపుణులతో అందేలా చూస్తారు. మొత్తానికి రోగి శారీరక, మానసిక స్థితిని శస్తచ్రికిత్సను తట్టుకొనేలా సిద్ధం చేస్తారు. అందుకనే రోగి మత్తు వైద్యుని ప్రశ్నలకు పూర్తి సరైన సమాచారం అందించాల్సి ఉంటుంది.
ఆపరేషన్ రూమ్‌లో రోగిని చూసే మొదటి వైద్యుడు మత్తు వైద్యుడు. ఆపరేషన్ పూర్తయ్యి సర్జన్ కత్తులు కడిగేసుకొన్నాక కూడా వుండి రోగి ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకొనే చివరి వైద్యుడూ మత్తు వైద్యుడే. ఈ వ్యవధిలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. సవాలక్ష మత్తుమందుల్లో ఏ మందు రోగికి ఏ మోతాదులో పడుతుందో చూడాలి. నాడి, ఊపిరి వ్యవస్థలతోపాటు సకల వ్యవస్థల్లో మార్పుల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన వైద్యం వెంటనే అందిస్తుండాలి. ఏమాత్రం, ఏ క్షణం ఏమరుపాటు కుదరదు. ప్రాణాపాయస్థితి దోబూచులాడుతుంది. అనుక్షణం క్రియాశీలకంగా ఉండాల్సిన స్థితి మత్తువైద్యుడిది. అందుకనే ఆయన్ని ‘కెప్టెన్ ఆఫ్ సర్జరీ’ అంటారు. ఇంకా ఆయన సేవలు అనుక్షణం పర్యవేక్షణ, వైద్యం అవసరమైన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో, మొండి నొప్పుల నివారణ చికిత్సల్లో, నొప్పిలేని ప్రసవ కేంద్రాల్లో ప్రముఖంగా ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడే బృందాలకు నాయకత్వం వహిస్తారు. ప్రాణాపాయ స్థితిలో వ్యక్తిని ఎలాకాపాడాలో ఆ టెక్నిక్‌ని నేర్పుతుంటారు. అవగాహన కల్పిస్తారు. మత్తు గురించి, మత్తు వైద్యుని గురించి జనం అవగాహన పెంచుకోవాల్సి ఉంది.
- డాక్టర్ డి.వి.జి. శంకరరావు, విజయనగరం
మళ్లీ భావోద్వేగాలు..
తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భావోద్వేగాలు చెలరేగుతూనే ఉన్నాయి. రాజకీయ కోణంలో ‘ఇద్దరు ‘చంద్రులూ’ చిచ్చురాజేస్తూనే ఉన్నారు. అయితే, తెలుగు ప్రజలను ‘ఎవరో విడదీస్తున్నారు, చిచ్చు రేపుతున్నారు’ అనడం సరికాదు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ‘ఆంధ్రోళ్లు, సెటిలర్స్’ లాంటి మాటలు మళ్లీ జోరందుకుంటాయి. ఈమధ్య ‘గడ్డపోళ్లు’ అన్న కొత్తమాట పుట్టుకొచ్చింది. ‘గడ్డపోళ్ల మాయలో పడితే అమరావతి, దిల్లీల నుంచి పాలన ప్రారంభమవుతుంది. ఎందుకోసం రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరదు..’ తెలంగాణ మంత్రి కెటిఆర్ అంటున్నారు. అమరావతి ‘గడ్డపోడు’ మనకు తెలుసు. మరో గడ్డపోడు టి-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మిగిలిన గడ్డపోళ్లు రేవంత్‌రెడ్డి, టి-టిడిపి రమణ అని కెటిఆర్ ఉద్దేశం కాబోలు! గడ్డపోళ్లతో జాగ్రత్త సుమా? అన్నది ఆయన హెచ్చరిక!
-స్నేహమాధురి, పెద్దాపురం