జాతీయ వార్తలు

ఢిల్లీలో 17మంది సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 17మంది సజీవ దహనమయ్యారు. వీరిలో ఒక మహిళ, చిన్నారి కూడా ఉన్నారు. కరోలీబాగ్‌లో అర్పిత ప్యాలెస్ హోటల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో చాలా మంది నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య భారీగా ఉందని పోలీసులు వెల్లడించారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించటంతో చాలా మంది దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతావారు ఊపిరాడక మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. ప్రమాదానికి కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.