క్రీడాభూమి

ఫైనల్‌కు ఢిల్లీ, గుజరాత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ హజారే క్రికెట్ టోర్నీ
అలూర్/బెంగళూరు, డిసెంబర్ 26: విజయ్ హాజరే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్‌లో ఢిల్లీ, గుజరాత్ జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఈ జట్లు వరుసగా హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు జట్లను ఓడించాయి. ఉన్ముక్త్ చాంద్ బ్యాటింగ్ నైపుణ్యం ఢిల్లీని గెలిపించగా, అక్షర్ పటేల్ బౌలింగ్ ప్రతిభ గుజరాత్ విజయానికి బాటలు వేసింది. తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. కెప్టెన్ బిపుల్ శర్మ 51 పరుగులు చేసి జట్టును ఆదుకోగా, ప్రశాంత్ చోప్రా 33, పరాస్ డోగ్రా 28 చొప్పున పరుగులు సాధించారు. సుబోధ్ భట్టి, పవన్ నేగీ, నితీష్ రాణా తలా రెండేసి వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 41.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి ఫైనల్ చేరింది. ఉన్ముక్త్ చాంద్ 80 పరుగులతో రాణించాడు. శిఖర్ ధావన్ 39 పరుగులు చేశాడు.
తమిళనాడుతో జరిగిన సెమీ ఫైనల్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 248 పరుగులు చేసింది. చిరాగ్ గాంధీ (71), మన్‌ప్రీత్ జునేజా (74) అర్ధ శతకాలతో రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తమిళనాడు బౌలర్లలో అశ్విన్ 51 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, విజ్ శంకర్‌కు రెండు వికెట్లు లభించాయి. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడును ఓపెనర్ అభినవ్ ముకుంద్ అండగా నిలిచాడు. అజేయ శతకంతో సత్తా చాటాడు. కానీ, అతనికి మిగతా సభ్యుల నుంచి సరైన సహకారం లభించలేదు. దినేష్ కార్తీక్ (41) కొంత సేపు గుజరాత్ బౌలింగ్‌ను ప్రతిఘటించనా ఫలితం లేకపోయింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ చెలరేగిపోవడం తమిళనాడు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురి చేసింది. అతను 10 ఓవర్లు బౌల్ చేసి, 43 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చాడు. జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. 47.3 ఓవర్లలో 217 పరుగులకు తమిళనాడు ఆలౌట్‌కావడంతో గుజరాత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగే ఫైనల్‌లో ఢిల్లీతో గుజరాత్ ఢీ కొంటుంది. ఇరు జట్ల బలాబలాలు సమానంగా ఉన్న నే పథ్యంలో విజేత ఎవర్నది ఉత్కంఠ రేపుతోంది.
** ఢిల్లీని ఫైనల్ చేర్చిన ఉన్ముక్త్ చాంద్ **