ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘పౌర జాబితా’.. ఓ ప్రహసనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుండి మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన బెంగాలీ, రొహింగియా ముస్లింలను గుర్తించడంలో జాతీయ పౌర జాబితా (నేషనల్ రిజిష్టర్ ఫర్ సిటిజన్స్) ఘోరంగా విఫలమైంది. ఈ జాబితా ఎంత గొప్ప గా పని చేసిందంటే- స్థానిక హిందువులపై ‘అక్రమ వలసదారుల’ని ముద్ర వేసి, ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలను మాత్రం భారత పౌరులుగా గుర్తించింది. గత నెలాఖరున విడుదల చేసిన ‘అస్సాంలోని భారత పౌరుల తుది జాబితా’ అవకతవకలమయంగా ఉంది. నిజమైన భారతీయులను విదేశీయలుగా గుర్తించి, ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి తిష్టవేసిన వారిని భారతీయులుగా ముద్ర వేయడం విడ్డూరం. తమ మూలాలను తెలిపేందుకు ప్రజలు సమర్పించిన పత్రాలను నిగ్గు తేల్చడంలో ఎన్.ఆర్.సి విఫలమైంది.
అస్సాంలో అధికారంలో ఉన్న భాజపా, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ సైతం జాతీయ పౌర జాబితా పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అస్సాంలో దాదాపు నలభై లక్షల మంది బంగ్లా ముస్లిం వలసదారులు ఉన్నారన్నది ఒక అంచనా. కాంగ్రెస్, వామపక్షాలు, ముస్లిం రాజకీయ సంస్థలు తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు దాదాపు ఇరవై లక్షల మంది విదేశీ ముస్లిం వలసదారులను జాతీయ పౌర రిజిష్టరులో చేర్పించారనే ఆరోపణలున్నాయి. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్, ఇతర అనుబంద సంస్థలు మాత్రం అక్రమ వలసదారుల పేర్లు పౌర జాబితాలోకి ఎక్కకుండా ఆపలేకపోయాయి. పౌర జాబితాపై భాజపా, దాని అనుబంధ సంస్థలు దృష్టి సారించనందునే- వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అస్సాంలో స్థిరపడిన దాదాపు పది లక్షల మంది హిందువులపై అక్రమ వలసదారులనే ముద్ర పడింది. పౌర జాబితా రూపొందుతున్న సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు, ముస్లిం సంస్థలు విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింల పేర్లను నమోదు చేయించేందుకు రాత్రింబవళ్లు కృషి చేశాయి. అధికార భాజపా, సంఘ్ పరివార్ సంస్థలు మాత్రం తాము చేయవలసింది చేయకుండా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తే ఏం లాభం? తుది జాబితాలో అక్రమ వలసదారులకు స్థానం లభించి, స్థానిక హిందువులపై అక్రమ వలసదారులనే ముద్ర వేయడం ఎంతమాత్రం సహించరానిది.
కశ్మీర్‌లో హిందువుల ప్ర యోజనాలను కాపాడడం లో ఘోరంగా విఫలమైన భాజ పా, సంఘ్ పరివార్‌లు ఇప్పు డు అస్సాంలో తాము అధికారంలో ఉండి కూడా నిస్తేజంగా ఉండి పోవడం సిగ్గుచేటు. పౌర జాబితాలో స్థా నం సంపాదించిన విదేశీ ముస్లిం వలసదారులను వెనక్కి పంపించటం ఇప్పుడు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అస్సాం ప్రభుత్వం 2018 జూన్ 30న ఎన్.ఆర్.సి రెండవ ముసాయిదాను విడుదల చేసినప్పుడు దాదాపు నలభై లక్షల మంది అక్రమ వలసదారులున్నట్టు గుర్తించారు. గత నెలలో విడుదల చేసిన ఎన్.ఆర్.సి తుది జాబితాలో అక్రమ వలసదారుల సం ఖ్య 19 లక్షలకు తగ్గిపోయింది. గతంలో అక్రమవలసదారులుగా ముద్ర పడి న దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది ఇప్పుడు భారతీయ పౌరులుగా ఖరారయ్యారు. ఇది ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు ఎన్. ఆర్.సి అధికారులు, అ స్సాం పాలకులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అస్సాంలో కాంగ్రెస్ లేదా వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఎన్‌ఆర్‌సి తుది జాబితాపై భాజపా పెద్దఎత్తున గొడవ చేసి ఉండేది. కాంగ్రెస్, వామపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ విదేశీ ముస్లింలను భారతీయ పౌరులుగా ముద్ర వేశాయంటూ భాజపా నాయకులు రొడ్డేక్కేవారు. అస్సాంలో ఇప్పుడు భాజపా అధికారంలో ఉండి కూడా వలసదారుల గుర్తింపు కార్యకర్యం సజావుగా జరగనందుకు ఎవరిని నిందించాలి? బంగ్లా, మయన్మార్‌ల నుండి ముస్లింలు, రొహింగ్యాలు ఇప్పటికీ మన దేశంలోకి చొరబడుతూనే ఉన్నారు. బంగ్లాదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో ముస్లింలు పొట్ట చేతపట్టుకుని అస్సాంలోకి వలస వస్తున్నారు. మయన్మార్‌లో బౌద్ధ సంఘాలు, అక్కడి ప్రభుత్వం రొహింగ్యా ముస్లింలపై దాడులు చేస్తున్నాయి. దీంతో రొహింగ్యాలు అస్సాంలోకి చొరబడుతున్నారు. రొహింగ్యాలు అస్సాం వరకే పరిమితం కావటం లేదు. వారు మన దేశంలో ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాలకు వచ్చి స్థిరపడుతున్నారు. కొందరు రొహింగ్యాలు కశ్మీర్‌కు వెళుతున్నారు. ఇలా వీరు వివిధ ప్రాంతాల్లో తిష్టవేయడానికి పెద్ద ముఠా పని చేస్తోంది. బంగ్లా ముస్లిం చొరబాటుదారుల వల్ల అస్సాంలో మెజారిటీ, మైనారిటీ ప్రజల సం ఖ్య గణనీయంగా మారిపోతోంది. ఇంత కాలం హిందువులు మెజారిటీగా ఉంటే ఇప్పుడిప్పుడే ముస్లిం లు మెజారిటీ వర్గంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిణామాలు ఎదురవుతాయనే అస్సాం గణ పరిషత్ గ తంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమించింది. అక్రమంగా వచ్చిన ముస్లింలను గుర్తించి, వారిని వెనక్కి పంపించాలనే డిమాండ్‌తో అస్సాం గణ పరిషత్ ఉద్యమించగా అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ అస్సాం గణ పరిషత్‌తో చేసుకున్న ఒప్పందం ఆధారంగానే విదేశీయులను గుర్తించే కార్యక్రమానికి తెరలేచింది. ఈ ఉద్యమం ఫలితంగా ఏర్పడిన ఎన్.ఆర్.సి అక్రమ వలసదారులను గుర్తించే బదులు వారికి భారతీయ పౌరసత్వాన్ని అంటగడుతోంది. బంగ్లా నుండి అక్రమంగా వచ్చిన ముస్లింలు ఇప్పుడు అస్సాంతోపాటు పశ్చిమ బెంగాల్‌లోనూ పెద్దసంఖ్యలో ఉన్నారు. బెంగాల్‌లోని రెండు,మూడు జిల్లాల్లో వారిప్పుడు మెజారిటీ వర్గంగా ఉండడం గమనార్హం.
అస్సాంలో కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాలు బంగ్లాదేశ్ ఉండి వచ్చే శరణార్థులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బెంగాల్‌లో ఇప్పుడు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా మైనారిటీల పట్ల అనుకూల విధానాన్ని అవలంబిస్తోంది. మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకునే లక్ష్యంతో కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు అక్రమ వలసలను ప్రోత్సహించాయి. వలసదారులు ఆధార్ కార్డులు సంపాదించుకునేలా ఈ పార్టీలు సహకరించాయి. అస్సాం, బెంగాల్‌లలో నివసించే ముస్లిం అక్రమ వలసదారుల వద్ద ప్యాన్‌కార్డులు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులున్నాయి. ఈ కార్డుల ఆధారంగానే ఎన్.ఆర్.సిలో తమను భారతీయులుగా రిజిష్టరు చేసుకోవటంలో వారు విజయం సాధించారు. కశ్మీర్‌లో ముఖ్యంగా శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో హిందువులను ఇస్లామిక్ ఉగ్రవాదులు తరిమివేస్తుంటే పట్టించుకోని రాజకీయ నాయకులు- రొహింగ్యా ముస్లింలను వెనక్కి పంపించటాన్ని వ్యతిరేకిస్తున్నారు. అస్సాంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బి.జె.పి ప్రభుత్వం ఈ తరహా అక్రమాలను అరికట్టటంలో ఘోరంగా విఫలమైంది.
సుప్రీం కోర్టు కనుసన్నల్లో జరిగిన అస్సాం పౌరుల గుర్తింపు కార్యక్రమం ఎందుకు బెడిసికొట్టింది? విదేశీ వలసదారులను గుర్తించే బదులు వారికి పౌరసత్వం ఇచ్చి, దాదాపు పదిలక్షల మంది హిందువులను అక్రమ వలసదారులుగా ఎలా ముద్ర వేసిందనేది ప్రశ్న. సుప్రీం కోర్టు, ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించినా అధికార యంత్రాంగం బాధ్యతతో వ్యవహరించకపోవటం వలన అక్రమ వలసదారుల గుర్తింపు వ్యవహారం బెడిసి కొట్టింది. ఎన్.ఆర్.సి సిబ్బంది అసమర్థత మూలంగా భారతీయ పౌరులపై అక్రమ వలసదారులుగా ముద్ర పడితే, అక్రమ వలసదారులు భారతీయ పౌరులుగా గుర్తింపబడ్డారు. సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, తప్పులను సరిదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో అస్సాంతోపాటు దేశంలోని మరి కొన్ని ప్రాంతాలు భవిష్యత్తులో మనకు అందకుండాపోతాయి. *

-కె.కైలాష్ 98115 73262