ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రెండు రాష్ట్రాల్లో భాజపా గెలుపు ఏకపక్షం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళి, ప్రజల స్పందనను పరిశీలిస్తే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరు విజయం సాధించబోతున్నారనేది సులువుగా చెప్పవ చ్చు. పోలింగ్ ముగియడంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలపైనే దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా, దాని మిత్రపక్షాలు ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాలతోపాటు స్థానిక సమస్యలు, వాటి పరిష్కారం గురించి ప్రస్తావించడం తెలిసిందే. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ముఖ్యంగా మోదీపైనే వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ప్రచార పర్వంలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజా సమస్యల గురించి ప్రస్తావించకుండా కాంగ్రెస్, ఎన్‌సీపీ నాయకులు కేవలం మోదీని ‘టార్గెట్’ చేశారు.
ప్రతిపక్షం నీరుకారిపోవటంతో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రచారం ఏకపక్షంగా జరిగింది. భాజపా, శివసేన పార్టీలు పెద్దఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఏదో మొక్కుబడిగా ప్రచారంలో పాల్గొన్నాయి. భాజపా తరఫున నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుతు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సహా ఎంతోమంది నాయకులు ప్రచారం చేశారు. కాంగ్రెస్, ఎన్‌సీపీలకు చెందిన నాయకులు భాజపా ప్రచారానికి సరితూగలేక పోయారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియంకా గాంధీ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, కెప్టెన్ అమరీందర్ సింగ్, అశోక్ గెహ్లాట్, భగేల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. హర్యానాలోని మహేంద్రనగర్‌లో సోనియా ఎన్నికల ప్రచారం చేయాలనుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె హాజరుకాలేకపోయారు. మహేంద్రనగర్ ప్రచార సభకు సోనియా నిజంగానే హాజరు కావాలనుకున్నారా? లేక పార్టీ అభ్యర్థుల మనోబలాన్ని కాపాడేందుకు అలా చెప్పి ఆఖరి క్షణంలో తన ప్రచారసభను రద్దు చేసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, రాహుల్ గాంధీ మహారాష్ట్ర, హర్యానాల్లో కేవలం నాలుగైదు బహిరంగ సభలకు మాత్రమే హాజరై ప్రచారం చేశారు. వాస్తవానికి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేసేందుకు తమ ప్రాంతానికి రాకూడదని కాంగ్రెస్ అభ్యర్థులే తమ అధినాయకులకు కొన్నిచోట్ల పరోక్షంగా, మరికొన్ని చోట్ల ప్రత్యక్షంగా స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. వీరంతా సోనియా గాంధీ ప్రచారం చేయాలని కోరుకున్నారు. సోనియా ప్రచారం చేస్తే ఓట్లు పడతాయి కానీ రాహుల్ వల్ల తమకు నష్టం జరుగుతుందని కొందరు అభ్యర్థుల అభిప్రాయం. మహారాష్టల్రో ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఒక్కరే తన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. మిత్రపక్షమైన కాంగ్రెస్ నాయకులతో కలసి ప్రచారం చేసేందుకు ఆయన ఇష్టపడలేదు.
హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భుపేందర్ సింగ్ హుడా, పీసీసీ అధ్యక్షురాలు షెల్జా మాత్రమే ప్రచారం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రచారాన్ని పరిశీలిస్తే భాజపా, శివసేన ఐక్యతతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తే కాంగ్రెస్, ఎన్‌సీపీ, ఇతర మిత్రపక్షాల ప్రచార సరళి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సాగింది. భాజపా ప్రచార వ్యూహం ముందు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బోర్లాపడ్డాయనే చెప్పాలి. ఎన్నికల ప్రచారమంతా ఏకపక్షంగా సాగడంతో ప్రతిపక్షాలు పోలింగ్‌కు ముందే తమ ఓటమిని అంగీకరించినట్లు వ్యవహరించాయి. మోదీ బృందం జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం, ఇతర జాతీయ అంశాల గురించి ప్రచారంలో ప్రస్తావించగా, విపక్షాలు కేంద్రంపైనా, మోదీ-షా ద్వయం పైనా దుమ్మెత్తిపోయటంతో తమ ఎన్నికల ప్రచారాన్ని సరిపెట్టుకున్నాయి.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే ప్రతిపక్షం కనుమరుగైపోతోందనే అనుమానం కలుగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎన్‌సీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఎన్నికలకు ముందే భాజపాలో చేరిపోయారు. దీంతో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూటమికి అభ్యర్థులు కరువయ్యారు. భాజపాలో చేరని వారు వౌనంగానే ఉండిపోయారు. ప్రతిపక్షాలకు చెందిన కొందరు నాయకులు భాజపా టిక్కెట్లు లభించకున్నా ఆ పార్టీలో చేరారు. టిక్కెట్ల కేటాయింపు, గ్రూపు తగాదాల మూలంగా కొందరు కాంగ్రెస్, ఎన్‌సీపీ నాయకులు భాజపా వైపు మొగ్గు చూపారు. కొందరు బాహాటంగానే భాజపా విజయానికి కృషి చేశారు. హర్యానాలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ తన్వర్ ఆఖరి క్షణంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాకు మద్దతు పలికారు. మహారాష్టల్రో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వి.కె. పాటిల్ భాజపా తీర్థం పుచ్చుకున్నాడు. రాహుల్ గాంధీకి ఆప్తుడైన సంజయ్ నిరుపమ్ పార్టీ కోసం పని చేయలేదు. ప్రతిపక్షాలను ఏ విధంగానైనా దెబ్బతీయాలనే గట్టి పట్టుదలతో పార్టీ ఫిరాయింపుదారులను భాజపా పెద్దఎత్తున ప్రోత్సహించింది. భాజపా అధినాయకత్వం మహారాష్ట్ర, హర్యానాల్లో పటిష్టమైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయగా, ప్రతిపక్షాలు సమైక్యంగా సాగలేకపోయాయి.
మహారాష్టల్రో కాంగ్రెస్, ఎన్‌సీపీ నాయకులు తరచూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంతో రెండు పార్టీల మధ్య స్నేహపూరిత వాతావరణం దెబ్బతింది. ఎన్‌సీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం మంచిదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుశీల్‌కుమార్ షిండే సలహా ఇస్తే, ‘ముందు మీరు కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితిపై దృష్టి సారించటం మంచిదం’టూ శరద్ పవార్ చురక వేయవలసి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న సమయంలో ఏంతో రాజకీయ అనుభవం ఉన్న షిండే లాంటి సీనియర్ నాయకుడు పార్టీల విలీనం గురించి మాట్లాడకూడదు. షిండే ప్రకటన మూలంగా కాంగ్రెస్, ఎన్‌సీపీల కార్యకర్తలు కలిసి పని చేయలేకపోయారు. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు సమైక్యంగా వ్యవహరించకపోవటం భాజపాకు బాగా కలసి వచ్చింది. ప్రతిపక్షాలు తమ ప్రాధాన్యతను కోల్పోవటం ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం ఆరోగ్యకరం కాదు.
మహారాష్ట్ర, హర్యానాల్లో నెలకొన్న పరిణామాలు ముం దు ముందు అన్ని రాష్ట్రాల్లోనూ నెలకొంటే దేశంలో ఏకపక్ష రాజకీయ వ్యవస్థ ఏర్పడే పరిస్థితులు నెలకొంటాయి. ప్రస్తుతం భాజపా ఒక్కటే జాతీయ రాజకీయ పార్టీగా అవతరిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామంలో తమ పార్టీకి పునాదులు ఉన్నాయని చెప్పుకునే కాంగ్రెస్ జాతీయ రాజకీయ పార్టీ హోదాను కోల్పోతోంది. ఇక మిగతా జాతీయ పార్టీలు ఎప్పుడో ప్రాంతీయ, జిల్లా పార్టీలుగా మారిపోయాయి. ఈ పరిణామం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటిది. ఒకప్పుడు కాంగ్రెస్ ఒక్కటే మహావృక్షంగా ఉండి భాజపా సహా ఇతర రాజకీయ పార్టీలన్నీ దాని చుట్టూ తిరిగే చిన్న పార్టీలుగా వ్యవహరించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి భాజపా మహావృక్షంగా మారితే, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆ చెట్టు నీడన పరిభ్రమించే పార్టీలుగా మారిపోయాయి. బళ్లు ఓడలుగా, ఓడలు బళ్లుగా మారడం అంటే ఇదే! *

కె.కైలాష్ 98115 73262