ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

శతాబ్దాల సమస్యకు ముగింపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు ఐదు వందల ఏళ్ల నుంచి దేశాన్ని పట్టిపీడిస్తున్న బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదాన్ని ఎట్టకేలకు సుప్రీం కోర్టు అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించడం ముదావహం. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు లౌకికవాదులకు, తీవ్రవాద ముస్లిం నేతలు, సంస్థలకు నచ్చకపోవచ్చు. రాచపుండుగా మారిన సమస్యను సుప్రీం తీర్పు పరిష్కరించిదన్న విషయాన్ని ఎవరూ మరిచిపోరాదు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు బాబ్రీ మసీదు నేలమట్టం అవుతుంటే వౌనం వహించి సమస్యను కొంత పరిష్కరించగా, నేడు సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్పుతో చరమగీతం పాడింది.
అయోధ్య వివాదాన్ని కాంగ్రెస్, భాజపా సహా పలు పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం పచ్చి నిజం. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంపై మాట్లాడుతూనే అయోధ్యలో గుడి తాళాలు తీయించటం వంటి నిర్ణయాలు తీసుకుంది. బాబ్రీ మసీదును నేలమట్టం చేసి భాజపా ఒకసారి అధికారంలోకి వచ్చింది. ఎల్‌కే అద్వానీ రథయాత్ర చేసి భాజపాను అధికారంలోకి తీసుకురావడం తెలిసిందే. మసీదును పరిరక్షిస్తామని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ముస్లింల ఓట్లు దండుకోగా, రామ మందిరాన్ని నిర్మించి తీరుతామంటూ భాజపా హిందువులను ఆకట్టుకుంటోంది. సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చినందున ఇక ఏ పార్టీ కూడా అయోధ్య వివాదంపై రాజకీయం చేసేందుకు వీలు లేకుండాపోయింది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని హిందువులకు కేటాయిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు వల్ల హిందువులు గెలిచారని, ముస్లింలు ఓడిపోయారని ఎవరైనా భావిస్తే పొరపడినట్టే అవుతుంది. ముస్లింలు మసీదును నిర్మించుకునేందుకు ఐదు ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించటం ద్వారా సుప్రీం కోర్టు శతాబ్దాల నాటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది. ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చి న్యాయమూర్తులు విజతను ప్రదర్శించారు. తీర్పులో ఏ మాత్రం విభేదాలున్నా సమస్య మరింత జటిలమయ్యేది, మత సామరస్యం దెబ్బతిని శాంతిభద్రతలకు విఘాతం కలిగి ఉండేది. తీర్పును రూపొందించడంలో న్యాయమూర్తులు పరిపక్వతను ప్రదర్శించారు. షియా పర్సనల్ లా బోర్డు, సున్నీ పర్సనల్ లా బోర్డు, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అకాడా, రామమందిరం న్యాస్ తదితర సంస్థల వాదనలతో పాటు ‘ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ (ఏఎస్‌ఐ) వివాదాస్పద స్థలంలో జరిపిన తవ్వకాలు, అధ్యయనం ఆధారంగా జాగరూకతతో తీర్పు ఇవ్వడం ప్రశంసనీయం.
అలహాబాద్ హైకోర్టు ఆదేశం మేరకు ఏఎస్‌ఐ జరిపిన తవ్వకాల అనంతరం వివాదాస్పద భూమిలోపల పురాతన కట్టడాలు ఉన్నాయని సాక్ష్యాధారాలు లభించాయి. ఇవి హిందువుల కట్టడాలని స్పష్టం చేయలేదు కానీ ఇ స్లామిక్ కట్టడాలు కావని ఏఎస్‌ఐ తన నివేదికలో తే ల్చింది. ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారని చెప్పలేం. ఖాళీ స్థలంలో మసీదును నిర్మించారని కూ డా చెప్పలేమని ఏఎస్‌ఐ స్పష్టం చేసింది. దీంతో ఏదో ఒక కట్టడాన్ని తొలగించి మసీదును నిర్మించారనే స్పష్టమైన సంకేతం కోర్టు ఇచ్చింది. అనేక అంశాలను పరిశీలించాకే వివాదాస్పద భూమిని హిందువులకు ఇవ్వాలనే నిర్ణయానికి కోర్టు వచ్చింది.
అలనాడు కొందరు ముస్లిం ప్రభువులు మన దేశంపై దండయాత్ర చేసినపుడు వేలాది హిందూ ఆలయాలను కూల్చివేశారన్నది కాదనలేని చరిత్ర. ఈ క్రమంలోనే బాబరు తన సైనికాధికారి మీర్‌బక్షీ ద్వారా 1528లో అయోధ్యలోని రామమందిరాన్ని నేలమట్టం చేయించి తన పేరిట మసీదును కట్టించాడు. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానం, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, ఢిల్లీలోని కుతుబ్ మినార్ వంటివి ముస్లిం పాలకుల దాడులకు నిదర్శనాలు. ఇన్ని చారిత్రక అంశాలు మనముందున్నా బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందు మందిరం కూల్చివేత జరగలేదని అన డం సరికాదు. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే 2.77 ఎకరాలను మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు కేటాయించిందని భావించా లి. గతంలో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద భూమిని మూడు ముక్కలు చేసి, రెండు భాగాలను హిందూ సంస్థలకు, ఒక ముక్కను సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో ఎలాంటి పరిష్కారం లభించలేదు. హిందువులు, ముస్లింలకు ఒకే చోట భూమిని కేటాయించడమంటే సమస్య కొనసాగడం తప్ప మరొకటి కాదు. ఈ ప్రమాదాన్ని నివారించేలా ఇపుడు సుప్రీం కోర్టు సరైన తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాలను ఆలయ నిర్మాణానికి కేటాయించడం ద్వారా మెజారిటీ ప్రజల మనోభావాలకు దెబ్బ తగలకుండా చేయడంలో కోర్టు విజయం సాదించింది. మరోచోట మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాలను కేటాయిస్తూ ముస్లింల హక్కులను కాపాడింది. రాజ్యాంగ ధర్మాసనం ఈ విధమైన తీర్పు ద్వారా భావితరాలకు గొడవ లేకుండా చేసింది.
హిందూ దేశంలో తమ దేవుడికి న్యాయం జరగడం లేదనే భావన హిందువుల్లో నెలకొన్నది. బాబ్రీ మసీదు విషయమై పట్టుపట్టడం వల్ల తమ భవిష్యత్తు దెబ్బతింటుందనే భావన ముస్లింలలో చోటు చేసుకున్నది. కాగా, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింలలో అభద్రతా భావం పెరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్య వివాదానికి తెర పడితేనే మంచిదని ముస్లింలు భావించారు. అందుకే పలువురు ముస్లిం నాయకులు ఈ వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు సైతం సిద్దమయ్యారు. కాశీ,మధుర సహా మరికొన్ని ప్రాంతాల్లో మసీదుల భద్రతకు హామీ ఇస్తే బాబ్రీ మసీదును వదులుకునేందుకు ముస్లిం నాయకులు సిద్ధమయ్యారు. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన కొందరు సభ్యులు ఈ విషయాన్ని బాహాటంగా చెప్పారు. సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పు ఇస్తుందని కొందరు ముస్లిం నాయకులు ముందే అంచనా వేశారు. అందుకే సుప్రీం తీర్పు పట్ల చాలా ముస్లిం సంస్థల నాయకులు మామూలుగా స్పందిస్తున్నారే తప్ప, తీవ్రస్థాయిలో ప్రకటనలు చేయటం లేదు. సుప్రీం తీర్పు ఎలా ఉన్నా ఆమోదించాలి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదంటూ గత వారం పది రోజులుగా ముస్లిం నేతలు ప్రకటనలు చేయటం ఇందుకు నిదర్శనం. తీర్పును గౌరవించి, దాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ముందుకు సాగిపోవటం ఇరుపక్షాల ప్రథమ కర్తవ్యం.
*

-కె.కైలాష్ 98115 73262