ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ట్రంప్ విధానాలతో భారత్‌కు మేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా నలభై ఐదవ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌తో వ్యవహరించే విషయంలో భారత్ ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. వాణిజ్యం, ఆర్థిక విషయాల్లో కఠిన విధానాలను అవలంబిస్తానంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాణిజ్యం, ఆర్థిక, ఉపాధి విషయాల్లో ‘్ఫస్ట్ అమెరికా’ విధానానికే ట్రంప్ మొగ్గుచూపితే- పెద్దనోట్ల రద్దు నుండి ఇప్పుడిప్పుడే బైట పడుతున్న మనకు కొన్ని ఇబ్బందులు తప్పవు. అమెరికా విధానాల్లో సంభవించే మార్పులు మనపై ఏ మేరకు ప్రభావం చూపుతాయి? అవి మనకు ప్రతికూలమా? సానుకూలమా? అనేది ఆలోచించాల్సిన విషయం. ‘అమెరికా తన కోసం తాను పనిచేస్తుంది, తమ దేశస్థులకు పెద్దపీట వేసిన తరువాతనే మిగతా దేశాల వారికి ప్రాధాన్యత ఉంటుంది, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం’ అంటూ ట్రంప్ చేసే ప్రకటనలు మన దేశానికి అనుకూలంగా ఉండే అవకాశాలు అధికం. ట్రంప్ ప్రకటించిన- ‘్ఫస్ట్ అమెరికా’, ‘ఇస్లామిక్ తీవ్రవాదంపై ఉక్కుపాదం’ అనే రెండు విధానాలతో భారత్‌కు ఒకవిధంగా మేలు కలుగుతుంది. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ట్రంప్ గనుక అంతం చేస్తే మన దేశానికి కలిగినంత మేలు ప్రపంచంలో ఏ ఈ దేశానికి జరగదు.
ఇస్లామిక్ తీవ్రవాదం మన దేశం పాలిట రాచపుండులా తయారైంది. జమ్ము-కాశ్మీర్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అదుపుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మతోన్మాద ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించినంత కాలం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అదుపుచేయటం అసాధ్యం. సౌదీ అరేబియా లాంటి కొన్ని ఇస్లామిక్ దేశాలు తీవ్రవాదాన్ని తమ ప్రయోజనాల కోసం పెంచి పోషించటంతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ తీవ్రవాదాన్ని కొ న్ని దేశాల వారు రాజకీయావసరాలకు ఉసిగొల్పుతున్నారు. తీవ్రవాదం మూలంగా భారతదేశంతోపాటు పలు ఐరోపా దేశాలకు కంటిపై కనుకులేకుండా పోతోంది. చైనా సైతం ఇస్లామిక్ తీవ్రవాదంతో బెంబేలెత్తిపోతోంది. అందుకే పాకిస్తాన్‌తో తమకున్న సరిహద్దులను భద్రం చేసుకునేందుకు చైనా గోడ కడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అణిచివేస్తానన్న తన మాటను నిలబెట్టుకుంటే మన దేశానికి పెద్ద బెడద తప్పినట్టే.
అమెరికా తదితర అభివృద్ది చెందిన దేశాలు ఇన్నాళ్లూ ఇస్లామిక్ తీవ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబించేవి. పాకిస్తాన్ తదితర దేశాల పట్ల కఠినంగా వ్యవహరించకుండా తీవ్రవాదాన్ని అణిచివేస్తామనే ప్రకటనలు చేసేవి. అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రాంతాల్లో తీవ్రవాదం పట్ల ఒక రకంగా స్పందిస్తూ, భారత్‌లో జరిగే తీవ్రవాదుల దాడుల పట్ల మరో రకంగా స్పందించేవి. అమెరికా తన దేశంలో ట్విన్ టవర్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేయవచ్చు కానీ ముంబయి, భారత పార్లమెంటుపై తీవ్రవాదులు చేసిన దాడికి ప్రతిగా పాకిస్తాన్‌ను మన దేశం దండించకూడదు. పాకిస్తాన్‌లో తలదాచుకున్న తాలిబాన్ అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు అమెరికా సైనికులు అబొట్టాబాద్‌పై మెరుపుదాడి చేయవచ్చు. కానీ, ముంబయి పేలుళ్ల ఘటనకు సూత్రధారి దావుద్ ఇబ్రహీం, పార్లమెంటుపై దాడి చేసిన లష్కరే తయ్యబా అధినేత అజర్ మసూద్ లాహోర్‌లో స్వేచ్ఛగా తిరుగుతుంటే భారత్ నోరు మూసుకుని కూర్చోవాలి.
అమెరికా,చైనాతోపాటు ప లు అభివృద్ధి చెందిన దేశాలు ఇస్లామిక్ తీవ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరిని పాటిస్తున్నందునే ‘ఐసిస్’ లాంటి భయంకర ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు పురుడు పోసుకున్నాయి. పాకిస్తాన్ తదితర ముస్లిం దేశాలు మతోన్మాద తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నిజంగానే ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరిస్తే భారత్‌కే కాదు మొత్తం ప్రపంచానికి ఎంతో మేలు కలుగుతుంది. తమ ఆయుధాల ఎగుమతి కోసం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని వాడుకుంటున్న అభివృద్ధి చెందిన దేశాల ఆలోచనా విధానం మారనంత వరకు ఉగ్రవాదం అదుపులోకి రాదు. ట్రంప్ మాటలు కార్యరూపం దాల్చితే ఇస్లామిక్ తీవ్రవాదం నిజంగానే అంతమొందుతుంది.
ఇక, ‘్ఫస్ట్ అమెరికా’ అనే ట్రంప్ విధానం కూడా మన దేశానికి ఎంతోకొంత కలసి వస్తుందని చెప్పకతప్పదు. ఈ విధానంతో అమెరికాలో మన వారికి ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోవచ్చు. ఈ కారణంగా అమెరికాకు వలస వెళ్లిపోతున్న మన మేధోసంపత్తికి అడ్డుకట్ట పడుతుంది. అమెరికాకు అంకితమైపోయిన మన మేధావులు స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడి ఏదైనా చేయటం గురించి ఆలోచిస్తారు. ఇన్నాళ్లూ మన దేశంలో పేరుగాంచిన వైద్య కళాశాలలు, ఐఐటి తదితర ఉన్నత విద్యా సంస్థల్లో చదివే మన ప్రతిభావంతులైన విద్యార్థులు డాలర్ల వేటలో అమెరికాకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల మనదేశానికి ఎంత నష్టం కలుగుతోందనేది ఊహించటం కష్టమే. మైక్రోసాఫ్ట్,పెప్సికోలా, ఎడోబ్, సిటీ గ్రూప్, క్వుస్ట్ డైగ్నాస్టిక్స్,డిలాట్స్, గూగుల్, ఖోరా లాంటి పెద్దపెద్ద సంస్థలను భారతీయులే నడిపిస్తున్నారు. వీరంతా భారత దేశం నుండి అమెరికాకు వలసపోయిన మేధోసంపత్తికి ప్రతీకలు. వీరంతా మన దేశంలోనే ఉండిపోయి ఉంటే అమెరికా స్థాయిలో కాకున్నా మరో స్థాయిలో మన దేశంలోనే మంచి సంస్థలను ఏర్పాటు చేసి నడిపించే వారు. ఇలా జరిగిఉంటే దేశానికి ఎంత మేలు జరిగేదో ఊహించుకోవచ్చు. అమెరికాలో ఇప్పుడు ‘స్థానిక అమెరికాతత్వం’ బాగా పెరిగిపోతోంది. భారత్ సహా ఇతర దేశాల వారు అమెరికా పౌరసత్వం తీసుకున్నా, వారి పట్ల తెల్లవారికి చిన్నచూపు ఉన్నదనేది అమెరికా అధ్యక్ష ఎన్నికలు స్పష్టం చేశాయి. ట్రంప్ మంచివాడు కాదు, అధ్యక్షపదవికి సరిపోడని ఎవరు ఎంతగా ప్రచారం చేసినా తెల్ల అమెరికన్లు ఆయనకే ఓటు వేసి గెలిపించటమే ఇందుకు నిదర్శనం. మనం కూడా ఇకనైనా భారతీయతకే పెద్దపీట వేయటం మంచిది.

కె. కైలాష్