ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

జనం ఆశలన్నీ జైట్లీ బడ్జెట్‌పైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు వ్యవహారం ఆర్థిక వ్యవస్థను, యావత్ దేశాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ బడ్జెట్- ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కత్తిమీద సాములా మారింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో రోజు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన జైట్లీ 2017-18 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రతిపాదిస్తారు. ఈసారి నెలరోజుల ముందుగా రైల్వే బడ్జెట్‌ను కలుపుకుని వస్తున్న కొత్త బడ్జెట్ దేశం దశ,దిశను మార్చివేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో మరో ప్రత్యేకత ఏమంటే- ‘ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చు’ అనే విధానానికి స్వస్తి పలుకుతూ, ‘పెట్టుబడి, ఆదాయం, ఖర్చు’ వ్యవస్థను ప్రవేశపెట్టటం. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సగటు మనిషి కూడా బడ్జెట్ కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, కొత్త పన్నుల విధానం (జి.ఎస్.టి) అమలు చేస్తున్న నేపథ్యంలో బడ్జెట్ విప్లవాత్మంగా ఉండాలి. కొత్త బడ్జెట్ సేవల వినియోగాన్ని అధికం చేస్తూ పెట్టుబడులు, అభివృద్దిని గణనీయంగా పెంచుతూ యువతకు ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచేదిగా ఉండాలి. డిజిటల్ చెల్లింపులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఇపుడు పన్ను చెల్లింపుదార్ల సంఖ్యను పెంచటం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా వృద్ధి చేయాలని సంకల్పించింది.
ఇంతకాలం నగదు చెల్లింపులకు అలవాటు పడిన ప్రజలు ప్రధాని మోదీ చెప్పగానే ఒక్కసారిగా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అలవరుచుకోలేరు. ప్రజలు డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ఇవ్వవలసి ఉంటుంది. డిజిటల్ చెల్లింపుల పై విధించే 2.5 శాతం పన్నును పూర్తిగా తొలగించాలి. పెద్దమొత్తంలో జరిగే నగదు ఉపసంహరణపై పన్ను లు విధించవచ్చు. బ్యా ంకులు కలిసి వస్తే తప్ప డిజిటల్ చెల్లింపులు పెరగవు. జైట్లీ ప్రతిపాదించే బడ్జెట్ సాదాసీదాగా ఉంటే ఎన్.డి.ఏ ప్రభుత్వం విపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. మోదీ నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం ఇది వరకే సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌లో జనాకర్షణ పథకాలకు స్వస్తి పలికింది. రాయితీ పథకాలను త్యజించటం పట్ల మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తమైనా ఆ తరువాత ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే కొత్త బడ్జెట్‌లో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరేందుకు భారత్ సిద్ధంగా ఉన్నందున సగటు మనిషి ఆదాయం గణనీయంగా పెరిగేలా బడ్జెట్‌కు రూపకల్పన జరగాలి. ఆదాయపు పన్ను గరిష్ట పరిమితిని పెంచటం ద్వారా సగటు మనిషి ఆర్థిక స్థోమతను పెంచే దిశగా ప్రతిపాదనలు ఉండాలి. ప్రజలు చెల్లించే పన్నులను దుర్వినియోగం చేసే పథకాలు, కార్యక్రమాలకు చెల్లుచీటీ పలకాలి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు క్రమంగా అవినీతిమయమైపోయాయి. ఈ పథకాలకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు లభించటం లేదు. గ్రామీణాభివృద్ధికి ఏటా వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనే విధంగా ఉంది. ఇలా ఎందుకు జరగుతోందనే ఆత్మ పరిశీలన ఎంతో అవసరం. ప్రభుత్వ పథకాల్లో ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోంది. దీన్ని అరికట్టగలిగితే కొంతవరకైనా ఫలితాలను ఆశించవచ్చు. ఎన్.డి.ఏ ప్రభుత్వం ఎంతో హంగూ ఆర్భాటంతో ప్రారంభించిన పరిశ్రుభత పథకాలు సైతం అవినీతికి అద్దం పడుతున్నాయి. పట్టణాలకు ‘స్వచ్ఛ సర్ట్ఫికెట్లు’ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పంపించిన అధికారులు సైతం అవినీతికి పాల్పడుతున్నారు. ఇటీవల ఓ అధికారి ఒక పట్టణానికి పరిశుభ్రతకు సంబంధించిన సర్ట్ఫికెట్ ఇచ్చేందుకు రెండున్నర లక్షలు డిమాండ్ చేసిన ఉదంతంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ అమలు చేసిన పథకాల తీరుతెన్నులను నిజాయితీతో ఆడిట్ చేయించి లొసుగులను తొలగించాలి. ఇలా చేసినపుడే బడ్జెట్‌లో ప్రతిపాదించే పథకాలు సమర్థవంతంగా అమలవుతాయి. పథకాలకు కేటాయించిన నిధులను నెలల తరబడి మురగబెడుతూ ఫిబ్రవరి, మార్చి నెలల్లో హడావుడిగా ఖర్చు చేసే విధానానికి మంగళం పాడాలి. అవినీతి రహిత వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పన్ను ఎగవేతదార్లపై కొరడా ఝళిపించి నల్లధనం పోగుకాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ లక్ష్యసాధనకు నూతన బడ్జెట్‌లో పలు చర్యలను ప్రకటించవలసి ఉంటుంది. ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, వివిధ వృత్తుల వారు పన్నులు ఎగవేసేందుకు వీలు లేకుండా పన్నుల వ్యవస్థను సులభతరం చేయవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ పట్ల ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నించవలసి ఉంటుంది. దేశానికి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చే ఆదాయపు పన్ను శాఖను అవినీతికి దూరంగా ఉంచాలి. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఇతరులు ఏ విధంగా పన్నులు ఎగవేయవచ్చుననేది ఆదాయపు పన్ను శాఖ అధికారులే చెబుతుంటారన్నది బహిరంగ రహస్యం. ఈ శాఖ పనితీరులో మార్పు తీసుకురావలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.
ఇక, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలంటే పెట్టుబడులను బాగా పెంచవలసి ఉంటుంది. ఈ రంగంలో ఆధునిక విధానాలకు పెద్దపీట వేసేందుకు అవసరమైన కేటాయింపులు చేయాలి. నిర్మాణ రంగం ఊపందుకోవాలంటే భూములు, ఇళ్ల క్రయవిక్రయాలపై స్టాంప్ డ్యూటీని తగ్గించవలసి ఉంటుంది. 2017-18 వార్షిక ప్రణాళికలో పెట్టుబడులు విప్లవాత్మకంగా లేకపోతే ప్రధాని మోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా దేశం రూపురేఖలను సమూలంగా మార్చివేస్తానన్న మోదీ ఇందుకు సంబంధించిన కార్యచరణ పథకాన్ని కొత్త బడ్జెట్‌లో చూపించగలగాలి.
*

కె. కైలాష్