ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

వందేళ్ల కాంగ్రెస్‌కు ఎంతటి దుర్దశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ‘స్థానిక ఎన్నికల’ ఫలితాలు చూసిన తర్వాతైనా రాహుల్ గాంధీ మేల్కొనకపోతే- రాజకీయ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం నుండి కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ కాపాడలేరు. మహారాష్టల్రో ఒకప్పుడు ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకూ పనికిరాని స్థానాకి పడిపోవటంతో పాటు ‘శివసేన’ పంచన చేరవలసిన దుస్థితికి చేరింది. బృహన్ ముంబయి నగర పాలక సంస్థతో పాటు మహారాష్టల్రోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించగా, శివసేన పార్టీ రెండో స్థానంలో నిలిచింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎందుకూ కొరగాని మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ముంబయి మేయర్ పదవి బిజెపికి దక్కకుండా చేసేలా శివసేనకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తన రాజకీయం కోసం ఇతర పార్టీలను ఉపయోగించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఇతరులకు ఉపయోగపడటం మినహా ఏమీ చేయలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. ఎందుకిలా జరుగుతోందని కాంగ్రెస్ యువనేత రాహుల్ ఆలోచించటం లేదు. కాంగ్రెస్‌ను ఈ దుస్థితి నుండి కాపాడేందుకు ఏం చేయాలి? ఎలాంటి రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలి? అనే విషయాలపై ఆయన దృష్టి సారించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పతనం కావటం ఈ మధ్య ప్రారంభమైన ప్రక్రియ కాదు. చాలా కాలం నుండి ఆ పార్టీ ప్రతిష్ట మసకబారుతున్నా అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టే ఇప్పుడు ఈ దురవస్థ ఎదురవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ లాంటి కులతత్వ, ప్రాంతీయతత్వ పార్టీతో పొత్తు పెట్టుకోవటం, ఆ పార్టీ విధించిన షరతులకు లోబడి సీట్ల సర్దుబాటు చేసుకోవడం కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. సమాజ్‌వాదీ నేత, యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో సీట్ల సర్దుబాటు చేసుకోవటంలో రాహుల్ తొలుత విఫలం కావడంతో కాంగ్రెస్ అధినేత్రి సో నియా గాంధీ, ఆమె కుమార్తె ప్రి యాంక జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దవలసి వచ్చింది. అనారోగ్యం కారణంగా సోనియా పార్టీ వ్యవహారాలకు దూరం కావడంతో కాంగ్రెస్‌కు దిక్కూ దివాణం లేకుండాపోయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న సోనియా కొంతకాలంగా పార్టీ వ్యవహారాలను రా హుల్ గాంధీకి వదిలివేస్తున్నారు.
సోనియా పార్టీ అధ్యక్షురాలైనప్పటికీ, రాహుల్ అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎం పిక, ఎన్నికల వ్యూహం, పొ త్తులు, ప్రచారం వంటి అన్ని అంశాలనూ యువనేత చూసుకుంటున్నారు. సమర్థవంతమైన నేతగా రాహుల్ ఎదగలేకపోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలామంది భావిస్తున్నారు. పార్టీలో కీలక బాధ్యతలను రాహుల్ చేపట్టిన నాటి నుంచి జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగిన బిహార్ తదితర రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనేది జగద్విదితమే. బిహార్ శాసనసభ ఎన్నికల్లో జెడి(యు) అధినాయకుడు నితీష్‌కుమార్, ఆర్‌జెడి నేత లాలూప్రసాద్ యాదవ్‌ల అభీష్టం మేరకు నడుచుకోవలసిన దుస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొన్నది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇదే పరిసర్థితి నెలకొన్నది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పా ర్టీతో సీట్ల సర్దుబాటు మూలంగా కాంగ్రెస్‌కు తాత్కాలికంగా కొంతలాభం కలగటంతోపాటు పరువుప్రతిష్టలు కొంతవరకు నిలబడే అవకాశాలున్నాయి. అయితే, దీర్ఘకాలంలో ఈ పొత్తువల్ల కాంగ్రెస్‌కు రాజకీయంగా తీరని హాని కలగటం ఖాయం. వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని రాహుల్ భావించారు. అందుకు మాయావతి నిరాకరించటంతో గత్యంతరం లేక సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నది. పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు రాహుల్ ఇంతవరకూ చేసిన ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు.
నిజం చెప్పాలంటే ఆయన అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మూలంగా కాంగ్రెస్‌కు నష్టం తప్ప లాభం కలగటం లేదు. పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా నానాటికీ తీసికట్టుగా మారుతోంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం బిజెపి అధికారంలోకి వస్తుండగా కాంగ్రెస్ మాత్రం వెనుకబడిపోతోంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లో బిజెపి ఇప్పుడు అధికారంలో ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి పుంజుకోవటం అనేది ఊహించని విషయం. దేశంలోని అన్ని ప్రాంతాలకూ ‘కమలం’ విస్తరిస్తుంటే కాంగ్రెస్ కొద్ది రాష్ట్రాలకు పరిమితమైపోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి అజేయ శక్తిగా మారుతూ ‘కాంగ్రెస్ విముక్త భారత్’ నినాదంతో ముందుకు సాగుతుంటే రాహుల్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
మోదీ లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కొనేందుకు రాహుల్ సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలగాలి. తన నాయకత్వ పటిమను చాటుకుంటూ కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించగలగాలి. అయితే, రాహుల్ ఇలాంటివేవీ చేయలేకపోతున్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్‌ను- ‘ముస్లింల పార్టీ, అభివృద్ధి నిరోధక పార్టీ, అంతరించిపోతున్న పార్టీ’ అంటూ మోదీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే, కేవలం జనాకర్షక డైలాగులతో ప్రజలను మెప్పించేందుకు రాహుల్ విఫలయత్నం చేస్తున్నారు. పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండగా మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసేందుకు రాహుల్ ఆరాటపడుతున్నారు. మోదీని ఎదుర్కొనేందుకు అవసరమైన రాజకీయ పరిణతిని ఆయన ప్రదర్శించటం లేదు.
కాంగ్రెస్ స్వీయరక్షణలో పడిపోయి చాలా కాలమవుతున్నా, ఈ వాస్తవాన్ని యువనేత గుర్తించకపోవటం ఆశ్చర్యకరం. ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందని ఎవరూ అనుకోవడం లేదు. ఉత్తరాఖండ్‌లో అధికారాన్ని నిలుపుకుని, పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవటంతోపాటు ఉత్తరప్రదేశ్‌లో గౌరవ ప్రదమైన రీతిలో సీట్లు గెలుచుకోని పక్షంలో కాంగ్రెస్ కనుమరుగైపోయి, బిజెపి కోరుకుంటున్న ‘కాంగ్రెస్ విముక్త భారత్’ ఏర్పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
*

కె. కైలాష్