ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విపక్షాల ఐక్యత పగటికలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ప్రజాస్వామ్యం స్థిరంగా ఉండాలంటే జా తీయ, రాష్ట్రాల స్థాయిలో అధికార పక్షానికి దీటైన ప్ర తిపక్షం ఉండటం ఎంతో అవసరం. బలమైన విపక్షం లేకపోతే అధికార పక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలు, సిద్ధాంతాలను కాలరాస్తుంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను కట్టడి చేసేందుకు అవసరమైన ప్రతిపక్షం క్రమంగా కనుమరుగైపోతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే భాజపా నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమికి 31 శాతం ఓట్లు పడితే మొత్తం ప్రతిపక్షానికి కలిపి 69 శాతం ఓట్లు వచ్చాయి. కాబట్టి కొత్త రాష్టప్రతి ఎన్నిక విషయంలో ప్రజల తీర్పు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నదంటూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేసిన విశే్లషణ నూటికి నూరు శాతం నిజం. అయితే, ప్రతిపక్షం ముక్కచెక్కలుగా ఉండటంతో ప్రజలు వేసిన 61 శాతం ఓట్లు విలువ లేకుండాపోయాయి. 31 శాతం ఓట్లు సంపాదించిన ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షాలు కలిసికట్టుగా వ్యవహరించనందున జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడటం లేదు. వాస్తవానికి విపక్షాల్లో జాతీయ స్థాయి పార్టీలనేవి లేకుండాపోతున్నాయి.
ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ఒక్కటే ప్రతిపక్షంలో ఉన్న జాతీయ స్థాయి పార్టీ. అది కూడా త్వరలోనే ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోవటం ఖాయం. సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి రావటంతోపాటు జాతీయ స్థాయిలో తన ఉనికిని కాపాడుకోగలిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం పోయినప్పటి నుండి కాంగ్రెస్ త్వరితగతిన విచ్ఛిన్నమైపోతోంది. రాహుల్ గాంధీ కీలకపాత్ర నిర్వహించటం ప్రారంభించినప్పటి నుండి కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా తయారైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు సైతం తమ పార్టీ మనుగడ గురించి ఆందోళన చెందుతున్నారు. రాహుల్ వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగితే పార్టీ ఉనికికే ప్రమాదమనే అభిప్రాయం ఏర్పడుతోంది. గ్రామస్థాయి నుండి పార్టీ యంత్రాంగం, ప్రజల్లో గుర్తింపు ఉన్న కాంగ్రెస్ ఒక్కటే జాతీయ స్థాయిలో భాజపాను ఎదుర్కొనగలుగుతుంది. కాంగ్రెస్ ఓ ‘కుటుంబ పార్టీ’ కావటంతో సోనియా కుటుంబ సభ్యులు లేకుండా మనుగడ కొనసాగించే పరిస్థితి లేదు. అరవై ఆరు సంవత్సరాల వయస్సున్న సోనియా అనారోగ్యం మూలంగా పార్టీ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారు. ఆమె నెలల తరబడి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండవలసి వస్తోంది. కొన్నిసార్లు ఆమె వైద్యం కోసం విదేశాలకు వెళ్లవలసి వస్తోంది. ఈ పరిస్థితిలో పార్టీ బాధ్యతలను రాహుల్ చేపట్టి, పూర్తి సమయాన్ని కేటాయిస్తే తప్ప కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదు. అయితే, ఆయన ఎప్పుడు స్వదేశంలో ఉంటాడో ఎప్పుడు విదేశాలకు వెళతాడో అన్నది చెప్పటం కష్టం.
కొత్త రాష్టప్రతి ఎన్నిక కోసం దేశ రాజధానిలో అధికార, ప్రతిపక్షాల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్న సమయంలో రాహుల్ అకస్మాత్తుగా అమ్మమ్మను చూడాలంటూ ఇటలీ వెళ్లిపోవటం ఆశ్చర్యకరం. రాహుల్ వైఖరి కాంగ్రెస్ నేతలకు, ఇతర విపక్షాల వారికి విస్మయం కలిగించింది. ఆయన ఇటలీ ప్రయాణంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైటికి ఏమీ అనలేకపోయినా లోలోపల మాత్రం మండిపతుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టవలసిన రాహుల్ ఇలా వ్యవహరిస్తే పార్టీ బతికి బట్టగలుగుతుందా? అనారోగ్యంతో సోనియా రాజకీయాలకు దూరమై, రాహుల్ ఇలాగే వ్యవహరిస్తుంటే- భాజపా కోరుకుంటున్న ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నిజం కావడం ఖాయం. కాంగ్రెస్ మనుగడకు ఏ మాత్రం చేటు కలిగినా జాతీయ స్థాయిలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. జాతీయ స్థాయిలో భాజపా మినహా మరో జాతీయ పార్టీ అనేదే ఉండదు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతుంది.
కాంగ్రెస్‌ను పక్కన పెడితే ప్రతిపక్షంలో మరో జాతీయ పార్టీయే లేదు. సిపిఎం, సిపిఐలు జాతీయ స్థాయి గుర్తింపును ఏనాడో కోల్పోయాయి. ఈ రెండు వామపక్ష పార్టీలకు జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నా అవి ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారిపోయాయి. ఇక మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలు కావటంతో జాతీయ స్థాయి రాజకీయ వ్యవస్థ బలహీనమైపోయింది. ఎస్‌పి, బిఎస్‌పి, టిఎంసి, తెలుగుదేశం, డిఎంకె. అన్నా డిఎంకె, టిఆర్‌ఎస్, బిజూ జనతాదళ్, అకాలీదళ్, జెడియు, ఎన్‌సి, ఎన్‌సిపి, వైఎస్‌ఆర్‌సిపి తదితర పార్టీలు ప్రాంతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నాయి. వీటికి జాతీయ ప్రయోజనాల దృక్పథం అంతగా లేదు. ప్రాంతీయ పార్టీల మూలంగా ఆయా రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది తప్ప దేశం మొత్తానికి కాదు. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల మేలు కోసం జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టిన సందర్భాలు లేకపోలేదు.
మహాకూటమి గెలుస్తుందా...?
అలనాడు కేవలం ఇద్దరు ఎంపిలు ఉండిన భాజపా ఇప్పుడు 281 మంది ఎంపిలతో కేంద్రంలో అధికారంలోకి రాగా, ఒకప్పుడు దాదాపు నాలుగు వందల సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం నలభై ఐదు మంది ఎంపిలతో ప్రతిపక్షం హోదాను కూడా నిలబెట్టుకోలేకపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బిజెపిని కట్టడి చేసేందుకు విపక్షాలు జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. భాజపాను నిలువరించే శక్తియుక్తులు కాంగ్రెస్‌కు లేనందున ‘మహాకూటమి’ ఏర్పాటుకు కొన్ని విపక్షా లు ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఈ ప్రయత్నం ఫలించే సూచనలు కనిపించటం లేదు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన ఆర్‌జెడి అధినాయకుడు లాలూ ప్రసాద్ తదితర నాయకులు మహాకూటమి ఏర్పాటుకు ప్రతిపాదన చేసినందునే ఇది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. అవినీతికి మారుపేరుగా మారిన లాలూ ప్రసాద్ , ఆయన కు టుంబ సభ్యులపై ఇటీవల సిబిఐ, ఎన్‌పోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) దాడులు జరిగాయి. ఇందుకు ప్రతీకారంగా బిజెపిని మట్టికరిపించాలని, దీనికి మహాకూటమి పనికొస్తుందని లాలూ ఆశపడుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో భారీఎత్తున ఆదాయాన్ని నష్టపోయిన మరికొన్ని ప్రతిపక్షాలు కూడా భాజపాను దెబ్బతీయాలనుకుంటున్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం మహాకూటమిని ఏర్పాటు చేస్తే అది ఎంత కాలం నిలదొక్కుకుంటుంది. అలాంటి ‘కూటమి’ని ప్రజలు ఆదరిస్తారనే గ్యారంటీ ఎంత మాత్రం కనిపించటం లేదు. జెడియు అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మినహా ప్రతిపక్షాలకు చెందిన చాలామంది నాయకులు, ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెడకు శారదా చిట్‌ఫండ్ కేసు చుట్టుకున్నది. బిఎస్‌పి అధినాయకురాలు మాయావతిపైనా అవినీతి ఆరోపణలున్నాయి. యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ గూండాయిజానికి మారుపేరుగా ప్రసిద్ది చెందింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు అసంఖ్యాకం. దేశ ప్రయోజనాల విషయంలో నిబద్ధత గల నాయకులు ఏర్పాటు చేసే పార్టీలు లేదా కూటములు మాత్రమే కొన్నాళ్లయినా నిలదొక్కుకోగలుగుతాయి. అలాంటి నేతలు ఇ ప్పుడు బాజపాకు దీటుగా జాతీయ స్థాయిలో పటిష్టమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం మనుగడకు ఇది అవసరం కూడా.
*

కె. కైలాష్