ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

చైనా, పాకిస్తాన్ ఎత్తుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్.ఎస్.జి సభ్యత్వం కోసం అహర్నిశలు చేసిన కృషి నిష్ఫలమైంది. తెర ముందు చైనా, తెర వెనక పాకిస్తాన్ చేసిన కుతంత్రాల మూలంగా అణు సరఫరాదారుల బృందంలో భార త దేశానకి సభ్యత్వం లభించలేదు. భారత్‌కు సభ్యత్వం నిరాకరిస్తున్నట్లు ఎన్.ఎస్.జి రెండు రోజుల ప్లీనరీ సమావేశానంతరం శక్రవారం ప్రకటించింది. నరేంద్ర మోదీ ఇటీవల పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులతో జరిపిన చర్చలు వృధా అయ్యాయి. ప్రధాన మంత్రి అమెరికా, మెక్సికో, స్విట్జర్‌లాండ్ దేశాల్లో పర్యటించినప్పుడు ఎన్.ఎస్.జి సభ్యత్వానికి ఈ దేశాల మద్దతు ప్రకటించటం తెలిసిందే. సియోల్‌లో జరిగిన ఎస్.ఎస్.జి సమావేశంలో మెక్సికో, స్విట్జర్‌లాండ్ దేశాలు ఇచ్చిన హామీని మరిచి ఎన్.పి.టి కోసం పట్టుపట్టం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చైనా అవలంభించిన మొండి వైఖరి మూలంగానే భార త దేశానికి ఎన్.ఎస్.జి సభ్యత్వం లభించలేదు. ఎన్.ఎస్. జిలోని ఆణ్వాయుధ దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చినా చైనా అభ్యంతరం చెప్పటం గమనార్హం. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, ఎన్.పి.టి పై (నాన్ ప్రొలిఫిరేషన్ ఆఫ్ న్యుక్లియర్ వెపన్స్ ట్రీటీ) సంతకం చేయని భారత దేశానికి సభ్యత్వం ఎలా ఇస్తారంటూ చైనా ప్రశ్నించింది. చైనాకు బ్రెజిల్, స్విట్జర్‌లాండ్, టర్కీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, మెక్సికో,న్యూజీలాండ్‌లు మద్దతు ఇచ్చాయి. ఎన్.ఎస్.జి సభ్యత్వానికి ఎన్.పి.టిపై సంతకం చేయటం ప్రథమ షరతు అనేది ఎలా విస్మరిస్తామంటూ చైనా తదితర దేశాలు ప్రశ్నించాయి. దీనితో చేతికందినట్లు కనిపించిన ఎన్.ఎస్.జి సభ్యత్వం కనుమరుగైపోయింది. దీనితో ఎన్.టి.పిపై సంతకం చేయకుండా భారత దేశానికి ఎన్.ఎస్.జి సభ్యత్వం లభించదనేది మరోసారి స్పష్టమైంది. ఎన్.ఎస్.జి సభ్యత్వం లభిస్తే అణు విద్యుత్ ఉత్పాదన అత్యంత సులభతరం అవుతుంది. అణు ఇంధనంతోపాటు అణు విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ఇతర అన్ని పరికరాలు సునాయసంగా లభిస్తాయి.
ఎన్.ఎస్.జి సభ్యత్వం నిరాకరించటం ద్వారా ఎన్.పి. టిపై సంతకం చేసేలా భారత దేశంపై వత్తిడి తెస్తున్నారా? అనే అనుమానం కూడా కలుగుతోంది. ఎన్.పి.టిపై సంతకం చేయటం అంటే అణ్వాయుధాలను వదులుకునేందుకు భారత దేశం సిద్ధం కావలసి ఉంటుంది. అందుకే మన దేశం ఎన్.పి.టిపై సంతకం చేసేందుకు నిరాకరిస్తోంది. ఎన్.పి.టి ఒప్పందం అమెరికా,రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా దేశాల అణ్వాయుధ ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యవస్థ. ఈ ఒప్పందం ప్రకారం కేవలం ఈ ఐదు దేశాలు మాత్రమే అణ్వాయుధాలను కలిగి ఉండేందుకు వీలుంటుంది. ఈ ఒప్పందంపై సంతకం చేసే ఇతర దేశాలు అణ్వాయుధాలను తయారు చేయటం, కలిగి ఉండటం, ఇందుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు ఇవ్వకూడదు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా అణ్వాయుధాలను ఉత్పత్తి చేయకూడదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇంత వరకు 191 దేశాలు సంతకంలు చేశాయి. భారత దేశం, పాకిస్తాన్, ఇజ్రాయిల్, దక్షిణ సుడాన్ దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాయి. భారత, పాకిస్తాన్, ఉత్తర కొరియా దేశాలు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించటంతోపాటు తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బహిరంగంగా ప్రకటించుకున్నాయి. ఇజ్రాయిల్ తమ అణ్వాయుధాల గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
ఎన్.పి.టి ప్రకారం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్. బ్రిటన్‌లు మాత్రమే అణ్వాయుధ దేశాలుగా గుర్తింపబడ్డాయి. అణ్వాయుధాలను కలిగి ఉన్న ఐదు దేశాలు,అమెరికా, రష్యా,చైనా, ఫ్రాన్స్. బ్రిటన్ దేశాలు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను కాలక్రమంలో నష్ట పరచటం ద్వారా ప్రపంచాన్ని అణ్వాయుధ రహితం చేస్తాయ. అయితే ఇది ఎప్పుడు, ఎలా జరుగుతుందనేది ఈ ఐదు దేశాలు ఎంత వరకు వెల్లడించలేదు. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితం చేసేందుకు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను ఎప్పుడు, ఏ విధంగా ధ్వంసం చేస్తారనేది ఈ ఐదు దేశాలు ఇంత వరకు ప్రకటించలేదు. మన పక్కన ఉన్న చైనా వద్ద వందలు, వేల అణ్వాయుధాలున్నాయి. మనకు పక్కలో బల్లెమైన పాకిస్తాన్ వద్ద కనీసం 150 అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్ తన వద్ద ఉన్న అన్ని అణ్వాయుధాలను భారత దేశం గురి పెట్టి ఉంచింది. మనపై ఒక సారి అకారణంగా దాడి చేసిన చైనాను ఏ విధంగా కూడా విశ్వసించడం సాధ్యం కాదు. అందుకే ఎన్.పి.టిపై సంతకం చేయకుండానే ఎన్.ఎన్.జి సభ్యత్వానికి కృషి చేయవలసి ఉన్నది.
ఎన్.పి.టిపై సంతకం చేయటం ఆత్మహత్యాసదృశ్యం. అణ్వాయుధ దేశాలుగా తమకు తాము గుర్తింపు ఇచ్చుకున్న ఐదు దేశాలు ఎన్.పి.టి ద్వారా ఇతర దేశాలు అణ్వాయుధాలను ఉత్పత్తి చేయకుండా నిరోధించేందుకు ప్ర యత్నిస్తున్నాయి. తద్వారా అణ్వాయుధాల విషయంలో తమకు ఉన్న గుత్త్ధాపత్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయించటం ద్వారా మన అణు శక్తిని దెబ్బతీసేందుకు చైనా, పాకిస్తాన్‌లు వేసిన ఎత్తుగడ ప్రస్తుతానికి ఫలించినా ఇది ఎక్కువ కాలం నిలవదు. శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న భారత దేశం ఆర్థిక ఫలాలో భాగం పంచుకోవాలనుకునే ఐరోపా, అమెరికా దేశాలు మన దేశానికి ఎన్.ఎస్.జిలో సభ్యత్వం ఇప్పించక తప్పదు. అణు రంగంలో మన పరిశోధన ఆశించిన దానికంటే ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నది. ఈ లోపాన్ని పూడ్చుకునేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలి. ఎన్.ఎస్.జి సాంకేతిక సహాయం అవసరం లేని స్థాయికి స్వశక్తితో ఎదిగేందుకు కృషి చేయటమే మన ముందున్న కర్తవ్యం.