ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రగిలిన రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలకు సంబంధించి గత ఏడాది కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. పదునైన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, యుద్ధాలతో రాజకీయ రంగం రగిలిపోయింది. ఆ రాజకీయ పరిణామాలు కొత్త సంవత్సరంలోనూ ప్రభావం చూపనున్నాయి. దేశ ప్రథమ పౌరుడు.. రాష్టప్రతి ఎన్నిక, ఆ తరువాత రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి ఎన్నికలతో ఏడు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌లో బి.జె.పి ఆరోసారి అధికారంలోకి వచ్చింది. పప్పుగా ముద్ర పడిన రాహుల్ గాంధీ రాజకీయంగా ఎదగటంతోపాటు సంవత్సరాంతంలో కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఇవన్నీ కొత్త సంవత్సరంలో రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలే.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ స్థానంలో తమ అభ్యర్థిని రాష్టప్రతిగా తెచ్చుకునేందుకు ఎన్.డి.ఏ వద్ద పూర్తి మెజారిటీ ఉన్నా ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని రంగంలోకి దించాయి. ఎన్.డి.ఏ అభ్యర్థి రామ్‌నోథ్ కోవింద్‌కు పోటీగా ప్రతిపక్షం లోకసభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను రంగంలోకి దించినా ఫలితం లేకుండాపోయింది. రామ్‌నాథ్ కోవింద్ మంచి మెజారిటీతో రాష్టప్రతిగా ఎన్నికయ్యారు. బిహార్ గర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద రాజకీయం చేశారు. రాష్టప్రతి పదవిని ఆశిస్తున్న మాజీ ఉపప్రధాన మంత్రి లాల్‌కృష్ణ అద్వానీని రంగం నుండి తొలగించేందుకు మోదీ బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ముందుకు తెచ్చారు. సుప్రీంకోర్టు మరోసారి సమన్లు జారీ చేయటంతో అద్వానీ గత్యంతరం లేని పరిస్థితిలో వౌనం వహించక తప్పలేదు. అద్వానీ బి.జె.పికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే రాష్టప్రతి పదవికి ఆయననే ఎంపిక చేయాలి కానీ మోదీ మాత్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కోవింద్‌కు ఓటు వేశారు. ఉపరాష్టప్రతి ఎన్నికలో కూడా మోదీ తన బాపతు రాజకీయం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం.వెంకయ్య నాయుడును ఉపరాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం వెనక ఏపీ బి.జె.పి రాజకీయాలు ఇమిడి ఉన్నాయన్నది ప్రచారం కావటం తెలిసిందే.
సుప్రీంకోర్టు గత సంవత్సరం జనవరి రెండవ తేదీనాడు మతం, కులం, జాతి, వర్గం, భాష ఆధారంగా ఎన్నికల్లో ఓట్లు అడగటాన్ని అవినీతి ఆచారంగా ప్రకటించి అలాంటి వారి ఎన్నికను కొట్టివేయవచ్చునని తీర్పు ఇచ్చి సంచలనం సృష్టించింది. మనది లౌకిక దేశమైనా కొన్ని పార్టీలు కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయనేది అందరికి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మతం పేరుతో రాజకీయం చేస్తూ దేశానికి ప్రమాదంగా మారిన పార్టీలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది. గత మార్చ్‌లో జరిగిన ఐదు రాష్ట్రాలు, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ శాసనసభల ఎన్నికల్లో నరేంద్ర మోదీ మరోసారి తన పట్టును నిరూపించుకున్నారు. ఐదింట నాలుగు రాష్ట్రాల్లో బి.జె.పి అధికారంలోకి వచ్చింది. పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్ అవినీతికి మారుపేరుగా మారిన అకాలీదళ్‌ను మట్టికరిపించి కాంగ్రెస్ పరువు నిలబెట్టారు. గోవాలోకూడా కాంగ్రెస్ అధికారంలోకి రావలసింది. కానీ పార్టీ అధినాయకత్వం రాజకీయ అలసత్వం మూలంగా ఆ రాష్ట్రాన్ని బి.జె.పి సునాయాసంగా కొట్టుకుపోయింది. ఇక ఉత్తర ప్రదేశ్‌లో బి.జె.పి సాధించిన భారీ విజయం ప్రతిపక్షాలను బాగా నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ యు.పిలో చేసిన ప్రయోగం ఘోరంగా విఫలమైంది. బిహార్ మాదిరి మహాకూటమి యు.పిలో మంచి ఫలితాలు ఇస్తుందనే ఆశతో రాహుల్ గాంధీ ఎస్.పి యువ నాయకుడు అఖిలేష్ యాదవ్‌తో కలిసి చేసిన మహాకూటమి రాజకీయం బెడిసికొట్టింది. యు.పి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మూలంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వం పటిమపై అనుమానాలు వ్యక్తం చేయటం ప్రారంభించారు. 2016 నవంబర్‌లో పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి సంచలనం సృష్టించిన నరేంద్ర మోదీ 2017 జూలైలోఅత్యంత వివాదాస్పద జి.ఎస్.టి పన్ను విధానాన్ని అమలులోకి తీసుకురావటం ద్వారా దేశం వ్యాపార రంగంతో పాటు ప్రజలను ఒక కుదుపు కుదిపారు. జి.ఎస్.టి పన్నుల విధానం పట్ల వ్యాపారులతోపాటు ప్రజలు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు, చేస్తూనే ఉన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ జి.ఎస్.టి. వ్యాపారులతో పాటు ప్రజల నుండి వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని తగ్గించేందుకు బి.జె.పి నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం జి.ఎస్.టి పన్నులను పలుమార్లు సవరించవలసి వచ్చింది. ముఖ్యంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యాపారులకు పలు రాయితీలు ప్రకటించక తప్పలేదు. 2017 సంవత్సరంలో చోటు చేసుకున్న మరో రాజకీయ సంచలన సంఘటన బిహార్‌లో ఫిరాయింపులు. గతంలో ఒకసారి భజన్‌లాల్ మొత్తం పార్టీని ఫిరాయించి ‘ఆయారాం, గయారాం’ రాజకీయ నానుడికి శ్రీకారం చుట్టటం తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూడా గత జూలైలో చేశాడు. 2014 లోకసభ ఎన్నికలకు బి.జె.పి తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించినందుకు నిరసనగా నితీష్‌కుమార్ ఎన్.డి.ఏకు రాజీనామా చేయటం తెలిసిందే. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వ్యూహం మేరకు కాంగ్రెస్, జె.డి (ఎస్), లాలూ ప్రసాద్‌యాదవ్ నాయకత్వంలోని ఆర్.జె.డితో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టటం తెలిసిందే. జె.డి (ఎస్) కంటే ఆర్.జె.డికి ఎక్కువ సీట్లు లభించటంతో లాలూ ప్రసాద్‌యాదవ్, మంత్రి పదవులు చేపట్టిన ఆయన ఇద్దరు కుమారుల అవినీతితో విసిగిపోయిన నితీష్‌కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మహాకూటమి నుండి తప్పుకొని నరేంద్ర మోదీతో చేతులు కలిపాడు. బి.జె.పి మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టి రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్‌లకు షాక్ ఇచ్చాడు. నరేంద్రమోదీని బి.జె.పి ప్రధానమంత్రి అభ్యర్థిగా వ్యతిరేకించిన నితీష్‌కుమార్ తన రాజకీయం కోసం అతని నాయకత్వాన్ని ప్రశంసించక తప్పలేదు. ఆందుకే రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరనేందుకు ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. రాజకీయాల్లో అధికారంకోసం ఎవరు ఎవరితోనైనా చేతులు కలుపుతారు, దీనికి పార్టీ సిద్ధాంతాలు, నీతి,నియమం ఎంతమాత్రం అడ్డురావు.
ఇక గత నవంబర్, డిసెంబర్‌లో జరిగిన హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసన సభలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షాతోపాటు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి అగ్ని పరీక్షగా మారటం అందరికి తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌లో సునాయాసంగా గెలిచినా గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక మోదీ ప్రతిష్ఠకు సవాల్‌గా మారింది. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగకుండా చూడటం ద్వారా మోదీ మరోసారి రాజకీయం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంపై వత్తిడి తీసుకురావటం ద్వారా మొదట నవంబర్‌లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరిపించి ఆ తరువాతకి డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా మోదీ చక్రం తిప్పారు.
గుజరాత్‌లో 22 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న బి.జె.పి ఆరోసారి అధికారంలోకి వచ్చేందుకు మోదీ, అమిత్‌షా అన్ని రకాల రాజకీయాలు చేశారు. గుజరాత్‌తో పెద్దఎత్తున రాయితీలు, పథకాలు ప్రకటించటంతోపాటు జి.ఎస్.టి మూలంగా కోపంతో ఉన్న వ్యాపారులను ప్రసన్నం చేసుకునేందుకు పన్నుల స్లాబ్ రేట్లు కూడా మార్చారు. ఆయన దాదాపు నలభై ఐదురోజుల పాటు గుజరాత్‌లో విస్తృతంగా పర్యటించి బి.జె.పి కోసం ప్రచారం చేశారు. రాహుల్‌గాంధీ కూడా గుజరాత్ ఆసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నరేంద్ర మోదీకి చమటలు పట్టించారు. పటీదార్ అనామత్ ఆందోళన్ కమిటీ అధ్యక్షుడు హార్దిక్ పటేల్, వెనుకబడిన వర్గాల నాయకుడు అల్పేష్ థాకుర్, గిరిజనుల నాయకుడు జిగ్నేష్ మెవానీలతో చేతులు కలిపి బి.జె.పిని ఒక ఆట ఆడించారు. రాహుల్ గాంధీ నేరుగా నరేంద్ర మోదీపై అనుక్షణం దండెత్తటం ద్వారా రాజకీయంగా ఎంతో ఎదిగిపోయారు. రాహుల్ గాంధీ ‘పప్పు’ దశ దాటి అసలు, సిసలైన నాయకుడుగా ఎదిగిపోయారు. నరేంద్ర మోదీ పలుకుబడి తగ్గుతోందనేందుకు, రాహుల్ గాంధీ జాతీయస్థాయి నాయకుడుగా ఎదిగాడనేందుకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. హిమాచల్‌ప్రదేశ్‌లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బి.జె.పి గుజరాత్‌లో తొంబై తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదు సీట్లు అటూఇటైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిల్ సిబల్, మణిశంకర్ అయ్యర్ చేసిన ఆలోచనారహిత ప్రకటనలు, వ్యవహారం గుజరాత్‌లో బి.జె.పికి కలిసి వచ్చింది. ఇదిలా ఉంటే గత సంవత్సరం చోటు చేసుకున్న మరో పెద్ద రాజకీయ సంఘటన రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావటం. అత్యంత ఫార్సుగా జరిగిన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావటం గమనార్హం.

కె కైలాష్