కృష్ణ

డెల్టా ఆధునికీకరణలో అవసరమైన పనులు గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్
బంటుమిల్లి, డిసెంబర్ 8: డెల్టా ఆధునికీకరణలో భాగంగా అవసరమైన పనులను గుర్తించాలని పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇరిగేషన్ బంగ్లాలో బంటుమిల్లి మెయిన్ కెనాల్ పరిధిలో డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా చేపట్టాల్సిన పనులపై అధికారులతో ఆయన సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో అనవసరంగా ఉన్న డెల్టా ఆధునీకరణ పనులను గుర్తించి వాటి స్థానంలో అవసరమైన పనులను గుర్తించాలన్నారు. రూ.20కోట్ల మేర బంటుమిల్లి మెయిన్ కెనాల్ పరిధిలో 13 ప్యాకేజీల్లో పనులు ఉన్నాయన్నారు. అత్యవసర పనులను గుర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఇఇ ఎన్ సత్యనారాయణ, డిఇ సత్యనారాయణ, ఎఇలు సూర్య భరత్, సిద్ధార్థ్, విజయకుమార్, తూర్పు కృష్ణా నీటి సంఘాల ఉపాధ్యక్షులు వరుదు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

కల్తీ మద్యం ఘటనకు కారకులైన
ఎక్సైజ్ అధికారులపై
చర్యలు తీసుకోండి
* బిజెపి నేత రామినేని
గుడివాడ, డిసెంబర్ 8: విజయవాడలో కల్తీ మద్యం ఘటనకు కారకులైన ఎక్సైజ్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణ చెప్పారు. మంగళవారం స్థానిక గోపాలరావుపేటలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు నడుస్తున్నాయన్నారు. ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మద్యం షాపులు నిర్ణీత వేళలు పాటించేలా చూడాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి దొంగచాటుగా వస్తున్న మద్యాన్ని అడ్డుకోవాలని సూచించారు. కాగా ఇటీవల జరిగిన జిల్లా పార్టీ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులను విమర్శించిన బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి పద్మినిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీరాణి ఉత్తర్వులు జారీ చేసినట్టు రామినేని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ సూరే గాంధీ, పట్టణ అధ్యక్షుడు వలపర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

రంగు మారిన ధాన్యం కొంటాం
పెడన, డిసెంబర్ 8: ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు ఉపయోగించుకోవాలని పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ కోరారు. స్థానిక మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా రైతులకు రాయితీతో కూడిన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. అలాగే భూసార పరీక్షలు చేయించుకున్న రైతులకు వాటికి సంబంధించిన పత్రాలను వ్యవసాయ శాఖాధికారుల ద్వారా కాగిత వెంకట్రావ్ అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులకు సూచించారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్ హన్ను, ఎంపిపి ముచ్చు నాగేశ్వరమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ గుడిశేవ రామారావు, కొంకేపూడి సర్పంచ్ శలపాటి వీరప్రసాద్, కౌన్సిలర్ బెజవాడ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.