శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కాలువగట్లపై ఆక్రమణలు తొలగించే ముందు వారికి ప్రత్యామ్నాయం చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్
వేదాయపాళెం, నవంబర్ 29: నగరంలో కాలువగట్లపై నివాసమున్న వేలాది మంది పేదలకు ప్రత్యామ్నాయంగా పక్కా గృహాలు, కనీస వసతులు కల్పించి ఆ ప్రాంతాల నుండి వారిని తొలగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. ఆదివారం ఆయన నగరంలోని మన్సూర్‌నగర్, ఖుద్దూస్‌నగర్ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలను ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టి కాలువలు కుంచించుకుపోవడం వల్లే మొన్న కురిసిన భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయని తెలిపారు. ఆక్రమణలు తొలగించే సందర్భంలో ప్రతిఒక్కరికి ప్రత్యామ్నాయంగా పక్కా ఇల్లు నిర్మించి, అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అలాకాకుండా పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోమని వారి పక్షాన నిలబడి ఉద్యమిస్తామని తెలిపారు. ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన మన్సూర్‌నగర్, ఖుద్దూస్‌నగర్, ఇతర లోతట్టు ప్రాంత ప్రజలకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నగర కార్యదర్శి ఎం రమేష్ పాల్గొన్నారు.