జాతీయ వార్తలు

ఏపి ‘హోదా’ అమలు ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్షణం ప్రకటించాలని లోక్‌సభలో వైకాపా డిమాండ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని కూడా అమలు చేయరా? అని వైకాపా సభ్యుడు సుబ్బారెడ్డి ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. సుబ్బారెడ్డి గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. మన్మోహన్ సింగ్ 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో రాష్ట్ర విభజన చట్టంపై చర్చ జరుగుతున్న సమయంలో జోక్యం చేసుకుని ఈ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. తాము అధికారంలోకి వస్తే పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని బిజెపి గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రకటించిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తున్నా ప్రత్యేక హోదాను అమలుచేసే విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని ఆయన దుయ్యబట్టారు. ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కల్పించే ప్రస్తావనే పరిశీలనలో లేదని కేంద్ర ప్రణాళికా శాఖ సహాయ మంత్రి ఈ సంవత్సరం మార్చిలో లోక్‌సభలో చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిశే్చష్టులను చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారని సుబ్బారెడ్డి చెప్పారు. వైకాపా నేత జగన్‌ఆమరణ నిరాహార దీక్ష కూడా నిర్వహించారని ఆయన వివరించారు.
గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా
ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ వైకాపా ఎంపీలు గురువారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాదరావు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిలబడి నిరసన ప్రదర్శన చేశారు. ఏపి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్లకార్డులను ప్రదర్శించారు.