హైదరాబాద్

శ్రీమేధ కోచింగ్ సెంటర్ మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరేళ్ల కోచింగ్ పేరిట లక్షలాది రూపాయలు వసూలు
అమీర్‌పేటలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 22: రాజధాని నగరంలోని శ్రీమేథ కోచింగ్ సెంటర్ తన నాలుగు సెంటర్లను మంగళవారం మూసివేసింది. చార్టెడ్ అకౌంటెంట్ (సిఏ) ఆరేళ్ల కోచింగ్ పేరిట శ్రీమేథ యాజమాన్యం సుమారు 86మంది విద్యార్థుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసింది. అమీర్‌పేట, అల్వాల్, దిల్‌సుఖ్‌నగర్, ఇసిఐఎల్‌లో నాలుగు బ్రాంచీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. నష్టాలతో నడుస్తున్న తమ సంస్థ బ్రాంచీలను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఆయా బ్రాంచీల్లోని విద్యార్థులు అమీర్‌పేట్ బ్రాంచీకి రావాలంటూ చెప్పింది. దీంతో శ్రీమేథ ప్రధాన కార్యాలయం అమీర్‌పేట్ ఎదుట విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. తాము చెల్లించిన ఫీజులు తిరిగి చెల్లించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో యాజమాన్యం కొంత మేరకు చెల్లిస్తామనడంతో తాము ఒప్పుకోమని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అమీర్‌పేట కార్యాలయం ఎదుట కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే ఈ విషయమై విద్యార్థులు ఇప్పటి వరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. తాము చదువుకునేందుకే రూ. 60వేల నుంచి 1.20లక్షల వరకు ఫీజలు చెల్లించామని ఇప్పుడు సంస్థను మూసేస్తే తమ భవిష్యత్తు ఏం కావాలని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల డిమాండ్‌ను ఆలోచిస్తామని ఓ బ్రాంచి ఇన్‌చార్జి గిరిధర్‌కుమార్ విద్యార్థులకు నచ్చజెప్పడంతో విద్యార్థులు కొంత మేరకు శాంతించినట్టు తెలుస్తుంది. ఈ విషయమై శ్రీమేథ చైర్మన్ పవన్‌కుమార్‌ను వివరణ కోరేందుకు యత్నించగా అందుబాటులో లేరు.