మెదక్

మెదక్‌లో డెంగీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 50 సంవత్సరాల వ్యక్తికి లక్షణాలు
* స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ
* ఫత్తేనగర్‌లో ప్రత్యేక సర్వే
మెదక్, డిసెంబర్ 11: మెదక్ పట్టణం 6వ వార్డు ఫత్తేనగర్‌లో 50 సంవత్సరాల రమేశ్‌కు డెంగీ వ్యాధి నమోదైనట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ నెల 4న రమేశ్ స్థానిక డాక్టర్ల వద్ద ట్రీట్‌మెంట్ పొందిన తరువాత ఈ నెల 7న కోంపల్లి రస్ సూపర్‌స్పెషాలిటీ అస్పత్రిలో అడ్మిట్ అయిన రమేశ్‌కు డెంగీ వ్యాధిగా అక్కడి వైద్య నిపుణులు నిర్దారించి చికిత్స చేశారు. ఈ నెల 10న డిస్‌చార్జ్ అయిన రమేశ్ మెదక్ చేరుకున్నారు. ఈయకు డెంగీ పాజిటివ్‌గా అక్కడి వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెదక్ అర్బన్ సూపర్‌వైజర్ లిల్లిగ్రేస్, సిస్టర్లు భూలక్ష్మీ, మధురవాణి, వీణ, మొయిన్ వర్కర్ పవన్‌కుమార్ శుక్రవారం నాడు ఫత్తేనగర్‌లో సర్వే నిర్వహించి అక్కడి నీళ్లను పరీక్షలు నిర్వహించారు. నల్ల్లా గుంతలు, మురికి కాలువలను కూడా పరిశీలించారు. ఫత్తేనగర్ 6వ వార్డులో బాధితుడు రమేశ్ నివసిస్తున్న ప్రాంతమంతా చాలా భయంకరంగా పారిశుద్ధ్యంలో మునిగి ఉంది. పక్కకే నల్లా గుంతల పక్కకే టాయిలెట్స్ నిర్మించి ఉన్నారు. దీని వలన మంచినీళ్లు కలుషితమయ్యే ప్రమాదాలు ఉన్నట్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించిన వెల్త్ సూపర్‌వైజర్ లిల్లిగ్రేస్ మాట్లాడుతూ తెలిపారు. ఈ ప్రాంతంలో 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. హ్యాండ్ బోర్లు లేవు, నల్లా గుంతలో నీళ్లు పట్టుకోడానికి దిగిన వృద్దురాలు ఈశ్వరమ్మ ఆ నల్లా గంతలో పడి కాలు విరిగినట్లు ఆమె స్వయంగా తెలిపింది. పారిశుద్ధ్య పనుల విషయంలో మున్సిపల్ వర్కర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత పౌరులు శ్రీనివాస్‌గౌడ్, రమేశ్‌గౌడ్, శ్రీను, సిద్దేశ్‌గౌడ్ తదితరులు పత్రిక విలేఖరులకు వివరించారు. జనప్రియ హోటల్ వెనుక ఉన్న స్థలం కోర్టు వివాదంలో ఉన్నందున ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉంది. దీని వలన దోమలు, పందికొక్కులు, సుందెలుకలు, తోక పురుగులు సంచరిస్తున్నాయన్నారు. డ్రైన్స్‌ను మున్సిపల్ వర్కర్లు గత నెల రోజుల నుండి పరిశుభ్రం చేయడం లేదని వారు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న బోరులో నీళ్లు ఉన్నాయి. 300 ఫీట్లు ప్లస్సింగ్ చేస్తే నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ ప్రాంత యువకులు తెలిపారు. మంచినీటి కోసం ఇక్కడ మహిళలందరు సదూర ప్రాంతానికి వెళ్లి తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. మున్సిపల్ సంబంధించిన ట్యాప్‌లు మురికి కాలువల్లో కలిసి ఉన్నాయి. దోమల వలన జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ ప్రాంత ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి డెంగ్యూ పాజిటివ్‌గా నమోదు అయిన రమేశ్ నివసిస్తున్న ఫత్తేనగర్‌లో తక్షణమే శానిటేషన్ పనులు నిర్వహించి, ఆ ప్రాంతమంతా బ్లీచింగ్ పౌడర్‌తో మురికి కాలువలు, మంచినీటి పిట్‌లలో వేసి పరిశుభ్రం చేయాలని హెల్త్ సూపర్‌వైజర్ లిల్లిగ్రేస్ ఈ మేరకు మెదక్ మున్సిపల్ కమీషనర్‌కు నివేదిక అందజేయబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతమంతా పారిశుద్య నిర్లక్ష్యానికి గురైందని కూడా ఆమె నివేధికలో పేర్కొన్నారు. తక్షణమే ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రసాద్‌కు ఆమె నివేధికను అందజేశారు.