జాతీయ వార్తలు

దేశం ఎటుపోతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిశా నిర్దేశన లేదు
ఉద్యోగాలు, పెట్టుబడుల ఊసేలేదు
మోదీ సర్కార్‌పై చిదంబరం నిప్పులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఎన్‌డిఏ ప్రభుత్వంపై సోమవారం ఇక్కడ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ దశాదిశా లేకుండా పోయిందని నరేంద్ర మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు.
దిశ నిర్దేశన లేకపోవడంతో దేశం ఎటుపోతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ఉద్యోగాలు, పెట్టుబడుల ఊసేలేకుండా పోయిందని మాజీ ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. బిజెపి నాయకత్వంలోని 19 ఏళ్ల ఎన్‌డిఏ ప్రభు త్వం ప్రజల ఆశలను పూర్తిగా వమ్ముచేసిందని ఆయన విమర్శించారు. ఉపాధి లేదు, ప్రైవేటు పెట్టుబడులు లేవుఅని ఆయన విరుచుకుపడ్డారు. ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందన డానికి గత వారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నివేదిక చూస్తే అర్థమవుతుందని ఆయన అన్నారు. తాము ఎలాంటి ప్రయత్నం చేయలేకపోయామన్న విషయం మోదీ ప్రభుత్వం అంగీకరించినట్టేనని చిదంబరం తెలిపారు. 2016-17కి సంబంధించి జిడిపిలో 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని కేంద్రం ఏ మేరకు చేరుకుంటుందని ఆయన ప్రశ్నించారు. సమస్యలను ఎదుర్కొనే సత్తా నరేంద్ర మోదీ సర్కార్‌కు లేదన్న ఆయన దిశ నిర్దేశన లేకపోవడం వల్లే దేశం ఎటుపోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఎక్కడ విఫలమైందన్న ప్రశ్నకు చిదంబరం బదులిస్తూ‘ పరిస్థితులను అధిగమించే సత్తా లేదు. ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది?. మేం అధికారంలోకి వస్తే ప్రైవేటు పెట్డుబడులు ఇబ్బడిముబ్బడిగా తీసుకొస్తామన్నారు. ఏవి ఎక్కడ తెచ్చా రు?’అని నిలదీశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోపించారు. యుపిఏ అధికారం నుంచి దిగిపోయే సమయంలో దేశ వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండేదని ఆయన గుర్తుచేశారు.