రాష్ట్రీయం

‘టిడిపిది అభివృద్ధి వాదం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: తెలుగుదేశం పార్టీది అభివృద్ధివాదమని, రాష్ట్ర జిడిపి అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక పేర్కొన్నారు. వైకాపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూడలేక కళ్లు మూసుకుంటోందని అన్నారు. సోమవారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రేణుక మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ ఆర్ధిక సంవత్సరానికి 10.48 శాతం జిడిపి లక్ష్యంగా పాలన ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలపైనా ప్రత్యేక దృష్టితో అభివృద్ధిని పరుగులు పెట్టించడం వైకాపా కంటికి కనబడకపోతే చేయగలిగిందేమీ లేదని, అడ్డగోలు విభజనతో రెక్కలు విరిగిన నవ్యాంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వృద్ధిరేటు పరుగులు పెట్టడం ఆశ్చర్యకరమేమీ కాదని, అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్ధిక వృద్ధిరేటు చాలా వేగంగా ఉంటుందనే వాస్తవం కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చామని, నదుల అనుసంధానానికి నాంది పలికారని, భూగర్భ జలాలు పెంపొందే గట్టి చర్యలు ప్రభుత్వం చేపట్టిందని, రైతులను ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించారని, ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించామని, పారిశ్రామికాభివృద్ధినే తీసుకుంటే 16 నెలల్లో లక్షన్నర కోట్ల పెట్టుబడిగా రాబట్టి ఎంఓయులను కూడా పూర్తి చేసి, ఉత్పాదన ప్రక్రియను ప్రారంభించిన ఘనత చంద్రబాబుదేనని ఆమె పేర్కొన్నారు.