తెలంగాణ

దేవినేని ఉమకు హరీష్ ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆర్డీఎస్ సాగునీటి ప్రాజెక్టుపై మాట్లాడుకుందామంటూ తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు బుధవారం ఉదయం ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమకు ఫోన్ చేశారు. పరస్పరం చర్చించుకుని నీటి ప్రాజెక్టులపై ఒక అంగీకారానికి వద్దామని హరీష్ ప్రతిపాదించారు. అయితే, తెలంగాణలో చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపైనా చర్చించాల్సి ఉందని దేవినేని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టుల వల్ల ఎపికి నష్టం జరుగుతుందని ఆయన హరీష్‌కు వివరించారు. సమస్యలను ఎపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళదామని, ముందుగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శుల భేటీ జరిగాక మాట్లాడదామని దేవినేని ఉమ అన్నట్లు సమాచారం. ముందుగా ఆర్డీఎస్‌పై మాట్లాడితే బాగుంటుందని హరీష్ చెప్పగా, ఆ సంగతి తర్వాత చూద్దామని దేవినేని సమాధానమిచ్చినట్లు తెలిసింది.